తులా రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

తులా రాశి శని, కుజ, రాహు, కేతు గ్రహాల ప్రభావంలో ఉంది. కావున వృతి ఏదైనా సరే జనవరి నెలలో ఆర్థికంగా నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి బ్యాంకు ఉద్యోగస్తులకు, చిట్ ఫండ్ వ్యాపారస్తులకు మరియు వడ్డీ వ్యాపారస్తులకు నష్టాలు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సంస్థలలో పని చేసేవారికి మరియు జ్యోతిష్య వృత్తిలో ఉన్నవారికి ధన సంపాదన ఉహించినంతగా ఉండదు. షేర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి కాస్త ఉపశమనంగా ఉంటుందని చెప్పవచ్చు.

కుటుంబం :

కుటుంబంలో భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండదు. తల్లి, కూతుళ్ళ మధ్య కూడా అన్యోన్యత ఉండదు. సంతాన సమస్యలు మరింత బాధిస్తాయి.

ఆరోగ్యం :

జీర్ణ సంబంధ సమస్యలు, అలాగే పచ్చకామెర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ నెలలో ఆపరేషన్స్ /సర్జరీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం:

ప్రతి మంగళవారం వినాయకుడి గుడికి వెళ్ళాలి. అలాగే గణేశ గాయత్రి మంత్రం ప్రతి రోజు 108 సార్లు జపించాలి.

గణేశ గాయత్రి –

  • ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే
  • వక్రతుండాయ ధీమహి,
  • తన్నోదంతిః ప్రచోదయాత్.

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/