కర్కాటక రాశి / లగ్నం – 2023

కర్కాటక రాశి / లగ్నం – అధిపతి చంద్ర గ్రహం

 • శని గోచరము – జనవరి 17 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. కర్కాటక రాశి నుండి కుంభ రాశి 8వ స్థానము అవుతుంది
 • గురు గోచరము – కర్కాటక రాశి నుండి మీన రాశి 9వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

ఒక గురు గ్రహ గోచార ప్రభావంలో కర్కాటక రాశి ఉంది. కావున ప్రత్యేకించి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, అలాగే టూరిజం, ఆహార సంబంధ వ్యాపారాలు మరియు వైద్య సంబంధ వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన బాగుంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి 2023 సంవత్సరంలో లాభాలు చాలా బాగుంటాయి అలాగే మంచి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే ఈ రాశి వారికి షేర్ మార్కెట్ వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అలాగే స్థిరాస్తులుమీద పెట్టుబడులు పెట్టె అవకాశాలు కూడా ఉన్నాయి.

ఒకవేళ మీ వ్యక్తిగత రాశి చక్రంలో చంద్ర, శుక్ర గ్రహాలు రాహు, కేతు గ్రహ గోచార ప్రభావంలో ఉంటె షేర్ మార్కెట్ వ్యాపారాలు చేసేవారికి నష్టాలు ఉంటాయి.

 • కర్కాటక లగ్నానికి అధిపతి చంద్ర గ్రహం – ఈ చంద్ర గ్రహం లగ్నంలో లేదా  2వ స్థానం సింహ రాశిలో లేదా 5వ స్థానం వృచ్చిక రాశిలో లేదా 9వ స్థానం మీన రాశిలో లేదా 10వ స్థానం మేష రాశిలో స్థితి అయి, అదనంగా   7వ స్థానం మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె ధన సంపాదన బాగుంటుంది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది
 • అలాగే 11వ స్థానం వృషభ రాశిలో చంద్ర గ్రహానికి చెందిన రోహిణి నక్షత్రంలో స్థితి అయి 7వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు చాలా బాగుంటాయి.
 • అలాగే ప్రస్తుతము వీరికి చంద్ర భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
 • అలాగే 3వ స్థానం కన్య రాశిలో చంద్ర గ్రహానికి చెందిన హస్త నక్షత్రములో స్థితి అయి 7వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
 • గురు గ్రహ గోచారం చంద్ర గ్రహం మీద ఉంటె ధన సంపాదన పెరుగుతుంది. అలాగే అదృష్టాలు కూడా ఉంటాయి.
 • అలాగే శని గ్రహ గోచారం చంద్ర గ్రహం మీద ఉంటె ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

 • సంఖ్యా శాస్త్ర ప్రకారం జూన్ 22 నుండి జులై 22 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.

కుటుంబం :

 • సహజంగా 2023 సంవత్సరంలో సహజంగా కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉండదు. మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో గురు గ్రహ గోచార దృష్టి చంద్ర గ్రహం మీద ఉంటె కుటుంబంలో అందాలు ఉంటాయి.
 • అలాగే తండ్రి కొడుకుల మధ్య మంచి స్నేహ బంధం ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి.
 • అలాగే మీ యొక్క రాశి చక్రంలో చంద్ర గ్రహం బలంగా ఉంటె ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 • అలాగే మీ యొక్క రాశి చక్రంలో చంద్ర గ్రహం బలంగా ఉంటె ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి. అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఖచ్చితంగా గర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
 • ఒకవేళ శని గ్రహ గోచార దృష్టి చంద్ర గ్రహం మీద ఉంటె మానసిక ప్రశాంతత ఉండదు.

ఆరోగ్యం :

 • కర్కాటక రాశి ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తులు విషయాలకు కారకత్వం వహిస్తుంది. అలాగే చంద్ర గ్రహం ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం, ఋతుక్రమ సమస్యల గురించి తెలియజేస్తుంది.
 • సహజంగా 2023 సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి ఆస్తమా మరియు నిద్ర సమస్యలు బాధిస్తాయి.
 • రాశి చక్రంలో శని గ్రహ గోచార దృష్టి చంద్ర గ్రహం మీద ఉండి చంద్ర గ్రహానికి 4,5 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 • అలాగే చంద్ర గ్రహానికి 12వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె నిద్ర లేమి మరియు రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
 • చంద్ర గ్రహానికి శుక్ర గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి జలరాశులతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రతగా ఉండాలి.

పరిహారాలు :

 • ప్రతి సోమవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు చంద్ర గాయత్రి మంత్రం జపించాలి.
 • కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి

శ్రీ చంద్ర గాయత్రి –

 • ఓం క్షీర పుత్రాయ విద్మహే
  అమృతతత్త్వాయ ధీమహి,
  తన్నోశ్చంద్రః ప్రచోదయాత్

పునర్వసు గాయత్రి మంత్రం –

 • ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
  అదితి పుత్రాయ ధిమహి
  తన్నో పునర్వసు ప్రచోదయాత్

పుష్యమి గాయత్రి మంత్రం –

 • ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
  మహాదిశాయాయ ధిమహి
  తన్నో పుష్య: ప్రచోదయాత్

ఆశ్లేష గాయత్రి మంత్రం –

 • ఓం ఓం సర్పరాజాయ విద్మహే
  మహారోచకాయ ధిమహి
  తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

2023 సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? – https://nsteluguastrology.com/astrology-predictions-2023/