గురు మహాదశలో – భుక్తి ఫలితాలు

గురు మహాదశలో – భుక్తి ఫలితాలు

గురు మహాదశ –16 సంవత్సరాలు

గురు మహాదశ / గురు భుక్తి – 2 సంవత్సరాల 1 నెల 18 రోజులు

 1. గురు గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, చంద్ర, గ్రహాంతో మరియు 11వ స్థానం / స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటే – జాతకుడికి ఇల్లు కట్టుకునే యోగం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన విజయం ఉంటుంది. ఈ భుక్తిలో ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది.
 2. గురు గ్రహం ఏ స్థానంలో స్థితి అయిన సరే, ఏ లగ్నమైతే ఆ లగ్నానికి చెందిన యోగకారాక గ్రహాంతో మరియు 9,10,11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – ఈ గురు భుక్తిలో జాతకుడికి/జాతకురాలికి మంచి రాజా యోగం ఉంటుంది.
 3. గురు గ్రహం ఏ స్థానంలో స్థితి అయిన, 2/12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే 5/12 మరియు 10/12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – గురు భుక్తిలో జాతకుడికి నష్టాలు ఉంటాయి. ఈ రూల్ 100% నిజం

 

గురు మహాదశ / శని భుక్తి – 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు

 1. శని గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన, ఆ స్థానంలో శని గ్రహం బలంగా ఉండి, అలాగే యోగా కారాక గ్రహంతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె – వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఫైనాన్సియల్ స్టేటస్ కూడా బాగుంటుంది. సంతానం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి
 2. శని గ్రహం – 6,8,12 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన, మిగతా స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే సూర్య గ్రహంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన నష్టం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే మానసిక సమస్యలు కూడా ఉంటాయి.
 3. మహాదశ అధిపతి గురు గ్రహాం నుండి – 2 మరియు 11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ శని భుక్తిలో అన్ని విషయాలలో జాతకుడికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.
 4. శని గ్రహానికి మారక స్థానాలు మరియు భాదాక స్థానంతో సిగినఫీ కేసన్స్ ఉండి, రాహు, కుజ, సూర్య గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్య సమస్యల వలన సంపాదించన డబ్బు ఖర్చు అవుతుంది.

గురు మహాదశ /బుధ భుక్తి – 2 సంవత్సరాల 3 నెలల 6 రోజులు

 1. బుధ గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం కన్య రాశిలో స్థితి అయి, 11వ స్థానంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – బుధ భుక్తిలో జాతాకుడికి సుఖవంతమైన, ఆనందాకరమైన జీవితం ఉంటుంది. అలాగే 7వ స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె -వివాహం ఖచ్చితంగా జరుగుతుంది
 2. బుధ గ్రహం – 7వ స్థానంలో స్థితి అయి, అలాగే కుజ గ్రహంతో సిగినఫీ కేసన్స్ ఉంటె స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే 10వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఇంకా మంచిది. అలాగే 2 మరియు 11 స్థానాలతో సిగినేఫీ కేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది.
 3. బుధ గ్రహానికి 6,8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, సూర్య, కుజ, శని, రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – నష్టాలు, కోర్ట్ కేసులు, అలాగే గొడవలు, అలాగే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
 4. బుధ గ్రహానికి 6,8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, చంద్ర, గురు, శుక్ర గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – శతృవులు మిత్రులు అవుతారు, వ్యాపారాములో లాభాలు ఉంటాయి, కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
 5. బుధ గ్రహానికి 6,8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, మారక మరియు బాధక స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, కుజ శని గ్రహాలతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనార్యోగం వలన మరణం ఉంటుంది

 

గురు మహాదశ / కేతు భుక్తి – 11 నెలల 6 రోజులు

 1. గురు మరియు కేతు గ్రహాలు ఆధ్యాత్మిక గ్రహాలు – కావున కేతు గ్రహం ఏ స్థానములో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో పాటు గురు గ్రహంతో బలంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె ఆధ్యాత్మిక విషయాలలో మంచి పలితాలు ఉంటాయి.
 2. కేతు గ్రహం ఏ స్థానములో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో పాటు – 2,11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వ్యవసాయం చేస్తున్నవారికి మంచి లాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కూడా ఉంటుంది. అలాగే 10వ స్థానము/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఫలితాలు ఇంకా బాగుంటాయి
 3. కేతు గ్రహానికి 5 మరియు 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి, అలాగే తగ్గుతాయి. ఒకవేళ 5, 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగ్గటానికి సమయం పడుతుంది.
 4. మహాదశ అధిపతి గురు గ్రహం నుండి కేతు గ్రహం కోణ స్థానాలలో స్థితి అయితే – కేతు భుక్తిలో ఫలితాలు చాలా బాగుంటాయి. ధన సంపాదన బాగుంటుంది.

 

గురు మహాదశ /శుక్ర భుక్తి – 2 సంవత్సరాల 8 నెలలు

 1. శుక్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర కోణ స్థానాలలో స్థితి అయి, శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – శుక్ర భుక్తిలో జాతకుడికి ప్రతి విషయంలో లాభాలు ఉంటాయి.ధన సంపాదన పెరుగుతుంది. కుటుంబలో సంతోషాలు ఉంటాయి అలాగే శుభ కార్యాలు జరుగుతాయి.
 2. శుక్ర గ్రహానికి కేంద్ర, కోణ స్థానాలతో ఏ మాత్రం సిగ్నిఫీకేషన్స్ లేకుండా కేవలం, 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వ్యాపారాలలో నష్టాలు, ఉంటయి . అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. అలాగే రాహు కుజ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వివాహ విషయంలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.
 3. శుక్ర గ్రహానికి 4వ స్థానంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి , 2,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. వాహనాలు కూడా కొంటారు. అలాగే కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – రియల్ ఎస్టేట్ వ్యాపారం చాల బాగుంటుంది. ఇల్లు కట్టుకోవాలనే కోరిక కూడా నెరవేరుతుంది
 4. శుక్ర గ్రహానికి మారక మరియు భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేసన్స్ ఉంటె – మరణం కూడా ఉంటుంది. అలాగే అదనంగా 8, 12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది

గురు మహాదశ / సూర్య భుక్తి – 11 నెలల 9 రోజులు

 1. సూర్య గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కండ్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 2, 3 11స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ధన సంపాదన చాలా బాగుంటుంది. ఒక్కసారిగా ఫైనాన్సియల్ స్టేట్స్ పెరిగిపోతుంది. ఈ సూర్య భుక్తిలో ప్రతి విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అదృష్టాలు కూడా ఉంటాయి.
 2. సూర్య గ్రహానికి 6, 8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి , అలాగే కేతు గురు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మెడిసిన్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే 9 వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి. మెడిసిన్ చదవడానికి విదేశాలకు కూడా వెళుతారు.
 3. సూర్య గ్రహాని మారక మరియు భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ మరణం గురించి బయలు ఉంటాయి.

 

గురు మహాదశ / చంద్ర భుక్తి – 1సంవత్సరం 4 రోజులు

 1. చంద్ర గ్రహం -కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం వృషభ రాశిలో 10 డీగ్రీలలోపు స్థితి అయి, 11వ స్థానముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటే – కెమికల్, జల సంబంధ మరియు ఆహార సంబంధ వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. కుటుంబలో సంతోషం, సుఖవంతమైన జీవితం, ఆధ్యాత్మిక మరియు ట్రస్ట్ కు సంబంధించిన విషయాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
 2. చంద్ర గ్రహం -6,8,12 స్థానాలలో స్థితి అయి, కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – నష్టాలుఉంటాయి. పరువు, ప్రతిష్టలు దిగజారిపోతాయి. గొడవలు, సోదరులతో సఖ్యత ఉండదు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.
 3. చంద్ర గ్రహం – ఏ లగ్నమైన సరే వృచ్చిక రాశి స్థితి అయి, 7వ స్థానం/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వివాహానికి సంబంధించిన ఫలితాలు బాగుండవు. అలాగే శని, కుజ మరియు సూర్య గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – జీవిత భాగస్వామి నుండి వీడిపోతారు లేదా మరణం కూడా రావచ్చు. ఈ రూల్ 100% కరెక్ట్.
 4. చంద్ర గ్రహం – ఏ స్థానములో స్థితి అయిన, మారక, మరియు భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆలాగే కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్యంతో మరణం ఉంటుంది. ఒకవేళ కుజ, శని గ్రహాలు వక్రంలో ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ధన నష్టాలు ఉంటాయి.

 

గురు మహాదశ / కుజ భుక్తి – 11నెలల 6 రోజులు

 1. కుజ గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం మకర రాశిలో స్థితి అయి, 2, 11 స్థానాలు /స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సంతానం ఉంటుంది. ధన సంపాదన పెరుగుతుంది. అలాగే అదనంగా శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 2. కుజ గ్రహం ఏ స్థానంలో స్థితి అయిన, శని, శుక్ర గ్రహాలతో పాటు 4, 2,11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – భూ సంబంధ విషయాలలో మంచి లాభాలు ఉంటాయి. ఇల్లు కొట్టుకోవాలనే కోరిక కూడా నెరవేరుతుంది
 3. కుజ గ్రహం – 6, 8,12 స్థానాలలో స్థితి అయి, అశుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – నష్టాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
 4. మహాదశ అధిపతి గురు గ్రహం నుండి కుజ గ్రహం – 6, 8,12 స్థానాలలో స్థితి అయితే – ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

గురు మహాదశ / రాహు భుక్తి – 2 సంవత్సరాల 4 నెలల 24 రోజులు

 1. రాహు గ్రహం ఏ స్థానంలో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో పాటు, కేంద్ర, కోణ స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – రాహు భుక్తిలో జాతకుడికి ప్రతి విషయంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
 2. అలాగే 4వ స్థానముతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె స్థిరాస్తుల విషయంలో ఫలితాలు 100% బాగుంటాయి. అలాగే శుక్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. రాహు 6,8,12 స్థానాలలో స్థితి అయి, 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, శని, సూర్య గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – రాహు భుక్తిలో అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రాహు భుక్తిలో ప్రతి విషయంలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.
 4. రాహు 6,8,12 స్థానాలలో స్థితి అయి, 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, మారక, భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ప్రమాదాలు లేదా అనారోగ్యంతో మరణం కూడా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: