రాహు మహాదశలో – భుక్తి ఫలితాలు

రాహు మహాదశలో – భుక్తి ఫలితాలు

రాహు మహాదశ – 18 సంవత్సరాలు   

రాహు మహాదశ / రాహు భుక్తి – 2 సంవత్సరాల 8 నెలల 12 రోజులు

 1. సహజంగా రాహు గ్రహానికి వృషభ రాశి ఉచ్చ స్థానం, అలాగే మిథున రాశి మూల త్రికోణ రాశి. కావున రాహు గ్రహం ఈ రాశులలో స్థితి అయి, ఈ రాశులకు అధిపతులైన శుక్ర, బుధ గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే 3,6,10,11 స్థానాలతో / అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటే – ఈ రాహు భుక్తిలో జాతకుడికి / జాతకురాలికి మనస్సులో ఉన్న  కోరికలు నెరవేరుతాయి. ఏ పని మొదలుపెట్టిన శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలలో  లాభాలు ఉంటాయి. అలాగే జతగా  9వ స్థానాధిపతి మరియు గురు గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – రాహు భుక్తి లో రాజయోగం ఉంటుంది. అలాగే అదృష్టాలు కూడా ఉంటాయి
 2. రాహు గ్రహం ఏ స్థానములో స్థితి అయితే ఆ స్థానాధిపతితో బలంగా సిగినీఫీ కేసన్స్ ఉండి, సూర్య, చంద్ర, కుజ మరియు శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి లేదా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
 3. అలాగే 2, 6,10 స్థానాలతో / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
 4. అలాగే జతగా 6వ స్థానాధిపతి బలంగా ఉంటె 100%  ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
 5. రాహు గ్రహానికి మారక స్థానాలు 2, 7 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే చంద్ర గ్రహముతో బలంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె – మానసిక సమస్యలు, చిరాకు అలాగే మరణం గురించి బయలు ఉంటాయి. అలాగే జతగా బాధక స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ రాహు భుక్తిలో మరణం కూడా వస్తుంది.

 

 రాహు మహాదశ / గురు భుక్తి – 2 సంవత్సరాల 4 నెలల 24 రోజులు

 1. గురు గ్రహం – ఉచ్చ స్థానం కర్కాటక రాశిలో 10 డిగ్రీల లోపు స్థితి లేదా మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 2, 10 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది.
 2. సూర్య గ్రహానికి దగ్గరిగా ఉండి లేదా సూర్య గ్రహముతో బలంగా సిగినీఫీ కేసన్స్ ఉండి, 6,8,12 స్థానాలతో/స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఆర్థికంగా నష్టాలు అలాగే వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉండదు. సంతానం గురించి బాధలు ఉంటాయి.
 3. మహాదశ అధిపతి రాహు గ్రహం నుండి గురు గ్రహం 2, 3,4 మరియు 11 స్థానాలలో ఏ స్థానములో నైనా   స్థితి అయి, మిగతా స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యవసాయం మరియు వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఆధాత్మిక విషయంలో ఆసక్తి మరియు ట్రస్ట్ ద్వారా సేవ చేయాలనే ఆలోచనలో ఉంటారు.
 4. మహాదశ అధిపతి రాహు గ్రహం నుండి – గురు గ్రహం 6,8,12 స్థానాలతో/స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె -గురు భుక్తిలో సంపాదన గురించి  భాదలు ఉంటాయి. అలాగే కుజ, సూర్య, శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఈ భాద మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పులు కూడా చేస్తారు

 

 రాహు మహాదశ / శని భుక్తి – 2 సంవత్సరాల 10 నెలల 6 రోజులు

 1. శని గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా మూల త్రికోణ డిగ్రీలలో లేదా ఉచ్చ స్థానం తులా రాశిలో 16 డిగ్రీలలోపు స్థితి అయి, 3, 11 స్థానాలతో / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలలో తన వంతు గా భాగస్వాములు అవుతారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది
 2. శని గ్రహం 8వ స్థానం లేదా 12 స్థానాలలో స్థితి అయి, 8 12 స్థానాలతో / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఆయుర్దాయం బాగుంటుంది. కానీ మిత్రులు శత్రువులు అవుతారు, బంధువులతో గొడవలు ఉంటాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి.
 3. మహాదశ అధిపతి రాహు గ్రహం నుండి – శని గ్రహం 8వ స్థానం లేదా 12 స్థానాలలో స్థితి అయి, 8 12 స్థానాలతో / స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే సూర్య, కుజ గ్రహాలతో సిగినీఫీకేసన్స్ ఉంటె – ఆర్థికంగా నష్టాలు, గొడవలు ఉంటాయి. అలాగే బుధ గ్రహముతో కూడా అదనంగా సిగినీఫీకేసన్స్ ఉంటె ఆస్తి విషయములో గొడవలు ఉంటాయి.

 

రాహు మహాదశ / బుధ భుక్తి – 2 సంవత్సరాల 6 నెలల 18 రోజులు

 1. బుధ గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 9వ స్థానం / స్థానాధిపతితో / నక్షత్రాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటే – కుటుంబములో శుభకార్యాలు, వివాహాలు జరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి.
 2. గమనిక : రాహు మహాదశలో / బుధ భుక్తి నడుస్తున్న వారికి – బుధ గ్రహం 9వ స్థానములో స్థితి అయితే – 100% జాతకుడికి ఈ భుక్తిలో మంచి ఫలితాలు ఉంటాయి.
 3. బుధ గ్రహం – 3వ స్థానం లేదా 10వ స్థానం లేదా 11వ స్థానలలో ఏ స్థానంలో  స్థితి అయిన, మిగత స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, 9వ స్థానముతో సిగినీఫ్ఫ్ కేసన్స్ ఉంటె – ఆరోగ్యం బాగుంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొత్తగా ఏ వ్యాపారం మొదలుపెట్టిన మంచి ఫలితాలు ఉంటాయి. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు.                                          అలాగే మహాదశ అధిపతి రాహు గ్రహం నుండి పైన వివరించిన విధంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఇవే ఫలితాలు ఉంటాయి.
 4. బుధ గ్రహానికి 6,8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే మారక స్థానాలు మరియు భాధక స్థానం/ స్థానాధిపతి సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ వెళుతారు. ఒక వేళా కుజ, శని గ్రహాలతో బలంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె – మరణం కూడా సంభవిస్తుంది.

 

రాహు మహాదశ / కేతు భుక్తి – 1 సంవత్స రం 18 రోజులు

 1. కేతు గ్రహం ఏ స్థానములో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో మరియు ఆ నక్షత్రాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – కేతు భుక్తిలో మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే బయలు, నష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 2. కేతు గ్రహం – ఏ స్థానములో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో మరియు ఆ నక్షత్రాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే లగ్నం / లగ్నాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వ్యవసాయం మరియు వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. అలాగే అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు.
 3. కేతు గ్రహం 8వ స్థానాధిపతి కలిసి స్థితి అయితే – అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే అదనంగా 5 మరియు 11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు ఉండవు.
 4. కేతు గ్రహానికి 8,12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, కేతు గ్రాహం బలహీనంగా ఉంటె – కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాగే గొడవలు, మానసిక సమస్యలు ఉంటాయి.

 

రాహు మహాదశ / శుక్ర భుక్తి – 3 సంవత్సరాలు

 1. శుక్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, లగ్నం / లగ్నాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉండాలి, అలాగే లగ్నాధిపతి బలంగా ఉంటె – కుటుంబంలో సంతోషం, వ్యవసాయంలో లాభాలు, సంతానము ఉంటుంది. గవర్నమెంట్ కు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఉద్యోగం చేస్తున్నవారికి మంచి ఆఫీసర్ స్థాయి ప్రమోషన్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే – శుక్ర భుక్తి మంచి రాజా యోగం ఫలితాలను ఇవ్వగలిగే భుక్తి.
 2. శుక్ర గ్రహం – 6, 8,12 స్థానాలలో ఏదైనా ఒక స్థానములో స్థితి అయి, మిగతా స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే  కుజ, రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – కుటుంబానికి లేదా భార్య బిడ్డలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. గొడవలు, నష్టాలు, బంధువులతో స్నేహ  బంధాలు ఉండవు. మరణం గురించి బయలు ఉంటాయి.
 3. శుక్ర గ్రహం – 6, 8,12 స్థానాలలో ఏదైనా ఒక స్థానములో స్థితి అయి, మిగతా స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే  మారక మరియు బాధక స్థానంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్యంతో హాస్పిటల్ వెళుతారు. అలాగే అదనంగా కుజ, శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె మరణం కూడా ఉంటుంది.

 

రాహు మహాదశ / సూర్య భుక్తి – 10 నెలల 24 రోజులు

 1. సూర్య గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం మేష రాశిలో 16 డీగ్రీలలోపు స్థితి అయి, 11వ స్థానం / స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే మహాదశ అధిపతి రాహు గ్రహం ఏ రాశిలో స్థితి అయితే ఆ అధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ధన సంపాదన కూడా చాల బాగుంటుంది. రాజకీయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య రంగంలో ఉండే వారికి కూడా సూర్య భుక్తి మంచి ఫలితాలను ఇస్తాడు.
 2. సూర్య గ్రహానికి లగ్నం / లగ్నాధిపతి మరియు 9, 10 స్థానాలు / అధిపతులతో బలంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె – వృత్తి ఉద్యోగ, వ్యాపారాలలో చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
 3. సూర్య గ్రహానికి 6,8,12 స్థానాలతో/ అధిపతులతో మరియు కుజ, శని, రాహు, కేతు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వైద్య రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మెడిసిన్ చదువుకునే వారికి కూడా సూర్య భుక్తి  ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాడు .
 4. ఒకవేళ సూర్య గ్రహానికి కుజ, శని, రాహు, కేతు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ లేకుండా కేవలం 6,8,12 స్థానాలతో/ అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – సూర్య భుక్తి లో  ఖచ్చితంగా  నష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే సూర్య భుక్తి చెడు ఫలితాలను100% ఇస్తాడు.
 5. సూర్య గ్రహానికి 8వ స్థానం/ అధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉండి, మారక స్థానాలు మరియు భాదాక స్థానంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ సూర్య భుక్తిలో అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. అలాగే కుజ, శని గ్రహాలతో కూడా అదనంగా సిగినీఫీ కేసన్స్ ఉంటె – మరణం కూడా ఉంటుంది.

 

 రాహు మహాదశ / చంద్ర భుక్తి – 1 సంవత్స రం 6 నెలలు

 1. చంద్ర గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం వృషభ రాశిలో 10 డీగ్రీలలోపు స్థితి అయి, 11వ స్థానము/స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఆర్థికంగా ధన సంపాదన విషయములో లాభాలు బాగుంటాయి. పెట్రోలియం, జల సంబంధ, నగలు మరియు బట్టలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే సంతానం, స్థిరాస్తుల విషయాలలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
 2. మహాదశ అధిపతి రాహు గ్రహం నుండి – చంద్ర గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయితే – ఏ పని మొదలుపెట్టిన సఫలీకృతం అవుతాయి. అలాగే అదృష్టాలు కూడా ఉంటాయి. గురు, శుక్ర గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ చంద్ర భుక్తిలో వ్యాపారం చేస్తున్న వారికి ధన లక్ష్మి మరియు వ్యవసాయం చేస్తున్నవారికి  దాన్య లక్ష్మి తో పాటు సంపాదనా   కూడా ఉంటుంది.
 3. లగ్నం నుండి లేదా మహాదశ అధిపతి రాహు గ్రహాం నుండి చంద్ర గ్రహాం 6, 8,12 స్థానాలలో ఏ స్థానములోనైనా స్థితి మిగతా స్థానాలతో /స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఉంటాయి. మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి.
 4. అలాగే మారక మరియి బాధక స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె మరణం కూడా ఉంటుంది

 

రాహు మహాదశ / కుజ భుక్తి – 1 సంవత్స రం 18 రోజులు

 1. కుజ గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం మకర  రాశిలో  స్థితి అయి, 5,9,11స్థానాలు /స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయములో మంచి పాలితాలు ఉంటాయి. ఇల్లు కొట్టుకోవాలి అనే కోరిక కూడా నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషాలు, శుభకార్యాలు ఉంటాయి. సంతానం కూడా ఉంటుంది.
 2. అలాగే మహాదశ అధిపతి నుండి, కుజ గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం మకర  రాశిలో స్థితి అయి, 5,9,11స్థానాలు /స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ కుజ భుక్తిలో జాతకుడికి/ జాతకురాలికి రాజయోగం లాంటి ఫలితాలు ఉంటాయి. అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.
 3. కుజ గ్రహానికి 8, 12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, 7వ స్థానాధిపతి తో మరియు శుక్ర గ్రహానికి సిగినీఫీ కేసన్స్ ఉంటె భార్యకు అనారోగ్య సమస్యలు ఉంటాయి . అలాగే 7వ స్థానాధిపతి తో మరియు గురు గ్రహానికి సిగినీఫీ కేసన్స్ ఉంటె – భర్తకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే నష్టాలు కూడా ఉంటాయి.
 4. కుజ గ్రహానికి 6, 8, 12 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే మారక మరియు భాదాక స్థానాలతో/ స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – యాక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే శని గ్రహంతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – తీవ్రత ఎక్కువ ఉంటుంది. మరణం కూడా ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: