సింహ రాశి / లగ్నం – 2023

సింహ రాశి / లగ్నం – అధిపతి సూర్య గ్రహం

 • శని గోచరము – జనవరి 17 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు.              సింహ రాశి నుండి కుంభ రాశి 7వ స్థానము అవుతుంది
 • గురు గోచరము – సింహ రాశి నుండి మీన రాశి 8వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

సింహ రాశి మీద గురు గ్రహ గోచార ప్రభావం లేదు. శని గ్రహ గోచరం సింహ రాశి ప్రభావంలో ఉంది. కావున ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే 2023 సంవత్సరంలో ధన సంపాదన బాగుంటుంది. అలాగే వీరు ఏ పని మొదలు పెట్టిన విజయవంతం అవుతాయి. అలాగే మిగతావారికి ధన సంపాదన మామూలుగానే ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారాలు చేసేవారికి నష్టాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కలిసి రాదు. ఆర్థిక పరమైన నష్టాలు, అలాగే చెడ్డ పేరు వస్తుంది.

 • సింహ లగ్నానికి అధిపతి సూర్య గ్రహము – ఈ సూర్య గ్రహం లగ్నంలో లేదా 5వ స్థానం ధనుస్సు రాశిలో లేదా 9వ స్థానం మేష రాశిలో స్థితి అయి, అలాగే 6వ స్థానం మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి.
 • అలాగే సూర్య గ్రహానికి చెందిన స్వంత నక్షత్రాలలో అనగా కృత్తికా, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలలో స్థితి అయి 6వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 • అలాగే ప్రస్తుతము వీరికి సూర్య భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
 • గురు గ్రహ గోచార దృష్టి సూర్య గ్రహం మీద ఉంటె ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. అలాగే శని గ్రహ గోచరం సూర్య గ్రాహం మీద ఉంటె ఫలితాలు అసలు బాగుండవు.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

 • సంఖ్యా శాస్త్ర ప్రకారం జులై 23 నుండి ఆగష్టు 23 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.

కుటుంబం :

 • శని గ్రహ గోచార ప్రభావంలో సింహ రాశి ఉంది. కావున తండ్రీ, కొడుకుల మధ్య అన్యోనత ఉండదు.
 • కొత్తగా వివాహం జరిగిన వారి మధ్య అన్యోన్యత ఉండదు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వీటి కారణంగా కుటుంబంలో మనశాంతి ఉండదు.
 • వ్యక్తిగత రాశి చక్రంలో గురు గ్రహ గోచార దృష్టి సూర్య గ్రహం మీద ఉంటె ఈ సమస్యల నుండి కాస్త ఉపశమనం ఉంటుంది.

ఆరోగ్యం :

 • సింహ రాశి గుండె, పొట్ట, వెన్నెముక, విషయాలను సూచిస్తుంది. అలాగే సూర్య గ్రహం జ్వరాలు, తల, మెదడు, గుండె, పొట్ట విషయాలకు కారకత్వం వహిస్తాడు.
 • కావున శని గ్రహ గోచార ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే జ్వరాలు, అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 • సింహ రాశికి 3వ స్థానం తులారాశిలో కేతు గ్రహ గోచరం, అలాగే 9వ స్థానం మేష రాశిలో రాహు గ్రహ గోచరం. కావున జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. వీటి కారణంగా ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి
 • గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
 • అదనంగా శని గ్రహ గోచరం సూర్య గ్రాహం మీద ఉంటె ఫైల్స్, పచ్చ కామెర్లు, మూత్రపిండ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి

పరిహారాలు :

 • ప్రతి అది, సోమవారాలు శివాలయానికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శ్రీ సూర్య గాయత్రి మంత్రం జపించాలి.
 • సింహ రాశిలో మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి

శ్రీ సూర్య గాయత్రి –

 • ఓం భాస్కరాయ విద్మహే
  దివాకరాయ ధీమహి,
  \తన్నోసూర్యః ప్రచోదయాత్

మఖ గాయత్రి మంత్రం –

 • ఓం మహా అనగాయ విద్మహే
  పిత్రియాదేవాయ ధిమహి
  తన్నో మఖ: ప్రచోదయాత్

పుబ్బ గాయత్రి మంత్రం –

 • ఓం అరియంనాయ విద్మహే
  పశుదేహాయ ధీమహి
  తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

ఉత్తర గాయత్రి మంత్రం –

 • ఓం మహాబకాయై విద్మహే
  మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో
  ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

2023 సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? – https://nsteluguastrology.com/astrology-predictions-2023/