కర్కాటక – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

రాశి చక్రంలో ఉన్న 9 గ్రహాలు కర్కాటక రాశి ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి ఎగుమతి, దిగుమతి మరియు వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన చాల బాగుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా మంచి గుర్తింపు వస్తుంది. అలాగే వీరు స్థిరాస్తులు కొనే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ధన సంపాదన పెరుగుతుంది

కుటుంబం :

కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. కొడుకులు/కూతుళ్ళ గురించి మంచి శుభవార్తలు వింటారు.

ఆరోగ్యం :

ఈ కొత్త సంవత్సరం జనవరిలో సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఉంటాయి. గతంలో విషపు జ్వరాలు, టైపాయిడ్వ, మలేరియా వచ్చిన వారు చాలా జాగ్రతగా ఉండాలి.

పరిహారం:

ప్రతి అది, సోమవారాలు శివాలయానికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు సూర్య గాయత్రి మంత్రం 108 సార్లు జపించాలి

సూర్య గాయత్రి –

  • ఓం భాస్కరాయ విద్మహే
  • దివాకరాయ ధీమహి,
  • తన్నోసూర్యః ప్రచోదయాత్.

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/