కుజ మహాదశలో భుక్తి ఫలితాలు

కుజ మహాదశలో భుక్తి ఫలితాలు

కుజ మహాదశ – 7 సంవత్సరాలు 

కుజ మహాదశ / కుజ భుక్తి – 4 నెలల 27 రోజులు 

 1. కుజ గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి 1, 2, 3 మరియు 11 స్థానాలతో / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది. గోవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. స్వంత ఇల్లును కట్టుకుంటారు అలాగే స్థిరాస్థులు కొంటారు. మరియు వ్యవసాయం బాగుంటుంది.
 2. కుజ గ్రహానికి మారక స్థానాధిపతులు 2 మరియు 7 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – మానసికంగా ప్రశాంతత ఉండదు. అలాగే 8వ స్థానాధిపతి బలహీనంగా ఉండి, కుజ గ్రహాంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు వస్తే తగ్గటానికి సమయం పడుతుంది.
 3. కుజ గ్రహానికి 8వ స్థానం, 12 స్థానం మరియు శని, రాహు, కేతు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ కుజ భుక్తిలో జాతకుడికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి

 

కుజ మహాదశ / రాహు  భుక్తి – 1 సంవత్సరం 18 రోజులు 

 1. రాహు గ్రహం – ఏ స్థానములో స్థితి అయితే ఆ స్థానాధిపతి / నక్షత్రాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే 11వ స్థానంతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె – గవర్నమెంట్ బెనిఫిట్స్, వ్యాపారములో లాభాలు, స్థిరాస్తుల విషయములో కూడా లాభాలు, సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి
 2. రాహు గ్రహం 8వ స్థానం లేదా 12వ స్థానముల స్థితి అయి, శుభ గ్రహాల దృష్టి లేకుండా  కుజ, శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ రాహు భుక్తిలో అర్తకంగా నష్టాలు ఉంటాయి.
 3. రాహు గ్రహానికి మారక స్థానాధిపతులు 2 మరియు 7 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – మృత్యువు గురించి భయం ఉంటుంది.

 

కుజ మహాదశ / గురు భుక్తి – 11 నెలల 6 రోజులు 

 1. రగురు గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 2 మరియు 11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన పెరుగుతుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కుటుంబములో సంతోషం, చర స్థిరాస్తుల విషయములో మంచి లాభాలు ఉంటాయి.
 2. మహాదశ అధిపతి కుజ గ్రహం నుండి, గురు గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయితే – ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయం మరియు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు.
 3. గురు గ్రహనికి 8, 12 స్థానాలతో మరియు అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉండి, శని, రాహు, కేతు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ గురు భుక్తిలో జాతకుడికి ఆర్థికంగా నష్టాలు, అలాగే మానసిక భాదలు కూడా ఉంటాయి
 4. గురు గ్రహానికి మారక స్థానాధిపతులు 2 మరియు 7 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు మరియు మృత్యువు గురించి భయం ఉంటుంది.

 

కుజ మహాదశ / శని భుక్తి – 1 సంవత్సరం 1 నెల 9 రోజులు 

 1. శని గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో, లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయిన లేదా ఉచ్చ స్థానాం తులా రాశిలో 16 డిగ్రీల లోపు స్థితి అయి, బుధ, గురు మరియు లగ్నాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – మంచి పేరు ప్రతిష్టాలు వస్తాయి. వ్యవసాయంలో లాభాలు ఉంటాయి. కొడుకులకు వృత్తి విహాయములో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో పండుగ లాంటి సంతోషం ఉంటుంది.
 2. మహాదశ అధిపతి కుజ గ్రహం నుండి శని గ్రహం – 5వ స్థానం లేదా 10వ స్థానం లేదా 11వ స్థానములో స్థితి 9వ స్థానం / స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ కోప స్వభావం వలన చెడు పేరు వస్తుంది. అలాగే ఆర్థికంగా నష్టాలను కూడా ఇస్తుంది
 3. శని గ్రహం – మారక స్థానాధిపతులు 2 లేదా 7వ స్థానానికి అధిపతి అయి కుజ, రాహు, కేతు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన నష్టం ఉంటుంది. భయాలు కూడా ఉంటాయి. గవర్నమెంట్ కు సంబంధించిన విషయాలలో నష్టాలు కూడా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు, వ్యవసాయం కూడా నష్టాలను ఇస్తుంది.
 4. మహాదశ అధిపతి కుజ గ్రహం నుండి శని గ్రహం – 8వ స్థానం లేదా 12వ స్థానములో స్థితి అయి, 8 మరియు 12 స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – మరణం గురించి భయం ఉంటుంది. దొంగలు మరియు శత్రువుల నుండి బయలు ఉంటాయి.

 

. కుజ మహాదశ / బుధ భుక్తి – 1 1 నెలల 27 రోజులు 

 1. బుధ గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో, లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి బుధ గ్రహాం బాలాంగా ఉంటే – ఆధ్యాత్మిక విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తీర్థ యాత్రలు కూడా చేస్తారు. జ్యుయలరీ మరియు బట్టల వ్యాపారం చేస్తున్నవారికి ఈ బుధ భుక్తిలో మంచి లాభాలు ఉంటాయి. అలాగే వ్యవసాయం చేస్తున్న వారికి కూడా లాభాలు బాగుంటాయి. గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి
 2. బుధ గ్రహం – మహాదశ అధిపతి కుజ గ్రహముతో కలిసి స్థితి అయి, 9వ స్థానం/స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయములో లాభాలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుంది. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి.
 3. బుధ గ్రహం – 6వ స్థానం, 8వ స్థానం లేదా 12 వ స్థానములో స్థితి అయి, 4వ స్థానాధిపతి మరియు సూర్య గ్రహాంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. జైలుకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. బంధువులతో స్నేహ బంధాలు కూడా ఉండవు

 

కుజ మహాదశ / కేతు భుక్తి – 4 నెలల 27 రోజులు 

 1. కేతు గ్రహం – ఏ స్థానములో స్థితి అయితే ఆ స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే 3వ స్థానం మరియు 11వ స్థానంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ కేతు భుక్తిలో ఆర్థికాంగా మంచి స్టేటస్ వస్తుంది. గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
 2. కేతు గ్రహం – లగ్నాధిపతితో మరియు ఏ లగ్నమయితే ఆ లగ్నానికి చెందిన యోగ కారక గ్రహంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ కేతు భుక్తిలో అనుకోకుండా అదృష్టాలు, అలాగే ధన సంపాదన బాగుంటుంది.
 3. కేతు గ్రహం – మహాదశ అధిపతి కుజ గ్రహం నుండి 6, 8, 12 స్థానాలలో స్థితి అయితే అనారోగ్య సమస్యలు ఉంటాయి. గొడవలు కూడా ఉంటాయి. వీటి భాదలు ఎక్కువవుతాయి. మనశాంతి ఉండదు.
 4. అలాగే కేతు గ్రహం – 6, 8, 12 స్థానాలలో స్థితి అయితే వైద్య రంగములో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. మెడిసిన్ చదువుతున్నవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సూర్య, గురు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 5. కేతు గ్రహం – మారక స్థానాధిపతులు 2వ స్థానం మరియు 7వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ బలంగా ఉంటె – కేతు భుక్తిలో అనారోగ్య సమస్యలు ఉంటాయి

 

 కుజ మహాదశ / శుక్ర భుక్తి – 1 సంవత్సరం 4 నెలల

 1. శుక్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం మీనరాశిలో స్థితి అయి, తప్పనిసరిగా లగ్నం / లగ్నాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటే – సౌకర్యవంతమైన / విలాసవంతమైన జీవితం ఉంటుంది. జ్యూయలరీ, బట్టలు, ఫాన్సీ వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి.
 2. శుక్ర గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో  స్థితి అయిమహాదశ అధిపతి కుజ గ్రహంతో ఎలాంటి సిగినీఫీ కేసన్స్ లేకుండా – కేవలం గురు గ్రహం మరియు లగ్నం / లగ్నాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటే – కుటుంబంతో సంతోషంగా ఉంటారు, ఏ పని చేసిన అదృష్టాలు ఉంటాయి.
 3. శుక్ర గ్రహనికి 4వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే 2, 9 స్థానాలతో పాటు కుజ గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటే స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారికి ఈ శుక్ర భుక్తి అదృష్టాలను ఇస్తుంది. అలాగే సంతానం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి
 4. మహాదశ అధిపతి కుజ గ్రహం నుండి శుక్ర గ్రహం 10వ స్థానములో స్థితి అయి, గురు, బుధ గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – ఆధ్యాత్మిక విషయాలలో మరియు ట్రస్ట్ కు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగలలో కూడా అభివృద్ధి ఉంటుంది.
 5. శుక్ర గ్రహం 12వ స్థానములో స్థితి అయి, రాహు మరియు శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ శుక్ర భుక్తిలో ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ప్రేమించుకుంటున్న యువతీ యువకులు శారీరకంగా ఒకటవుతారు, వీడిపోతారు.
 6. శుక్ర గ్రహానికి మారాక స్థానాలు 2, 7 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయి, లేదా 2, 7 స్థానాలకు అధిపతి అయి, ఏ లగ్నమైతే ఆ లగ్నానికి చెందిన బాదకాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ శుక్ర భుక్తిలో అనారోగ్య సమస్యలు ఉంటాయి

 

కుజ మహాదశ / సూర్య  భుక్తి – 4 నెలల 6 రోజులు

 1. సూర్య గ్రహాం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, తప్పనిసరిగా 11వ స్థానం / స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటే – ధన సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. పెద్ద పెద్ద వాగారితో పరిచయాలు పెరుగుతాయి.
 2. సూర్య గ్రహానికి 4వ స్థానం/స్థానాధిపతి సిగినీఫీ కేసన్స్ ఉండి, 8,12 స్థానాలు / అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – ఈ సూర్య భుక్తిలో గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాగే కుజ, మరియు శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే మారక స్థానాలు 2, 7 స్థానాలు / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – మరణం కూడా ఉంటుంది.
 3. సూర్య గ్రహానికి 2,6,10 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, 2,6,10 స్థానాధిపతులు బలంగా ఉంటె – గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే చంద్ర గ్రహంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇంకా మంచిది. అలాగే శని గ్రహముతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె- ఈ సూర్య భక్తిలో 100% ఖచ్చితంగా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి

 

 కుజ మహాదశ / చంద్ర భుక్తి – 7 నెలల

 1. చంద్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 4, 9,10 స్థానాలతో / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – కుటుంబంలో శుభకార్యాలు, వ్యాపారములో లాభాలు ఉంటాయి. అలాగే ఈ సిగినీఫీ కేసన్స్ తో పాటు తప్పనిసరిగా లగ్నం మరియు గురు గ్రహంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఈ భుక్తిలో జాతకుడికి/జాతకురాలికి మంచి రాజా యోగం ఉంటుంది.
 2. చంద్ర గ్రహం – నీచ స్థానం వృచ్చిక రాశిలో ప్రత్యేకించి శని నక్షత్రములో స్థితి అయి, 8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి.
 3. చంద్ర గ్రహానికి మారక స్థానాలు మరియు భాదాక స్థానంతో సిగినీఫీ కేసన్స్ ఉన్నా లేదా కుజ గ్రహం నుండి ( అనగా కుజ గ్రహం ఉన్న స్థితిని లగ్నంగా పారిగణలోకి తీసుకోవాలి )చంద్ర గ్రహానికి మారక స్థానాలు మరియు భాదాక స్థానంతో సిగినీఫీ కేసన్స్ ఉన్నా- అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనారోగ్యం వలన మరణం కూడా సంభవిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: