సింహ రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

కుజ, శని, రాహు, కేతు గ్రహాల ప్రభావంలో సింహ రాశి ఉంది. కావున జనవరి నెలలో ఆర్థిక పరమైన నష్టాలు ఉంటాయి. గవర్నమెంట్, వైద్య సంబందిత ఉద్యోగస్తులకు అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. తండ్రి యొక్క వృతి వ్యాపారం అయిన లేదా ఏదైనా సరే నష్టాలు ఉండే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి. కాంట్రాక్టు వ్యాపారస్తులు చాల జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా వ్యాపారం చేస్తున్న వారు చక్కటి ప్రణాళిక చేసుకుంటే నష్టాలను అధిగమించవచ్చు.

కుటుంబం :

ప్రేమ వివాహం చేసుకున్న వారి మధ్య గొడవలు జరిగి విడాకుల కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా కుటుంబలో మానసిక ప్రశాంత ఉండదు.

ఆరోగ్యం :

పంటి సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా బాధిస్తాయి. ఈ నెలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం:

ప్రతి అది, సోమవారాలు శివాలయానికి వెళ్ళాలి. అలాగే కొత్త దంపతులు ఈ మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు జపించాలి

  • || శ్రీరామచంద్ర శ్రిత పారిజాతః
  • సమస్త కళ్యాణ గుణాభి రామః
  • సీత ముఖాంభోరుహ చంచారికః
  • నిరంతరం మంగళమాతనోతు ||

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/