మిథున రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

మిథున రాశి గురు, శని, కుజ, రాహు, కేతు గ్రహాల ప్రభావంలో ఉంది. శుక్ర, బుధ గ్రహాల ప్రభావం అసలు లేదు. కావున ఆర్థిక పరమైన నష్టాలు ఉంటాయని చెప్పవచ్చు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టిన వారు చాలా జాగ్రతగా ఉండాలి. విద్య సంస్థలు, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి అసలు బాగుండదు. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులకు కూడా అసలు బాగుండదు. మొత్తానికి కొత్త సంవత్సరం జనవరి నెల నష్టాలను కలిగించే నెల అని చెప్పవచ్చు. కావున ఈ నెలలో ఆర్థిక పరమైన విషయాలలో చక్కటి ప్రణాళిక చేసుకుంటే నష్టాలను అధిగమించవచ్చు.

కుటుంబం :

శుక్ర, బుధ గ్రహాల ప్రభావం వలన కుటుంబంలో అనవసరపు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా వివాహం జరిగిన దంపతుల మధ్య అన్యోనత ఉండదు. అలాగే కోర్టు కేసులు కూడా బాధిస్తాయి.

ఆరోగ్యం :

మూత్ర సమస్యలు, మూత్రపిండ సమస్యలు, కడుపు నొప్పి సమస్యలు బాధిస్తాయి. మూత్రపిండ సమస్యలు ఉన్నవారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం:

ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు లక్ష్మి గాయత్రి మంత్రం 108 సార్లు జపించాలి

లక్ష్మీ గాయత్రి –

  • ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే
  • విష్ణుప్రియాయై ధీమహి,
  • తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/