కేతు మహాదశలో – భుక్తి ఫలితాలు

కేతు మహాదశలో – భుక్తి ఫలితాలు

కేతు మహాదశ – 7 సంవత్సరాలు

కేతు మహాదశ / కేతు భుక్తి – 4 నెలల 27 రోజులు

 1. కేతు గ్రహం ఏ స్థానంలో స్థితి ఐన, ఆ స్థానాధిపతితో పాటు 9,10,11 స్థానాలు /స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సుఖవంతమైన జీవితం, వృతి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో కేతు భుక్తిలో ఫలితాలు చాల బాగుంటాయి.
 2. కేతు గ్రహానికి గురు, సూర్య గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వైద్య రంగములో ఉండే వారికి ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. అలాగే మెడిసిన్ చదివే వారికి కేతు భుక్తి అనుకూలంగా ఉంటుంది.
 3. కేతు గ్రహానికి సూర్య గ్రహంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి, 8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ధన నష్టం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలాగే అదనంగా 4వ స్థానముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె గుండెకు సంబంధించి న సమస్య మరింత తీవ్రత గా ఉంటుంది. అలాగే కుజ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె సర్జరీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
 4. కేతు గ్రహానికి 2 , 7 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – బంధువులతో గొడవలు, ఇంటికి దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. అలాగే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

కేతు మహాదశ / శుక్ర భుక్తి – 1 సంవత్సరం 2 నెలలు

 1. శుక్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం మీనరాశిలో స్థితి అయి, 2,10,11 స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సంతోషాలు, అనుకోకుండా ధన సంపాదన పెరుగుతుంది. తీర్థ యాత్రలు కూడా చేస్తారు. ఏ పని చేసిన ఈ భుక్తిలో మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే అదృష్టాలు కూడా తోడవుతాయి.
 2. మహా దశ అధిపతి కేతు గ్రహం నుండి – శుక్ర గ్రహనికి 2,3,4 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆస్తులను కూడా పెట్టుకుంటారు. వృతి ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
 3. శుక్ర గ్రహం 6,8,12/స్థానాలు స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అశుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆర్థికంగా నష్టాలు, అనవసరపు ఖర్చులు, గొడవలు ఉంటాయి.
 4. అలాగే కుజ శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే సూర్య గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె గుండెకు సంబంధించిన సమస్యలు అలాగే బీపీ, షుగర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కేతు మహాదశ / సూర్య భుక్తి – 4 నెలల 6 రోజులు

 1. సూర్య గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 11వ స్థానం / స్థానాధిపతితో మరియు శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. మనసులోని ప్రతి కోరిక విజయవంతం అవుతుంది.
 2. సూర్య గ్రహానికి 9,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సూర్య భుక్తిలో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అలాగే 11వ స్థానం/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. కేతు, సూర్య గ్రహాలకు ఒకరికొకరికి బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి, 5వ స్థానం/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వైద్య రంగంలో ఉండేవారికి ధన సంపాదన బాగుంటుంది. అలాగే మెడిసిన్ చదివేవారికి కూడా ఈ భుక్తి అనుకూలంగా ఉంటుంది. అలాగే సూర్య గ్రహానికి లగ్నంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మెడిసిన్ చావటానికి విదేశాలకు కూడా వెళుతారు.
 4. సూర్య గ్రహానికి 6, 8, 12 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, మారక మరియు భాధక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి.

 

కేతు మహాదశ / చంద్ర భుక్తి – 7 నెలల

 1. చంద్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 2,11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మంచి పేరు ప్రతిష్టలు, కుటుంబంలో సంతోషాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి, మరియు ధన సంపాదన ఉహించంతగా పెరిగిపోతుంది. ఆధ్యాత్మిక విషయాలలో అలాగే దేవాలయాలకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పేరు ప్రతిష్టలు, మంచి హోదాలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
 2. మహాదశ అధిపతి కేతు గ్రహం నుండి లేదా లగ్నం నుండి చంద్ర గ్రహనికి సూర్య గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే తప్పనిసరిగా 6అవా స్థానం/స్థానాధిపతి మరియు శని గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కూడా వాచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కేతు గ్రహం స్వంత నక్షత్రాలలో స్థితి అయితే గవర్నమెంట్ కు సంబంధించిన ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఈ రూల్ 100% కరెక్ట్.
 3. చంద్ర గ్రహం బలహీనంగా ఉండి, 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు. వ్యాపారాలలో నష్టాలు ఉంటాయి. రాహు, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మానసిక సమస్యలు కూడా ఉంటాయి
 4. చంద్ర గ్రహం బలహీనంగా ఉండి, 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ శని మరియు మారక, భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఈ చంద్ర భుక్తిలో అనారోగ్య సమస్యల వలన మరణం ఉంటుంది. అలాగే అదనంగా బుధ గ్రహం మరియు 3వ స్థానాధిపతి బలహీనంగా ఉంటె ఆత్మహత్య చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

కేతు మహాదశ / కుజ భుక్తి – 4 నెలల 27 రోజులు

 1. మహా దశ అధిపతి మరియు కుజ గ్రహం కలిసి ఏ స్థానంలో స్థితి అయిన – కుజ భుక్తిలో ఫలితాలన్నీ లాభసాటిగా ఉంటాయి. అలాగే శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉన్న దృష్టి ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఈ దృష్టి 5 డీగ్రీలలోపు ఉంటె ఇంకా మంచిది. ఇక్కడ Western Aspects కు ప్రాధాన్యత ఇవ్వాలి.
 2. కుజ గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 9, 11 స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయంలో ఫలితాలు బాగుంటాయి. అలాగే 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె భూ సంబంధ విషయాలలో ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. కుజ గ్రహనికి 2,6,10 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, సూర్య, చంద్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 4. కుజ గ్రహం 6,8,12 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన సరే మిగతా స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మానసిక సమస్యలు మరియు ఆరోగ్యం కూడా బాగుండదు. అలాగే శని మరియు మారక, భాధక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మరణం కూడా ఉంటుంది.

కేతు మహాదశ / రాహు భుక్తి – 1 సంవత్సరం 18 రోజులు

 1. రాహు గ్రహం ఏ స్థానములో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 2,3,11 స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయంగా మంచి హోదా లభిస్తుంది. అలాగే మంచి ధన సంపాదన ద్వారా ఫైనాన్సియల్ స్టేటస్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అలాగే శుభకార్యాలు జరుగుతాయి. అలాగే శుభ గ్రహాల దృష్టి ఉంటె ఇంకా మంచిది
 2. రాహు గ్రహానికి 6,8,12 స్థానాలతో/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, శని, సూర్య గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – నష్టాలు, భాధలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. గొడవలు, శత్రువులు ఉంటారు. అలాగే కుజ, శని, సూర్య గ్రహాలు బలహీనంగా ఉంటె – ఫలితాలు అసలు బాగుండవు. అంటే మరింత ఘోరంగా ఉంటాయి. ఈ విధంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఈ రాహు భుక్తిలో జాగ్రత్తగా ఉండాలి.
 3. రాహు గ్రహానికి 6,8,12 స్థానాలతో పాటు తప్పనిసరిగా లగ్నాధిపతితో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటే – వైరస్, జ్వరాలు, తరచుగా మూత్ర విసర్జన సమస్యలు ఉంటాయి. అలాగే కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సర్జరీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే అదనంగా మారక, భాదాక స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మరణం కూడా ఉంటుంది.

 

కేతు మహాదశ / గురు భుక్తి – 11 నెలల 6 రోజులు

 1. గురు గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం కర్కాటక రాశిలో 13 డీగ్రీలలోపు స్థితి అయి 1, 2,5,10,11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – గురు భుక్తిలో ప్రతి విషయంలో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. తీర్థ యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మహా దశ అధిపతి కేతు గ్రహం బలంగా ఉంటె ఫలితాలు ఇంకా మహాద్భుతంగా ఉంటాయి.
 2. మహాదశ అధిపతి కేతు గ్రహం నుండి – గురు గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 3,11 స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వ్యాపారరీత్యా బాగుంటుంది అలాగే వ్యాపారరీత్యా ప్రయాణాలు ఉంటాయి. సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఫైనాన్సియల్ స్టేటస్ చాల బాగుంటుంది.
 3. మహాదశ అధిపతి కేతు గ్రహం – 6 లేదా 8 లేదా 12వ స్థానంలో స్థితి అయి, అశుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మానసిక సమస్యలు, ఆర్థికంగా నష్టాలు రావడం చేత అప్పులు చేస్తారు. బంధువులతో విబేధాలు వస్తాయి. కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి.
 4. గురు గ్రహనికి 5,11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ 5, 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ లేకుండా కేవలం 8, 12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ వస్తే – ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళేల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఈ గురు భుక్తి జరుగుతున్న సమయంలో – గురు, శని గ్రహాల గోచరం 5, 11 స్థానాలలో లేదా 5,11 స్థానాధిపతులు స్థితి అయిన రాశులలో ప్రవేశిస్తే – తొందరగా నయం అవుతుంది. లేకపోతే మరణం సంబవిస్తుంది. అలాగే మారక, భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. 100% నిజం.

కేతు మహాదశ / శని భుక్తి – 1 సంవత్సరం 1 నెల 9 రోజులు

 1. శని గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం తులారాశిలో 18దీగెరీలలోపు స్థితి అయి, 1, 3, 10 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటే – ఈ శని భుక్తిలో ఏ పని మొదలుపెట్టిన విజవంతం అవుతుంది. అలాగే వృతి, ఉద్యోగాలలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 2. శని గ్రహం 8 లేదా 12 వ స్థానములో స్థితి అయి, అలాగే 8 లేదా 12 స్థానాలలో బలంగా ఉండి, అలాగే అశుభ గ్రహాలతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వ్యాపారాలలో నష్టాలు, గొడవలు, గవర్నమెంట్ సంబంధించిన విషయాలలో నష్టాలు ఉంటాయి. ఆర్థికంగా ఈ శని భుక్తిలో ఉహించంతగా ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. అలాగే జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థి వస్తుంది.
 3. మహాదశ అధిపతి కేతు గ్రహం నుండి – శని గ్రహానికి 6,8,12 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మానసిక సమస్యలు, చేస్తున్న పనిలో ఆటంకాలు వస్తాయి. ఏమి జరుగుతుందో నఏ భయం ఉంటుంది. అలాగే సోమరితనం వస్తుంది. వీటి కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే అదనంగా మారక, భాధ స్థానాలతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె మరణం కూడా ఉంటుంది

కేతు మహాదశ / బుధ భుక్తి – 11 నెలల 27 రోజులు

 1. బుధ గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 10, 11 స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఉంటాయి. సంతానము ఉంటుంది అలాగే ధన సంపాదన బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. అలాగే శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి, అలాగే అదృష్టాలు కూడా తోడవుతాయి. ఒకవేళ అశుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అదృష్టాలు ఉండవు కష్టపడాల్సివస్తుంది.
 2. బుధ గ్రహం -ఏ స్థానంలో స్థితి అయిన, కేంద్ర స్థానాలతో పాటు, 9వ స్థానంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఏ పని చేసిన విజయవంతం అవుతుంది.
 3. మహాదశ అధిపతి కేతు గ్రహం నుండి – బుధ గ్రహానికి కేంద్ర, కోణ స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ప్రతి విషయంలో ఫలితాలు బాగుంటాయి. ఆర్థికంగా ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. అలాగే కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయంలో కూడా ఫలితాలు బాగుంటాయి.
 4. బుధ గ్రహం – 6,8,12 స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వాహనాల వలన ప్రమాదాలు ఉంటాయి. ఈ విదంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె బుధ భుక్తిలో జాగ్రత్తగా ఉండాలి.
 5. మహాదశ అధిపతి కేతు గ్రహం నుండి – బుధ గ్రహానికి 6,8,12 స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ బుధ భుక్తి లో గురు, శని గ్రహాల గోచరం బుధ గ్రహం ఉన్న రాశిలో ప్రవేశించిన లేదా బుధ గ్రహం మీద దృష్టి ఉంటె – ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: