వృత్తి, ఉద్యోగాలు – జంట గ్రహాల కలయిక

వృత్తి, ఉద్యోగాలు – జంట గ్రహాల కలయిక

సూర్య, చంద్ర గ్రహాలు లేదా ఈ గ్రహాలు రాశి చక్రంలో ఒకే రాశిలో కాకుండా 75 డిగ్రీల దూరంలో స్థితి ఐన

 • గవర్నమెంట్ జాబ్స్, సంగీతంలో కూడా మంచి ప్రతిభ ఉంటుంది మనస్తత్వవేత్తలు, రాజకీయ నాయకులు. వీరి యొక్క వృత్తి ఏదైనా సరే అంకిత భావంతో చేస్తారు.

 

సూర్య, కుజ గ్రహాలు

 • గవర్నమెంట్ జాబ్స్, సైనికులు, పోలీస్ డిపార్ట్మెంట్, వ్యవసాయం, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్.
 • ఈ గ్రహాలకు 10వ స్థానంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అవుతారు.
 • ఈ సూర్య, కుజ గ్రహాలు బలహీనంగా ఉంటె ఎంత మంచి ఉద్యోగ్యంలో ఉన్న సరే చెడు లక్షణాలు ఉంటాయి. మూర్ఖుడు, క్రూరమైన పనులు చేస్తారు

 

సూర్య, బుధ గ్రహాలు

 • ఉపాధ్యాయులు, అత్యుత్తమఆధాత్మిక బోధకులు, గణిత శాస్త్రవేత్తలు, కాలమిస్టులు, విదేశి రాయబారులు –  Foreign Ambassadors
 • ఈ కలయిక బుధాదిత్య యోగం. ఈ గ్రహాలకు 1, 5, 9 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే బుధాదిత్య యోగనికి సంబంధించిన ఫలితాలు ఉంటాయి.

 

సూర్య, గురు గ్రహాలు

 • దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, మత బోధకులు
 • ఈ గ్రహాలు బలంగా ఉంటె మంచి రాజయోగం ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

 

సూర్య, శుక్ర  గ్రహాలు

 • సంగీతం, నాట్యం, సినిమా రంగం, అలాగే ఆయుధాలకు సంబంధించిన వృత్తిలో ఉంటారు. చాల మంది ఆడవాళ్లు స్థాపించే సంస్థలలో పని చేస్తారు.

 

సూర్య, శని గ్రహాలు

 • ఇంజనీరింగ్ పనులు, మద్యం, వైన్ తయారు చేసే వృత్తి. రోజు వారి కూలి పనులు.
 • అలాగే ఈ గ్రహాలు బలంగా ఉండి 1, 10 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె రాజకీయంలో రాణిస్తారు.

 

 సూర్య, రాహు గ్రహాలు

 • లాయర్స్, వైద్య రంగం, ఆయుర్వేదం, రాజకీయ రంగం

 

సూర్య, కేతు  గ్రహాలు

 • వైద్య రంగం, గవర్నమెంట్, ఆధ్యాత్మిక సంస్థలలో పని చేయడం, నమ్మకంతో మోసం చేయడం, క్షుద్ర పూజలు (జ్యోతిష్య వృత్తిలో లేదా ఆధ్యాత్మిక సంస్థలలో ఉండే వారు పరిహారాల పేరుతో మాయమాటలు చెప్పి ధన సంపాదన చేస్తారు)
 • సూర్య, కేతు గ్రహాలు బలంగా ఉండి, గురు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వైద్య రంగంలో మంచి గుర్తింపు వస్తుంది.

 

చంద్ర, కుజ గ్రహాలు

 • రసాయన శాస్త్రవేత్తలు, ఇంజనీర్స్, సైనికుకుడు, తోలు పరిశ్రమలలో పని చేయడం

 

చంద్ర, బుధ గ్రహాలు

 • మద్యం, వైన్ వ్యాపారం, ద్రవ సంబంధ వ్యాపారాలు. రవాణాదారులు, షిప్పింగ్ ఏజెంట్లు, కవులు
 • చంద్ర, బుధ గ్రహాలు బలంగా ఉంటె తెలివైనవారు, ధన సంపాదన బాగుంటుంది, అలాగే సంతోషంగా ఉంటారు.
 • ఒకవేళ ఈ గ్రహాలు బలహీనంగా ఉండి అలాగే రాహు గ్రహముతో సిగ్నిఫీకేషన్స్ కూడా ఉండి, 8వ స్థానముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మంద బుద్ది, పిచ్చిగా ప్రవర్తిస్తారు. 

 

చంద్ర, గురు గ్రహాలు

 • పూజారులు, ఆధ్యాత్మిక సంబంధిత ఉద్యోగాలు, మీడియా, ప్రకటనలు,  ఫైనాన్షియర్లు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సంస్థలను స్థాపించడం, విద్యా సంస్థలు

 

చంద్ర, శుక్ర గ్రహాలు

హోటల్ మేనేజ్మెంట్, ఫార్మసీ & డ్రగ్స్ తయారీ సంస్థలలో పని చేయడం, ఆరోగ్య సంస్థలలో పని చేయడం, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ 

 

చంద్ర, శని గ్రహాలు

 • ఉపాధ్యాయులు, పురావస్తు శాస్త్రవేత్తలు, కోళ్ల పెంపకం, గుర్రపు పందేలు (Horse racing), అధాత్మిమిక సంస్థలు, సన్యాసులు

 

చంద్ర, రాహు గ్రహాలు

 • మనస్తత్వవేత్తలు, వ్యాధిని తెలిపే శాస్త్రం (pathology), పరిశోధన సంస్థలలో పని చేయడం.

 

చంద్ర, కేతు గ్రహాలు

 • మానసిక వైద్యుడు (Psychiatrist),
 • భౌతికశాస్త్రం, రసాయన సంస్థలలో పనిచేయడము.

 

కుజ, బుధ గ్రహాలు

 • బంగారం & ఇనుము, షేర్స్ కొనడం, అమ్మడం,
 • జర్నలిస్ట్స్, జంతు ప్రదర్శన శాలలో పని చేయడం, వ్యాఖ్యాతలు, ట్రావెలింగ్ వ్యాపారం, డ్రైవింగ్ వృత్తి. 

 

కుజ, గురు గ్రహాలు

 • లాయర్స్, వాస్తు పండితులు & బిల్డింగ్ ప్లాన్స్ ఇచ్చే వృత్తి, సివిల్ ఇంజినీర్స్, రచయితలు, పత్రిక రంగం, చారిటీస్ నడపడం & సామాజిక సేవ

 

కుజ, శుక్ర  గ్రహాలు

 • ఆహార ఉత్పత్తి రంగాలలో స్థిరపడుతారు, నగలు & ఫాన్సీ దుకాణాలు, బ్యూటీ పార్లర్స్, ఫ్యాషన్ డిజాయినర్స్

 

కుజ, శని గ్రహాలు

 • ఇంజినీర్స్, ఆధ్యాత్మిక సంస్థలలో తప్పుడు పనులు చేస్తూ ధన సంపాదన చేసారు,
 • సీక్రెట్ ఏజెంట్స్ & CBI సంస్థలలో పని చేయడం, లిక్కర్, వైన్ తయారీ కేంద్రాలలో పని చేయడం,
 • పొగాకు ఉత్పత్తి సంస్థలలో పని చేయడం.
 • కుజ, శని గ్రహాలు బలంగా ఉండి 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె భూ సంబంధ వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి.

 

కుజ, రాహు గ్రహాలు

 • ట్రావెలింగ్ వ్యాపారం, ఆధ్యాత్మిక సంస్థలలో పని చేయడం

 

కుజ, కేతు గ్రహాలు

 • డాన్స్, సైనికులు, మ్యూజియం వర్క్స్, అడ్వెంచర్స్ చేసే జాబ్స్

 

బుధ, గురు గ్రహాలు

 • కమ్యూనికేటర్లు, చరిత్రకారులు, జీవిత చరిత్ర రచయితలు, పుస్తకాలు & సంపాదకులు,
 • అకౌంట్స్, జ్యోతిష్యం, బ్యాంకులో పని  చేయడం, జడ్జిస్

 

బుధ, శుక్ర గ్రహాలు

 • రచయితలు, ఇంటీరియర్ డెకరేషన్స్,
 • బ్యూటీ పార్లర్స్, ఫొటోగ్రాపర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సినిమా రంగం

 

బుధ, రాహు గ్రహాలు

 • మెకానిక్స్, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, టైపిస్ట్స్, ఈవెంట్ మనజిర్స్, పుస్తక రంగం

 

బుధ, కేతు గ్రహాలు

 • ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్, కంప్యూటర్, పరిశోధకులు

 

గురు, శుక్ర గ్రహాలు

 • న్యాయవాదులు, నిర్వహణ కన్సల్టెంట్లు, సినిమా రంగం
 • సంగీతం, వేదా పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి, చిత్రకారులు
 • తెలివితేటలతో ధన సంపాదన ఉంటుంది.

 

గురు, శని గ్రహాలు

 • న్యాయవాదులు, జడ్జి, కన్సల్టెంట్లు, తత్వవేత్తలు

 

గురు, రాహు గ్రహాలు

 • మేనేజర్స్, ఏజెన్సీస్, రాజకీయ నాయకులు

 

గురు, కేతు గ్రహాలు

 • టెక్నికల్ టీచర్స్, డాక్టర్స్, ఆధాత్మిక సంబంధ వృత్తి

 

శుక్ర, శని గ్రహాలు

 • వడ్రంగి పని (carpenter work) రసాయన సంబంధ వృత్తి
 • వ్యవసాయం, గనుల తవ్వకం, గనుల పరిశ్రమ, తోటపని, నర్సరీలు, ఫాషన్ డిజైనర్స్

 

శుక్ర, రాహు గ్రహాలు

 • కళాకారులు, జూదం,  క్లబులలో పని చేయడం, శిల్పకారులు, మోడల్స్
 • వ్యాఖ్యాతలు (anchors) , నృత్యకారులు,  TV రంగం

 

 శుక్ర, కేతు గ్రహాలు

 • వాయిద్య పారికరాలు చేయడం
 • కంప్యూటర్స్, జ్యువలరీ పని చేయడం

 

 ఇంజనీరింగ్ & సైన్స్ సంబంధిత వృత్తులు

 

మెకానికల్ ఇంజనీరింగ్ – Mechanical Engineering

 • కుజ గ్రహానికి తప్పనిసరిగా సూర్య, శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండాలి.

 

కెమికల్ ఇంజనీరింగ్ – Chemical Engineering

 • చంద్ర, కుజ, మరియు శని గ్రహాలకు ఒకరికొకరికి సిగ్నిఫీకేషన్స్ ఉండాలి.

 

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & ఎలక్ట్రానిక్స్

 • బుధ గ్రహానికి సూర్య, శని లేదా కుజ గ్రహముతో తప్పనిసరిగా సిగ్నిఫీకేషన్స్ ఉండాలి.

 

కంప్యూటర్ & సాఫ్ట్ వెర్ ఇంజనీరింగ్ 

 • బుధ మరియు సూర్య గ్రహాలకు కుజ లేదా శని గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండాలి.

 

 భౌతికశాస్త్రం – Physics

 • సూర్య గ్రహానికి  శని మరియు బుధ గ్రహాల కాంబినేషన్ ఉండాలి.

 

జీవశాస్త్రం – Biology

 • గురు, బుధ గ్రహాలకు తప్పనిసరిగా రాహు / కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండాలి.

 

వృక్షశాస్త్రం – Botany

 • గురు & కేతు గ్రహాలకు తప్పనిసరిగా శుక్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉండాలి

 

జంతు శాస్త్రం – Zoology

 • గురు గ్రహం తో తప్పనిసరిగా శుక్ర మారియు రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండాలి

 

రసాయన శాస్త్రం – Chemistry

 • చంద్ర, కుజ గ్రహాలతో తప్పనిసరిగా శని గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉండాలి

 

మైక్రో-బయాలజీ – Micro-Biology

 • చంద్ర, గురు మరియు కేతు గ్రహాలకు ఒకరికొకరికి సిగ్నిఫీకేషన్స్ ఉండాలి.
 • ఈ సిగ్నిఫీకేషన్స్ రాశి చక్రం మరియు నవాంశలో చూడాలి

గ్రహాలు – వృత్తి, ఉద్యోగాలు లింక్ –https://nsteluguastrology.com/planets-professions/

తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ లింక్ – https://www.youtube.com/nsteluguastrology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share:
error: Content is protected !!