కుంభ రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

కుంభ రాశి కూడా ఒక రాహు గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్ని కుంభ రాశి యొక్క ప్రభావంలో ఉన్నాయి. కావున వైద్య సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి. ఉంటుంది. పోలీస్ డిపార్టుమెంటు ఉద్యోగస్తులకు, అలాగే సైంటిస్ట్ సంబంధిత ఉద్యోగస్తులకు అలాగే ఆధ్యాత్మిక సంబంధిత ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. అలాగే వీరు ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. ఏవి కాకుండా మిగతా సంస్థలలో లేదా వేరే వపాలు చేసే వారికి ధన సంపాదన ఉంటుంది, కానీ ఉహించినంతగా ఉండదు.

కుటుంబం :

తల్లి, తండ్రులకు పుత్రులు / కూతుళ్ళ కారణంగా కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. అలాగే కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉంటాయి.

ఆరోగ్యం :

గురు శుక్ర గ్రహ ప్రభావములో కుంభ రాశి ఉంది. కావున బిపి, మధుమేహం ఉన్నవారు జనవరి నెలలో చాల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆపరేషన్స్, సర్జరీస్ జరిగిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండలి.

పరిహారం:

ప్రతి సోమవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతిరోజు చంద్ర గాయత్రి మంత్రం 108 సార్లు జపించాలి

చంద్ర గాయత్రి –

  • ఓం క్షీర పుత్రాయ విద్మహే
  • అమృతతత్త్వాయ ధీమహి,
  • తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/