బుధ మహాదశలో – భుక్తి ఫలితాలు

బుధ మహాదశలో – భుక్తి ఫలితాలు

బుధ మహాదశ –17 సంవత్సరాలు

బుధ మహాదశ / బుధ భుక్తి – 2 సంవత్సరాల 4 నెలల 27 రోజులు

 1. బుధ గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఉన్నత విద్యాలో మంచి ఫలితాలు ఉంటాయి. జ్యుయలరీ మరియు ఆహార సంబంధ వ్యాపారులు బాగుంటాయి. కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. సుఖవంతమైన జీవితం ఉంటుంది.
 2. అలాగే కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఇంజనీరింగ్ వృత్తిలో ఉండే వారికి ఫలితాలు చాలా బాగుంటాయి
 3. బుధ గ్రహనికి అశుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, బుధ గ్రహం బలహీనంగా ఉంటె – బుధ భుక్తిలో ఫలితాలు బాగుండవు
 4. బుధ గ్రహనికి – 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, చంద్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మానసిక సమస్యలు ఉంటాయి. అలాగే శని, కుజ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ప్రమాదాలు జరుగుతాయి. అలాగే ధన నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
 5. బుధ గ్రహం 2 లేదా 7 స్థానాల్లో స్థితి అయిన లేదా 2, 7 స్థానాలకు అధిపతి అయి, 8, 12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి. అలాగే అదనంగా 10వ స్థానముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వీడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి

బుధ మహాదశ / కేతు భుక్తి – 11 నెలల 27 రోజులు

 1. కేతు గ్రహానికి 2,3 మరియు 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే బుధ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కేతు భుక్తిలో ఫలితాలు బాగుంటాయి.
 2. అలాగే మహాదశ అధిపతి నుండి – కేతు గ్రహానికి కేంద్ర, కోణ స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అదనంగా శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. మహా దశ అధిపతి బుధ గ్రహం నుండి – కేతు గ్రహం 6,8,12 స్థానాలలో స్థితి అయి, కుజ శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే బుధ గ్రహం బలహీనంగా ఉంటె – ప్రమాదాలు కూడా జరుగుతాయి.

బుధ మహాదశ / శుక్ర భుక్తి – 2 సంవత్సరాల 10 నెలలు

 1. శుక్ర గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా మూల త్రికోణ డిగ్రీలలో స్థితి అయి, 11వ స్థానం/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మనసులోని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అదనంగా 2వ స్థానముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది. అలాగే 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వాహనాలు కొంటారు, ఇల్లు కట్టుకునే యోగం కూడా ఉంటుంది.
 2. మహాదశ అధిపతి బుధ గ్రహం నుండి – శుక్ర గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి – లగ్నం నుండి 4వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి.
 3. శుక్ర గ్రహానికి 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆడవాళ్లకు నెలవారీ సమస్యలు ఉంటాయి. మగవారికి బ్లడ్ కు సంబంధించిన సమస్యలు ఉంటాయి. సూర్య, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె శుక్ర భుక్తిలో ఏదోఒక అనారోగ్య సమస్యతో బాధ పడుతుంటారు. అలాగే భాదాక స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె తీవ్రత ఎక్కువ ఉంటుంది.

 

బుధ మహాదశ / సూర్య భుక్తి – 10 నెలల 6 రోజులు

 1. సూర్య గ్రహం – కేంద్ర, కోణ స్థానలలో స్థితి అయి , 2, 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సూర్య భుక్తి అదృష్టాలను ఇచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
 2. సూర్య గ్రహానికి 2,4,11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరుతుంది. వ్యవసాయం కూడా సూర్య భుక్తిలో లాభసాటిగా ఉంటుంది
 3. సూర్య గ్రహానికి 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, శని, రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఈ సూర్య భుక్తిలో ఆపదలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బాగుండదు. ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.

బుధ మహాదశ / చంద్ర భుక్తి – 1 సంవత్సరం 5 నెలలు

 1. చంద్ర గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం వృషభ రాశిలో స్థితి అయి, గురు గ్రహం మరియు ఏ లగ్నమైతే ఆ లగ్నానికి చెందిన యోగ కారక గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సంతానం ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది.
 2. చంద్ర గ్రహం – ఏ స్థానంలో ఉన్న సరే , కుజ, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వివాహానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నీచస్థానంలో స్థితి అయిన లేదా రాహు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేసమ్స్ ఉంటె వీడిపోయో అవకాశాలు ఉంటాయి.
 3. చంద్ర గ్రహం 6,8,12 స్థానాలతో స్థితి అయి, రాహు గ్రహంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మానసిక సమస్యలు ఉంటాయి. అలాగే లగ్నం/ లగ్నాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 4. అలాగే అదనంగా మారక, భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె- తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరణం కూడా సంబవిస్తుంది.

బుధ మహాదశ / కుజ భుక్తి – 11 నెలల 27 రోజులు

 1. కుజ గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా, మూల త్రికోణ డిగ్రీలలో లేదా ఉచ్చస్థానము మకర రాశిలో స్థితి అయి 11వ స్థానం/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆస్తులను కూడబెట్టుకుంటారు. మంచి విలాసవంతమైన ఇల్లు కట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి వ్యవసాయం చేస్తున్నవారికి ఈ కుజ భుక్తి మంచి ఫలితాలను ఇస్తుంది
 2. అలాగే మహదశ అధిపతి బుధ గ్రహం నుండి – కుజ గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి 11వ స్థానం/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ధన సంపాదన పెరుగుతుంది. శుభ కార్యాలు జరుగుతాయి. సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. అలాగే గురు, శుక్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. కుజ గ్రహం బలహీనంగా ఉండి, 6,10 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే చంద్ర, రాహు గ్రహలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండదు. గొడవలు ఉంటాయి. సర్దుకుపోతారు. అలాగే అదనంగా 12వ స్థానము/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు లేదా వీడిపోతారు.
 4. కుజ గ్రహానికి 6,8,12 స్థానాలలో ఏ స్థానంలో స్థితి అయిన సరే మిగతా స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటే – ప్రతి విషయంలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే మహాదశ అధిపతి బుధ గ్రహం నుండి – ఈ విదంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటే – నష్టాలు, భాదలు, చికాకులు, అనారోగ్య సమస్యలు, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. భరించలేనంత మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఈ విధంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఈ కుజ భుక్తిలో జాగత్తగా ఉండడం మంచిది.

బుధ మహాదశ / రాహు భుక్తి – 2 సంవత్సరాల 6 నెలల 18 రోజులు

 1. రాహు గ్రహం – ఏ స్థానంలో స్థితి అయితే ఆ స్థానాధిపతితో మరియు 11వ స్థానంతో తప్పనిసరిగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది. ఇంటి, స్థలాలను కొంటారు. అలాగే తీర్థ యాత్రలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. వృషభ, కర్కాటక, కన్య లగ్నంలో జన్మించిన వారికి ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 2. రాహు గ్రహానికి 2,3,6,10 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – రాహు భుక్తిలో వృత్తి, ఉద్యోగ లలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అలాగే గురు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. రాహు గ్రహానికి 8, 12 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మానసిక సమస్యలు ఉంటాయి. అలాగే మలబద్దకం, జ్వరాలు వైరస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా నష్టాలు కూడా ఉంటాయి.
 4. అలాగే మహాదశ అధిపతి బుధ నుండి – రాహు గ్రహానికి 8, 12 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – పైన వివరించిన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ లగ్నం నుండి మరియు మహాదశ అధిపతి నుండి ఉంటె – తీవ్రత చాలా ఎక్కువగా ఉంటాయి.

 

బుధ మహాదశ / గురు భుక్తి – 2 సంవత్సరాల 3 నెలల 6 రోజులు

 1. గురు గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 2, 11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబములో శుభకార్యాలు జరుగుతాయి అలాగే వివాహం కూడా జరుగుతుంది. ఆధాత్మిక విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే తీర్థ యాత్రలు కూడా చేస్తారు. వ్యవసాయం చేస్తున్న వారికి కూడా ఫలితాలు బాగుంటాయి
 2. గురు గ్రహానికి కేతు గ్రహంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఈ గురు భుక్తిలో వైద్య రంగంలో ఉండేవారికి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే మెడిసిన్ చదవాలి అనుకునేవారికి కూడా ఈ భుక్తి అనుకూలంగా ఉంటుంది. అలాగే సూర్య గ్రహంతో సిగ్నిఫీకేస్న్స్ ఉంటె పలితాలు ఇంకా బాగుంటాయి. అలాగే అదనంగా చంద్ర గ్రహముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఫలితాలు ఇంకా మహాద్భుతంగా ఉంటాయి. ఈ రూల్ 100% కరెక్ట్.
 3. గురు గ్రహానికి 7వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే కుజ గ్రహంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె జాతకుడికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది.
 4. గురు గ్రహానికి 6,8,12 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – శతృవులు పెరుగుతారు. గొడవలు, మానసిక సమస్యలు, జైలుకు వెళ్లాల్సిన వారం కూడా వస్తుంది. లగే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి.

బుధ మహాదశ / శని భుక్తి – 2 సంవత్సరాల 8 నెలల 9 రోజులు

 1. శని గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా, కేంద్ర కోణ స్థానాలలో స్థితి అయి, 2, 11 స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయంలో ఫలితాలు బాగుంటాయి. ఇల్లు కట్టుకుంటారు. అలాగే కుజ గ్రహముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి మరియు వ్యవసాయం చేస్తున్న వారికి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ప్రమోషన్స్ ఉంటాయి.
 2. మహాదశ అధిపతి బుధ గ్రహం నుండి లేదా లగ్నం నుండి 6,8,12 స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – శత్రువుల నుండి ఆపదలు, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసిన కలిసి రాదు. మనసికంగా కృంగిపోతారు. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.
 3. అలాగే 6,8,12 స్థానాలు/స్థానాధిపతులతో పాటు అదనంగా కుజ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్యం విషయంలో తీవత్ర ఎక్కువగా ఉంటుంది. అలాగే అదనంగా మారక మరియు భాధ క స్థానాలతో/ స్థానాధిపతు లతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మరణం కూడా ఉంటుంది. ఈ విధంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఈ శని భుక్తిలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: