చంద్ర మహాదశలో భుక్తి ఫలితాలు

చంద్ర మహాదశలో భుక్తి ఫలితాలు

చంద్ర మహాదశ – 10 సంవత్సరాలు   

చంద్ర మహాదశ / చంద్ర భుక్తి – 10 నెలల

 1. చంద్ర గ్రహం – ఉచ్చ స్థానం వృషభ రాశిలో స్థితి ఐన లేదా కోణ స్థానాలలో స్థితి అయి – కర్కాటక రాశి యొక్క నక్షత్రాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – జాతకుడికి ధన సంపాదన బాగుంటుంది, మంచి పేరు వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది.
 2. చంద్ర గ్రహం నీచ స్థానం వృచ్చిక రాశిలో 8 డిగ్రీల లోపు స్థితి ఐన లేదా 8వ స్థానం లేదా 12వ స్థానం మరియు స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – నష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి
 3. అలాగే చంద్ర గ్రహం వృచ్చిక రాశి జేష్ఠ నక్షత్రంలో స్థితి అయి, 8 లేదా 12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వివాహానికి సంబంధిన ఫలితాలు బాగుండవు. దంపతులు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
 4. చంద్ర గ్రహానికి మారక స్థానాలు 2, 7 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే 8, 2 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు మరియు మరణం కూడా సంభవిస్తుంది

 

చంద్ర మహాదశ / కుజ  భుక్తి – 7 నెలల

 1. కుజ గ్రహం – ఉచ్చ స్థానం మకర రాశిలో స్థితి ఐన లేదా కోణ స్థానాలలో స్థితి అయి – మేష రాశి లేదా వృచ్చిక రాశి యొక్క నక్షత్రాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె –  జాతకుడికి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. చర, స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే 4వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది .
 2. అలాగే కుజ గ్రహానికి సూర్య, శని గ్రహాలతో  సిగినీఫీ కేసన్స్ ఉండి, 10వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
 3. కుజ గ్రహానికి 6,8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే చంద్ర గ్రహముతో బలంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఆర్థికంగా వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలతో బంధువులు దూరం అవుతారు. చెడు స్నేహాలు, ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు.

 

 చంద్ర మహాదశ / రాహు భుక్తి – 1 సంవత్సరం 6 నెలల

 1. రాహు గ్రహం ఏ స్థానములో స్థితి అయితే – ఆ స్థానాధిపతి మరియు నక్షత్రాధిపతితో మంచి సిగినీఫీ కేసన్స్ ఉండాలి. అలాగే బుధ, గురు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఏ పని చేసిన సరే మంచి ఫలితాలు ఉంటాయి.
 2. రాహు గ్రహం ఏ స్థానములో స్థితి ఐన – 5, 7, 9 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి అలాగే చంద్ర గ్రహముతో సిగినీఫీకే షన్స్ ఉంటె – కుటుంబములో శుభ కార్యాలు జరుగుతాయి, లేదా వివాహం జరుగుతుంది
 3. రాహు గ్రహానికి ఉపచాయ స్థానాలు 3,6,10,11స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే ఏ లగ్నమైతే ఆ లగ్నాధిపతితో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె జాతకుడికి మంచి రాజా యోగం ఉంటుంది.
 4. రాహు గ్రహానికి 8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి అలాగే కుజ, శని, కేతు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – జాతకుడికి రాహు భుక్తిలో 100% చెడు  ఫలితాలు ఉంటాయి

 

చంద్ర మహాదశ / గురు భుక్తి – 1 సంవత్సరం 4 నెలల

 1. గురు గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో లేదా ఉచ్చ స్థానం కర్కాటక 10 డిగ్రీలlopu స్థితి అయి – 9, 11 స్థానాలతో లేదా స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది. స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబముతో ఆనందంగా ఉంటారు.
 2. గురు గ్రహానికి లగ్నాధిపతితో ఏ మాత్రం సిగినీఫీ కేసన్స్ లేకుండా కేవలం కుజ, రాహు గ్రహాలతో మరియు 8, 12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వ్యాపారములో నష్టాలు, సంతానం విషయములో నష్టాలు ఉంటాయి. శతృవులతో గొడవలు, కోర్ట్ కేసులు కూడా ఉంటాయి.
 3. మహా దశ అధిపతి చంద్ర గ్రహం నుండి 3 లేదా 11 స్థానాలతో మరియు అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వ్యవసాయం ద్వారా లాభాలు, వ్యాపారములో లాభాలు, కుటుంబములో వివాహం జరుగుతుంది
 4. మహాదశ అధిపతి చంద్ర గ్రహం మరియు  గురు గ్రహం బలహీనంగా ఉండి, 2, 6, 8, 12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – కుటుంబానికి దూరంగా ఉంటారు. అలాగే అనవసరపు ఖర్చులు ఉంటాయి.

 

చంద్ర మహాదశ / శని భుక్తి – 1 సంవత్సరం 7 నెలల

 1. శని గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో లేదా కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం తులారాశిలో 16 డిగ్రీల లోపు స్థితి అయి, శుభ గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వవసాయం లాభసాటిగా ఉంటుంది. స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది
 2. శని గ్రహం 6,8,12 స్థానాలలో స్థితి అయి, కేతు గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె తీర్థ యాత్రలు చేస్తారు, అలాగే శత్రువుల నుండి ఆపద కూడా ఉంటుంది.
 3. మహా దశ అధిపతి చంద్ర గ్రహం నుండి, శని గ్రహం కేంద్ర, కోణ స్థానములో స్థితి అయి, అలాగే మిగతా గ్రహాలతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది. జీవితం సంతోషముగా ఉంటుంది.
 4. శని గ్రహం మారక స్థానాలు 2, 7 స్థానాలలో స్థితి అయితే మానసిక బాధలు ఎక్కువగా ఉంటాయి.

 

చంద్ర మహాదశ / బుధ భుక్తి – 1 సంవత్సరం 5 నెలల

 1. బుధ గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం కన్య రాశిలో స్థితి అయి, గురు గ్రహంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది, అలాగే వృత్తి ఉద్యోగలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే వ్యాపారం చేస్తున్నవారికి లాభాలు బాగుంటాయి. అలాగే కుజ మరియు సూర్య గ్రహాలతో   సిగినీఫీ కేసన్స్ ఉంటె ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది
 2. బుధ గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 2వ స్థానం / స్థానాధిపతి మరియు 11వ స్థానం / 11వ స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – పెట్రోలియం, కెమికల్, జ్యుయలరీ సంబంధ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే కుటుంబములో వివాహం కూడా జరుగుతుంది.అలాగే సంఘములో మంచి గుర్తింపు వస్తుంది
 3. బుధ గ్రహం బలహీనంగా ఉండి, 8,12 స్థానాలు లేదా అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – నష్టాలు, అలాగే వ్యవసాయం చేస్తున్నవారికి పంట నష్టం ఉంటుంది
 4. బుధ గ్రహానికి కేవలం 12వ స్థానముతో సిగ్నిఫ కేసన్స్ ఉండి, అలాగే చంద్ర గ్రహముతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె – జ్యోతిష్య విద్య నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది 

 

 చంద్ర మహాదశ / కేతు భుక్తి – 7 నెలల

 1. కేతు గ్రహం ఏ స్థానములో స్థితి అయితే – ఆ స్థానాధిపతి మరియు నక్షత్రాధిపతితో, కేంద్ర, కోణ స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది, సంతానం ఉంటుంది, జీవిత భాగస్వామి కి వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా బాగుంటుంది
 2. మహాదశ అధిపతి చంద్ర గ్రహం నుండి, కేతు 9వ స్థానంలో స్థితి అయి, 5 లేదా 11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె -వ్యవసాయం చేస్తున్నవారికి ఈ కేతు భుక్తి లో లాభాలు ఉంటాయి.
 3. కేతు గ్రహానికి 8, లేదా 12 స్థానాలతో / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే 5వ స్థానాధిపతితో ఏ మాత్రం సిగినీఫీ కేసన్స్ లేకోపోతే – కేతు భుక్తిలో నష్టాలు ఉంటాయి. అలాగే బుధ గ్రహానికి చాల బలంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె  అప్పులు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది

 

చంద్ర మహాదశ / శుక్ర భుక్తి – 1 సంవత్సరం 8 నెలల

 1. శుక్ర గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో స్థితి అయిన లేదా ఉచ్చ స్థానం మీనరాశిలో స్థితి అయి, 4, 9, 11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఏ వ్యాపారం చేసిన సరే లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది
 2. అలాగే ఈ శుక్ర భుక్తిలో జాతకుడికి / జాతకురాలికి ఇతరులతో స్నేహాలు పెంచుకుంటారు. ఈ స్నేహం అక్రమ సంబంధానికి కూడా దారి తీస్తుంది.
 3. మహా దశ అధిపతి చంద్ర గ్రహంతో శుక్ర గ్రహానికి బలంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె – మంచి పేరు వస్తుంది, అలాగే ధన సంపాదన కూడా బాగుంటుంది
 4. శుక్ర గ్రహం సూర్య గ్రహానికి దగ్గరగా ఉండి ( అస్తంగతం ) 4వ స్థానముతో / అధిపతిథితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయములో నష్టాలు ఉంటాయి
 5. శుక్ర గ్రహానికి 9వ స్థానం మరియు 11వ స్థానంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఆధ్యాత్మిక భవనంలోకి వెళుతారు, మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి.
 6. మహా దశ అధిపతి చంద్ర గ్రహం నుండి, శుక్ర గ్రహం 4వ స్థానములో స్థితి అయి, కోణ స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి
 7. శుక్ర గ్రహం మారక స్థానాలు 2 లేదా 7 స్థానాలకు అధిపతి అయి, 8వ స్థానాధిపతిథి తో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ శుక్ర భుక్తిలో మరణం రావచ్చు

 

చంద్ర మహాదశ / సూర్య భుక్తి – 6 నెలల

 1. సూర్య గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో స్థితి అయి, లేదా కేంద్ర, కోన స్థానాలతో అయి,1,2,3 మరియు 11 స్థానాలతో / స్థానాధిపతులతో   సిగినీఫీ కేసన్స్ ఉంటె – గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ప్రమోషన్ కూడా ఉంటుంది. సంతానం ఉంటుంది. ధన సంపాదన కూడా బాగుంటుంది.
 2. సూర్య గ్రహానికి 6, 8, 12 స్థానాలతో మరియు స్థానాధిపతులతో పాటు, కేతు, గురు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – మెడిసిన్ చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య రంగములో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా వారికి ఈ సూర్య భక్తి లో నష్టాలు ఉంటాయి
 3. సూర్య గ్రహం 7వ స్థానములో స్థితి అయి, 2వ స్థానం మరియు బాధక స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె మృత్యువు గురించి భయం ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: