శని మహాదశలో – భుక్తి ఫలితాలు

శని మహాదశలో – భుక్తి ఫలితాలు

శని మహాదశ –19 సంవత్సరాలు

శని మహాదశ / శని భుక్తి – 3 సంవత్సరాల 3 రోజులు

 1. శని గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం తులారాశిలో 16 డిగ్రీలలోపు స్థితి అయి, గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సంతానం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ధన సంపాదన పెరుగుతుంది. అలాగే అదనంగా 7,10 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృతి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది.
 2. శని గ్రహానికి – ఏ లగ్నమైతే ఆ లగ్నానికి చెందిన యోగ కారక గ్రహం తో పాటు తప్పనిసరిగా 2వ్ స్థానం మరియు శుక్ర, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – శుక్ర భుక్తిలో జాతకుడికి ఫలితాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి.
 3. శని గ్రహానికి 3 మరియు 8 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ రాహు, చంద్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 4. శని గ్రహం – 6, 8,12 స్థానాలలో తో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, సూర్య, రాహు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్యం, నష్టాలు, అప్పులు ఉంటాయి. ఈ విధంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – శని మహాదశలో / శని భుక్తి మంచి ఫలితాలను ఇవ్వడు.
 5. అలాగే అదనంగా మారక మరియు భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, శని భుక్తిలో మరణం కూడా ఉంటుంది. ఒకవేళ శని మారక లేదా భాదాక అధిపతి అయితే – 100% మరణం ఉంటుంది.

 

శని మహాదశ / బుధ భుక్తి – 2 సంవత్సరాల 8 నెలల 9 రోజులు

 1. బుధ గ్రహం- మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 2, 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఉన్నత విద్య, కుటుంబంలో సంతోషం మరియు శుభకార్యాలు జరుగుతాయి. వృతి, ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
 2. మహాదశ అధిపతి శని గ్రహం నుండి – బుధ గ్రహం 6, 10 స్థానాలలో ఏ స్థానములో స్థితి ఐన సరే , 6, 10 స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ కూడా ఉంటె – వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ, అనారోగ్యం సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
 3. బుధ గ్రహం మారక స్థానాలలో (2, 7స్థానాలు ) స్థితి అయిన లేదా మారక స్థానాలకు అధిపతి అయిన- బుధ భుక్తిలో వ్యక్తిగత సమస్యలు, శారీరక సమస్యలు (physical problems) ఎందుకంటె బుధ గ్రహం నపుంసక గ్రహం.

శని మహాదశ / కేతు భుక్తి – 1సంవత్సరం 1 నెల 9 రోజులు

 1. కేతు గ్రహం ఏ స్థానంలో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో మరియు శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కేతు భుక్తిలో ఫలితాలు బాగుంటాయి.
 2. అలాగే ఏ స్థానంలో స్థితి అయిన, ఆ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ లేకుండా కుజ, శని, సూర్య గ్రహాలతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఫలితాలు బాగుండవు.
 3. కేతు గ్రహం కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 3, 11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృతి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రొమోషన్ కూడా ఉంటుంది. ఆధాత్మిక విషయాలలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
 4. లగ్నం నుండి లేదా మహాదశ అధిపతి శని గ్రహం నుండి – కేతు గ్రహం 8, 12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు, నష్టాలు, కుటుంబానికి దూరంగా ఉంటారు. మరణం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి

శని మహాదశ / శుక్ర భుక్తి – 1సంవత్సరాల 2 నెలలు

 1. శుక్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా, కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 11వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కుటుంబంలో సంతోషాలు, మరియు శుభ కార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధన సంపాదన బాగుంటుంది. వ్యాపారరీత్యా పెద్ద పెద్ద వారితో పరిచయాలు పెరుగుతాయి.
  అలాగే ఈ సమయంలో గురు ట్రాన్సిట్ – శుక్ర గ్రహం మీద ఉన్న, శుక్ర గ్రహం ఉన్నా రాశిలో స్థితి అయిన ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 2. శుక్ర గ్రహం 6, 8,12 స్థానాలలో స్థితి అయి, 7వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ లేకపోతే – జీవిత భాగస్వామితో సమస్యలు ఉంటాయి. అలాగే వీడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటె శుక్ర గ్రహం వివాహానికి కారకత్వం వహిస్తాడు.
 3. అలాగే శుక్ర గ్రహం 6, 8,12 స్థానాలలో స్థితి అయి, కుజ, శని, రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 5,11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు వచ్చిన తగ్గుతాయి. ఒకవేళ లేకపోతే అనారోగ్యం వలన ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ప్రమాదాల వలన హాస్పిటల్ కు వెళుతారు. అలాగే అదనంగా మారక మరియు భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మరణం కూడా ఉంటుంది.
 4. అలాగే మహాదశ అధిపతి శని గ్రహం నుండి – శుక్ర గ్రహం 6, 8,12 స్థానాలలో స్థితి అయి, కుజ, శని, రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఎవ్వరిని మోసం చేయాలనే ఆలోచనలో ఉంటారు. అలాగే కుటుంబంలో గొడవలు ఉంటాయి. అనారోగ్య విషయానికొస్తే గుండె, పంటికి సంబంధించిన సమస్యలు, అలాగే జననేంద్రియాలకు (Genitals- Private Parts) సంబంధించిన సమస్యలు ఉంటాయి

 

శని మహాదశ / సూర్య భుక్తి – 11 నెలల 12 రోజులు

 1. సూర్య గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృత్తి, ఉద్యాగాలలో ప్రమోషన్స్ ఉంటాయి.కుటుంబంలో సంతోషాలు, అలాగే సంతానం ఉంటుంది. వాహనాలను కొంటారు. అలాగే వ్యవసాయం మరియు
  రాజకీయంలో ఉండేవారికి ఈ సూర్య భుక్తి 100% మంచి ఫలితాలను ఇస్తాడు.
 2. సూర్య గ్రహం – 6, 8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, లగ్నం/లగ్నాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఆర్థికంగా అంతగా నష్టాలు ఉండవు. ఒకవేళ లగ్నం/లగ్నాధిపతితో సిగ్నిఫీకేషన్స్ లేకపతే – ఆర్థికంగా ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసిన మంచి ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.
 3. సూర్య గ్రహనికి 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – బీపి మరియు గుండెకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కుజ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే 5, 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ట్రీట్మెంట్ / సర్జరీ సక్సెస్ అవుతుంది.

శని మహాదశ / చంద్ర భుక్తి – 1సంవత్సరం 11 నెలలు

 1. చంద్ర గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 11వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ప్రతి విషయంలో ఫలితాలు బాగుంటాయి. అలాగే గురు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – చంద్ర భుక్తిలో ఫలితాలు 100% బాగుంటాయి.
 2. చంద్ర గ్రహం – బలహీనంగా ఉండి, రాహు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె –                                                            మానసిక సమస్యలు ఉంటాయి. అలాగే అదనంగా బుధ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె, ప్రతి విషానికి చిరాకు, కోపం అలాగే పిచ్చిగా ప్రవర్తిస్తారు.
 3. చంద్ర గ్రహానికి, మహాదశ అధిపతి శని గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 7వ స్థానం/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వివాహానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలాగే అదనంగా 6, 8 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె -ఈ చంద్ర భుక్తిలో వీడిపోతారు లేదా విడాకులు తీసుకుంటారు. అలాగే మానసికంగా సోమరితనం వస్తుంది. ఈ రూల్ 100% కరెక్ట్.

శని మహాదశ / కుజ భుక్తి – 1సంవత్సరం 1 నెల 9 రోజులు

 1. కుజ గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం మకరరాశిలో స్థితి అయి, 2, 11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ధన సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. అలాగే అదనంగా సూర్య లేదా చంద్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి.
  అలాగే కుజ భుక్తి నడుస్తున్న సమయంలోనే – గురు ట్రాన్సిట్ సూర్య గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె గవర్నమెంట్ కు సంబంధించిన ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 2. కుజ గ్రహానికి 4వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే తప్పనిసరిగా శుక్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయంలో ఫలితాలు బాగుంటాయి. అలాగే అదనంగా 2, 7, 10 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఈ కుజ భుక్తిలో లాభాలు ఊహించనంతగా ఉంటాయి.
 3. కుజ గ్రహం – నీచ స్థానం కర్కాటక రాశిలో స్థితి అయి, 8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కుజ భుక్తిలో జాతకుడికి ఏ పని చేసిన కలిసి రాదు. ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు కూడా ఉంటాయి. అలాగే శని, రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
 4. అలాగే కుజ గ్రహానికి మారక మరియు భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అదనంగా 8వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉండి, ఈ 8వ స్థానాధిపతి బలహీనంగా ఉంటె – ప్రమాదాలు జరుగుతాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అవుతారు. అలాగే 5వ స్థానం/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – క్షేమంగా ఇంటికి వస్తారు. ఒకవేళ సిగ్నిఫీకేషన్స్ లేకపోతే – మరణం ఉంటుంది. 100% ఖచ్చితమైన రూల్.

శని మహాదశ /రాహు భుక్తి – 2 సంవత్సరాల 10 నెలల 6 రోజులు

 1. రాహు గ్రహం ఏ స్థానంలో స్థితి అయితే ఆ స్థానాధిపతితో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి, కోణ స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – రాహు భుక్తిలో ఫలితాలు బాగుంటాయి. ఒకవేళ లేకోపోతే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అదనంగా చంద్ర, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మానసిక సమస్యలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా ఉంటాయి. మానసిక ఒత్తిడి భరించలేక అప్పులు కూడా చేస్తారు. ఈ గ్రహాలు బలహీనంగా ఉంటె – ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి.
 2. రాహు గ్రహం ఏ స్థానంలో స్థితి అయిన సరే – యోగకారక గ్రహం మరియు కోణ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – రాహు భుక్తిలో అన్ని విషయాలలో ఫలితాలు చాలా బాగుంటాయి. ఏ పని చేసిన అదృష్టాలు ఉంటాయి. అలాగే అదనంగా 11వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. రాహు గ్రహం గ్రహానికి 6, 8 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, బుధ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – నష్టాలు ఉంటాయి. అలాగే అప్పులు కూడా చేస్తారు. అలాగే మేష, కన్య, ధనుస్సు రాశులతో మరియు ఈ రాశ్యాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె, తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే మారక స్థానాలతో మరియు 12వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఈ రాహు భుక్తిలో ప్రతి విషయంలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.

శని మహాదశ / గురు భుక్తి – 2 సంవత్సరాల 6 నెలల 12 రోజులు

 1. గురు గ్రహం – కేంద్ర, కోణ స్థానాలలో లేదా మూల త్రికోణ డిగ్రీలలో లేదా ఉచ్చ స్థానం కర్కాటక రాశిలో స్థితి అయి, 11వ స్థానం/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. శుభకార్యాలు జరుగుతాయి. సంతానం విషయంలో ఫలితాలు బాగుంటాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారికి ఫలితాలు బాగుంటాయి.
 2. గురు గ్రహం ఏ స్థానంలో స్థితి అయిన, 1,2,4,5,7,9,10,11 స్థానాలతో/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – గురు భుక్తి అదృష్టాలను మరియు లాభాలను ఇస్తుంది. అలాగే ఆధాత్మిక విషయాలలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
 3. గురు గ్రహనికి శని గ్రహముతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటె – సంతానం విషయంలో ఫలితాలు బాగుండవు. అలాగే గురు గ్రహానికి 6, 8 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె గురు భుక్తిలో సంతానం ఉండదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
 4. మహాదశ అధిపతి శని గ్రహం నుండి గురు గ్రహం 6,8,12 స్థానాలలో స్థితి అయి, అలాగే గురు గ్రహం బలహీనంగా ఉంటె – మానసిక సమస్యలు మరియు అనారోగ్య సమాసాలు ఉంటాయి.

One thought on “శని మహాదశలో – భుక్తి ఫలితాలు

 1. బాగా చెప్పారు, కన్యా లగ్నం, లగ్నం లో శని,వ్రుశ్చికం లో బుధ శుక్రులు,మకరం లో రాహువు, ధనుస్సు లో కుజుడు, మేషం లో గురు (వక్ర)చంద్రులు
  అంశ లో శని కన్య లో…వర్గోత్తమ
  వివరణ. Tell ending when how

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: