వృషభ రాశి – జనవరి 2023

ఇక్కడ జనవరి 1, 2023 –

రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

గమనిక : మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు 2, 6, 10 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.

ధన సంపాదన :

ఇక్కడ ఇవ్వబడిన రాశి చక్రంలో ఉన్న 9 గ్రహాలు వృష రాశి ప్రభావంలో ఉన్నారు. కావున వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి బ్యాంక్ ఉద్యోగస్తులకు మరియు ఫైనాన్స్ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి  ధన సంపాదన చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో శుక్ర, బుధ, గురు గ్రహాలకు బలంగా సిగ్నిఫికేషన్స్ ఉంటె ఏ వ్యాపారం చేస్తున్న సరే ధన సంపాదనతో పాటు అదృష్టాలు ఉంటాయి

కుటుంబం :

శుక్ర గ్రహం రాహు, కేతు గ్రహ ప్రభావంలో ఉంది. కావున కొత్తగా వివాహం జరిగిన దంపతుల మధ్య అన్యోనత ఉండదు. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునేవారి కోరిక నెరవేరదు. కుటుంబ సమస్యలు కూడా బాధిస్తాయి.

ఆరోగ్యం :

గొంతు సంబంధిత సమస్యలు, అలాగే రక్తహీనత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కుజ, శని, రాహు గ్రహాల ప్రభావం ప్రమాదాలు కలిగిస్తాయి. కావున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆపరేషన్స్ జరిగిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం:

ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. ప్రతి రోజు శ్రీ వృషభ గాయత్రి మంత్రం జపించాలి

శ్రీ వృషభ గాయత్రి –                                                                                                    

  • ఓమ్ ధీక్ష  శృంగాయ విద్మహే                                                                                           
  • వేద హస్తాయ ధీమహి,     
  • తన్నో వృషభ ప్రచోదయాత్                                                                                                                                                           

మాస ఫలితాలు – 2023 : https://nsteluguastrology.com/category/monthly-predictions-2023/

మాస ఫలితాలు – జనవరి 2023 : https://nsteluguastrology.com/category/january-month-2023/