మకర రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

ఒక రాహు గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్ని మకర రాశి యొక్క ప్రభావంలో ఉన్నాయి. కావున జనవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి గురింపు వస్తుంది. అలాగే జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. లాయర్స్, జడ్జి అలాగే కోర్టు సంబంధిత ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. ఆహార సంబంధ వ్యాపారాలు మరియు వ్యవసాయం చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే నాయకులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మంచి లాభాలు ఉంటాయి, అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.

కుటుంబం :

కుటుంబంలో పండగలాంటి వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కానివారికి వివాహం కూడా జరుగుతుంది

ఆరోగ్యం :

నిద్ర రుగ్మతలు, రాత్రి కలలో బయపడి లేవడం, అలాగే మానసిక రుగ్మతలు ఉంటాయి. అలాగే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

పరిహారం:

ప్రతి మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళాలి. అలాగే హనుమాన్ మంత్రం ప్రతి రోజు 108 సార్లు జపించాలి.

హనుమాన్ మంత్రం

  • రామస్కందం హనూమంతం !
    వైనతేయం వృకోదరమ్ !
    శయనే యః స్మరేత్ నిత్యం !
    దుస్వప్నం తస్య నస్యతే !

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/