సూర్య మహాదశలో భుక్తి ఫలితాలు

సూర్య మహాదశలో భుక్తి ఫలితాలు

సూర్య మహాదశ – 6 సంవత్సరాలు

 

సూర్య మహాదశ / సూర్య భుక్తి – 3 నెలల 18 రోజులు

 1. సూర్య గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో స్థితి, మేష రాశిలో ఉచ్చ స్థానంలో 12డిగ్రీలలోపు స్థితి అయితే – జాతకుడికి ధన సంపాదన, మంచి గుర్తింపు, వ్యాపారములో లాభాలు బాగుంటాయి.
 2. సూర్య గ్రహం 11వ స్థానములో స్థితి ఐన లేదా 11వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉండి, 9 మరియు 10 స్థానాలతో లేదా అధిపతులతో లేదా నక్షత్రాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె -ఈ భుక్తిలో మంచి ఫలితాలు ఉంటాయి
 3. సూర్య గ్రహం 2వ స్థానం లేదా 7వ స్థానంలో స్థితి అయి 2, 7 స్థానాలతో లేదా అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – నష్టాలు, అనారోగ్య సమస్యలు మరియు మరణం కూడా సంభవించవచ్చు

 

సూర్య మహాదశ / చంద్ర భుక్తి – 6 నెలలు

 1. చంద్ర గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో స్థితి అయితే, వృషభ రాశిలో ఉచ్చ స్థానం కావున, 8 డిగ్రీలలోపు స్థితి అయితే ధన సంపాదన బాగుంటుంది, చర  స్థిరాస్తులను సంపాదించుకుంటారు.                      సంతానం ఉంటుంది. గవర్నమెంట్కు సంబంధించిన ఫలితాలు బాగుంటాయి
 2. చంద్ర గ్రహం స్వంత నక్షత్రాలలో స్థితి అయి, 4, 9 మరియు 11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె మంచి ఫలితాలు ఉంటాయి
 3. చంద్ర గ్రహం బలహీనంగా ఉంటె – కుటుంబములో బాధలు, ఆస్తి విషయములో నష్టాలు, ధన నష్టం, నీటి వలన ప్రమాదాలు, చెడు పేరు వస్తుంది

 

సూర్య మహాదశ / కుజ  భుక్తి – 4 నెలల 6 రోజులు

 1. కుజ గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో, అలాగే మకర రాశిలో ఉచ్చ స్థానం కావున ఈ రాశిలో శ్రవణం నక్షత్రం లేదా స్వంత నక్షత్రం ధనిష్ఠ లో స్థితి అయితే – స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. ధన సంపాదన బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విషయములో కుజ గ్రహానికి 4వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇంకా మంచిది
 2. కుజ గ్రహం గురు నక్షత్రాలలో స్థితి అయి, 5,9,11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే 5,9,11 స్థానాలకు చెందిన కారక గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇంకా మంచిది
 3. కుజ గ్రహంబలహీనంగా ఉన్న లేదా 12వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉన్న – బంధువులతో గొడవలు లేదా ఎవరో ఒకరు చనిపోవడం, మానసిక స్థితి బాగుండదు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది

 

 సూర్య మహాదశ / రాహు భుక్తి – 10 నెలల 24 రోజుల

 1. రాహు గ్రహం – ఏ స్థానములో స్థితి అయిన సరే – ఆ స్థానాధిపతి మరియు నక్షత్రాధిపతితొ రాహు గ్రహానికి మంచి సిగినీఫీ కేసన్స్ ఉండాలి. అలాగే ఈ గ్రహాలకు 5, 9 స్థానాలతో మరియు అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. అలాగే మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది
 2. రాహు గ్రహంస్వంత నక్షత్రాలలో స్థితి అయిన లేదా సూర్య, చంద్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది.
 3. రాహు గ్రహం – 3,6,10,11 స్థానాలలో స్థితి అయి, ఏ లగ్నమైతే ఆ లగ్నానికి చెందిన యోగ కారక గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – జాతకుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి
 4. రాహు గ్రహం – సూర్య గ్రహం నుండి 8వ స్థానం లేదా 12వ స్థానములో స్థితి అయితే – నష్టాలు ఉంటాయి, అలాగే జైలుకు వెళాల్సిన పరిస్థితి వస్తుంది.
 5. రాహు గ్రహం – 2వ స్థానం లేదా 7వ స్థానములో స్థితి అయి 2, 7 స్థానాధిపతులతో మరియు నక్షత్రాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు మరియు మృత్యువు కూడా రావచ్చు. 

 

 సూర్య మహాదశ / గురు భుక్తి – 9 నెలల 18 రోజుల

 1. గురు గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో అలాగే ఉచ్చ స్థానం కర్కాటక రాశిలో 10 డిగ్రీలలోపు స్థితి అయిన లేదా కేంద్ర స్థానాలలో స్థితి అయి కేంద్ర స్థానాధిపతులతో సిగినఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన, సంతానం, మనసులోని కోరికలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది
 2. గురు గ్రహం 9వ స్థానములో స్థితి అయి 10వ స్థానం / స్థానాధిపతి/ నక్షత్రాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే 9 మరియు 7వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె కుటుంబములో వివాహం జరుగుతుంది.    అలాగే కుజ మరియు శుక్ర గ్రహాలతో పాటు గురు మరియు 9, 4 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – స్థిరాస్తుల విషయములో మంచి ఫలితాలు ఉంటాయి.
 3. మహాదశ అధిపతి సూర్య గ్రహం నుండి 6 లేదా 8వ స్థానములో గురు గ్రహం స్థితి అయిన లేదా సిగినీఫీ కేసన్స్ ఉన్న – జాతకుడికి చెడు ఫలితాలు ఉంటాయి

 

సూర్య మహాదశ / శని భుక్తి – 11 నెలల 12 రోజుల

 1. శని గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో అలాగే ఉచ్చ స్థానం తులా రాశిలో  16 డిగ్రీలలోపు స్థితి అయిన లేదా కేంద్ర స్థానాలలో స్థితి అయి కేంద్ర స్థానాధిపతులతో సిగినఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన, స్థిరాస్తుల  విషయములో మంచి ఫలితాలు ఉంటాయి. గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
 2. నీచ స్థానం మేష రాశిలో 16 డిగ్రీలలోపు స్థితి అయితే నష్టాలు ఉంటాయి. అలాగే మేష రాశిలో 16 డిగ్రీల తరువాత స్థితి అయితే నీచ స్థానం యొక్క ప్రభావం తగ్గుతుంది. కావున నష్టాలు ఉండవని చెప్పవచ్చు.
 3. శని గ్రహం నుండి 8వ స్థానాధిపతి ఏ గ్రహమైతే ఆ గ్రహానికి శని గ్రహముతో సిగినీఫీ కేసన్స్ లేకపోతే మరణం గురించి బయలు ఉంటాయి. అలాగే మారక స్థానాలు 2 మరియు 7 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఈ శని భుక్తిలో జాతకుడికి మరణము ఉంటుంది
 4. మహాదశ అధిపతి సూర్య గ్రహం నుండి శని గ్రహం 1,3,6,8,12 స్థానాలలో స్థితి అయి, మిగతా స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – శని భుక్తిలో జాతకుడికి మంచి ఫలితాలు ఉండవు. ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి

 

సూర్య మహాదశ / బుధ భుక్తి – 10 నెలల 6 రోజుల

 1. బుధ గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో అలాగే ఉచ్చ స్థానం కన్యా రాశిలో స్థితి అయిన లేదా కేంద్ర స్థానాలలో స్థితి అయి కేంద్ర స్థానాధిపతులతో సిగినఫీ కేసన్స్ ఉంటె – ధన సంపాదన, వ్యాపారములో లాభాలు, శుభ కార్యాలు, కుటుంబ వాతావరణం బాగుంటుంది
 2. బుధ గ్రహానికి 5,9,10 స్థానాలతో మరియు అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ కుటుంబములో వివాహం జరుగుతుంది. వృత్తి ఉద్యోగలలో ప్రమోషన్ ఉంటుంది.
 3. మహాదశ అధిపతి సూర్య గ్రహానికి మరియు బుధ గ్రహానికి ఒకరికొకరికి మంచి సిగినీఫీ కేసన్స్ ఉండి – అలాగే కేంద్ర, కోణ స్థానాధిపతులతో సిగినఫీ కేసన్స్ ఉంటె – మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు.
 4. మహాదశ అధిపతి సూర్య గ్రహానికి మరియు బుధ గ్రహానికి ఒకరికొకరికి మంచి సిగినీఫీ కేసన్స్ లేకుండా, బుధ గ్రహానికి 6 లేదా 8వ స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె – జాతకుడికి నష్టాలు ఉంటాయి

 

సూర్య మహాదశ / కేతు భుక్తి – 4 నెలల 6 రోజులు

 1. కేతు గ్రహం – ఏ స్థానములో స్థితి అయిన సరే – ఆ స్థానాధిపతి మరియు నక్షత్రాధిపతితొ  కేతు గ్రహానికి మంచి సిగినీఫీ కేసన్స్ ఉండాలి. అలాగే ఈ గ్రహాలకు 5, 9 స్థానాలతో మరియు అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. అలాగే మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది. అలాగే ఈ సిగినీఫీకేసన్స్ తో పాటు లగ్నం లేదా లగ్నాధిపతితో సిగినీఫ్ కేసన్స్ ఉంటె -పైన వివరించిన ఫలితాలు బాగుండవు. 5, 9 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ లేకుండా కేవలం లగ్నం లేదా లగ్నాధిపతితో సిగినీఫ్ కేసన్స్ ఉంటె జాతకుడికి/జాతకురాలికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. మృతువు గురించి బయలు ఉంటాయి.
 2. మహాదశ అధిపతి సూర్య గ్రహంనుండి – కేతు గ్రహం 8 లేదా 2 స్థానాలలో స్థితి అయితే మూత్ర సంబంధ వ్యాధులు, పంటి సమస్యలు ఉంటాయి.
 3. కేతు గ్రహం – ఉపచయ స్థానాలు 3,6,10,11 స్థానాలలో స్థితి అయి ఈ స్థానాధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె – భర్య పిల్లల విషయములో సంతోషం, సంతానం ఉంటుంది, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి
 4. బుధ గ్రహం 2, 7 మారక స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉన్న, మారక స్థానాలకు అధిపతి ఐన – కేతు భుక్తిలో అనారోగ్య సమస్యల వలన మరణం ఉంటుంది

 

సూర్య మహాదశ / శుక్ర భుక్తి – 1 సంవత్సరం

 1. శుక్ర గ్రహం మూల త్రికోణ డిగ్రీలలో అలాగే ఉచ్చ స్థానం మీనా  రాశిలో  16 డిగ్రీల తరువాత స్థితి అయి  లేదా కేంద్ర స్థానాలలో స్థితి అయి కేంద్ర స్థానాధిపతులతో సిగినఫీ కేసన్స్ ఉంటె – స్థిరాస్తులను సంపాదించుకుంటారు. వాహనాలకు సంబంధించిన వ్యాపారం, నగలు మరియు బట్టల వ్యాపారం  చేస్తున్నవారికి మంచి లాభాలు ఉంటాయి.
 2. మహాదశ అధిపతి సూర్య గ్రహం బలంగా ఉండి , శుక్ర గ్రహానికి లగ్నం లేదా 7వ స్థానముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె  కుటుంబములో వివాహం జరుగుతుంది లేదా జాతకుడికి వివాహం జరుగుతుంది
 3. మహాదశ అధిపతి సూర్య గ్రహం మరియు శుక్ర గ్రహానికి ఏ మాత్రం సిగినీఫీ కేసన్స్ లేకుండా ఉండి, శుక్ర గ్రహానికి 6,8,12 స్థానాలతో మరియు అధిపతులతో సిగినీఫీ కేసన్స్ ఉంటె వ్యాపారములో నష్టాలు ఉంటాయి. అలాగే జాతకుడికి ఆర్థికంగా చాలా నష్టాలు కూడా ఉంటాయి. అప్పులు కూడా చేస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: