వృశ్చిక రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

రాశి చక్రంలో ఒక కేతు గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్నీ వృచ్చిక రాశి యొక్క ప్రభావములో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే అదృష్టాలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో పని చేసేవారికి ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మంచి శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెడతారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి.

కుటుంబం :

కుటుంబంలో పండగలాంటి వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

ఆరోగ్యం :

ఈ నెలలో సహజంగా వచ్చే చిన్న, చిన్న జ్వరాలు తప్ప ఇతర అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం:

ప్రతి అది, సోమవారాలు శివాలయానికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శివ గాయత్రి మంత్రం 108 సార్లు జపించాలి

శివ గాయత్రి –

  • ఓం పంచవక్త్రాయ విద్మహే
  • మహాదేవాయ ధీమహి,
  • తన్నోరుద్రః ప్రచోదయాత్

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/