ధనుస్సు రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

రాశి చక్రంలోని గ్రహాలన్నీ ధనుస్సు రాశి యొక్క ప్రభావంలో ఉన్నాయి. కావున వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి విద్య సంబంధిత వ్యాపారాలు మరియు ఆధ్యాత్మిక సంబంధిత వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది. అలాగే దేవాదాయ సంస్థలలో పనిచేసే వారికి ధన సంపాదన పెరుగుతుంది, అలాగే అదృష్టాలు వరిస్తాయి. ప్రయివేట్ ఉద్యోస్టులు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టె అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారి కోరిక నెరేవేరుతుంది.

కుటుంబం :

కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

ఆరోగ్యం :

రాశి చక్రంలో శని, గురు, రాహు, కుజ గ్రహాలు శుక్ర గ్రహం యొక్క ప్రభావంలో ఉన్నారు. కావున ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం చాలా జాగ్రతగా ఉండాలి. ఎందుకంటె ఆ అనారోగ్య సమస్యను మరింత తీవ్రతగా ఉంటుంది.

పరిహారం:

ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. అలాగే ధన్వంత్రి మంత్రం ప్రతి రోజు 108 సార్లు జపించాలి

ధన్వంత్రి మంత్రం –

  • ఓం నమో భగవతే వాసుదేవాయ
    ధన్వంతరి అమృత కలశ హస్తాయ,
    సర్వ మాయ వినాశానయ

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/