శుక్ర మహాదశలో – భుక్తి ఫలితాలు

శుక్ర మహాదశలో – భుక్తి ఫలితాలు

శుక్ర మహాదశ – 20 సంవత్సరాలు

శుక్ర మహాదశ / శుక్ర భుక్తి – 3 సంవత్సరాల 4 నెలలు

 1. శుక్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్ఛస్థానం మీనరాశిలో ప్రతేకించి రేవతి నక్షత్రంలో స్థితి అయి, 2,11 స్థానాలు /స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సంతానం ఉంటుంది. శుభ కార్యాలు జరుగుతాయి. మంచి గుర్తింపు వస్తుంది. ధన సంపాదనలో మంచి పురోగతి ఉంటుంది. ఉన్నత విద్యలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్ర భుక్తిలో శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి.
 2. శుక్ర గ్రహం ఏ స్థానములో స్థితి అయిన – శుక్ర భుక్తి లో శని / గురు గ్రహాల గోచరం శుక్ర గ్రహాన్ని చుసిన లేదా శుక్ర గ్రహం ఉన్న రాశిలోకి ప్రవేశించిన – జాతకుడికి/జాతకురాలికి ప్రతి విషయంలో మంచి ఫలితాలు. వివాహం కూడా జరుగుతుంది. అలాగే శుక్ర గ్రహానికి శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. శుక్ర గ్రహానికి 3,6,10,11 స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సంతోషంగా ఉంటారు. కుటుంబంలో పండగలాంటి వాతావరణము ఉంటుంది. స్థిరాస్థులను కూడబెట్టుకుంటారు. అలాగే కుటుంబలో వివాహం కూడా జరుగుతుంది.
 4. శుక్ర గ్రహానికి 6,8,12 స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, కుజ, శని, సూర్య రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అనారోగ్య సమస్యలు ఉంటాయి. 5, 11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలకు చికిత్స విజయవంతమైంది. ఒకవేళ 5,11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ లేకపోతే జబ్బు యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే అదనంగా మారక మరియు భాదాక స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మరణం కూడా ఉంటుంది.

శుక్ర మహాదశ / సూర్య భుక్తి – 1 సంవత్సరం

 1. సూర్య గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం మేషరాశిలో 18 డీగ్రీలలోపు స్థితి అయి, 11వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉండి, శుభ గ్రహాలతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృత్తి, ఉదోగ్య వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. బంధువులతో మరియు కుటుంబ సభ్యలతో మంచి సఖ్యత ఉంటుంది. సంతానం కూడా ఉంటుంది. ఆస్తులను కొంటారు అలాగే ఇల్లు కూడా కట్టుకుంటారు.
 2. శుక్ర, సూర్య గ్రహాలు ఏదైనా ఒక రాశిలో స్థితి అయితే గవర్నమెంట్ కు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కానీ స్థిరాస్తుల విషయములో గొడవలు అలాగే కోర్ట్ కేసులు కూడా ఉంటాయి.
 3. సూర్య గ్రహానికి 6,8,12 స్థానాలతో పాటు 10వ స్థానము / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వైద్య వృత్తిలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మెడిసిన్ కూడా చదువుతారు. అలాగే గురు, కేతు గ్రహాలతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఈ రూల్ 100% కరెక్ట్.
 4. సూర్య గ్రహానికి 2,6,10 స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, చంద్ర, శని గ్రహాలతో కూడా తప్పనిసరిగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె గవర్నమెంట్ విషయాలలో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. అలాగే శుక్ర గ్రాహం స్వంత నక్షత్రాలలో స్థితి అయితే ఇంకా మంచిది. ఈ రూల్ 100%.
 5. సూర్య గ్రహానికి 2,6,10 స్థానాలు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 5, 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు వచ్చిన సరైన చికిత్స తో నయం అవుతుంది. ఒకవేళ 5,11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ లేకపోతే – ఈ సూర్య భుక్తిలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె గుండె మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సర్జరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శుక్ర మహాదశ / చంద్ర భుక్తి – 1 సంవత్సరం 8 నెలలు

 1. చంద్ర గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, 11వ స్థానం/ స్థానాధిపతితో పాటు శుభ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో ఉండేవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తీర్థ యాత్రలు చేస్తారు. చంద్ర భుక్తిలో మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది.
 2. మహాదశ అధిపతి శుక్ర గ్రహం నుండి చంద్ర గ్రహానికి 3,11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మొత్తానికి చంద్ర భుక్తిలో ప్రతి విషయంలో ఫలితాలు బాగుంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
 3. చంద్ర గ్రహం సూర్య గ్రహానికి 50 డీగ్రీలలోపు స్థితి అయి, 6,8,12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఒక్కసారిగా ధన సంపాదన తగ్గిపోతుంది. ఆర్థికంగా నష్టాలు ఉంటాయి. అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే చంద్ర గ్రహం బలహీనంగా ఉండి, రాహు మరియు 3, 5 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఏమి జరుగుతుందో ఏమో అనే భయం ఉంటుంది అలాగే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే బుధ గ్రహంతో కూడా బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఈ చంద్ర భుక్తిలో కోర్ట్ కేసులు కూడా ఉంటాయి.

శుక్ర మహాదశ / కుజ భుక్తి – 1 సంవత్సరం 2 నెలలు

 1. కుజ గ్రహం – మూల త్రికోణ డిగ్రీలలో లేదా కేంద్ర, కోణ స్థానాలలో లేదా ఉచ్చ స్థానం మకర రాశిలో స్థితి అయి, 2, 11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ప్రతి ఫలితాలు చాల బాగుంటాయని ఖచ్చితంగా చెప్పగలను. కేంద్ర, కోణ స్థానాలలో ప్రత్యేకించి 1,9,10 స్థానాధిపతులు రాశి చక్రంలో బలంగా ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 2. కుజ గ్రహనికి 4, 10 స్థానాలు / స్థానాధిపతులతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే శుక్ర గ్రహంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఆస్తులను కూడా బెట్టుకుంటారు, అలాగే వారసత్వపు ఆస్తులలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శని, బుధ గ్రహాలతో కుజ గ్రహానికి బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె రియల్ ఎస్టేట్ వ్యాపారం చాల బాగుంటుంది.
 3. కుజ గ్రహనికి 6,8,12 స్థానాలు / స్థానాధిపతులతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే శుక్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కుజ భుక్తిలో రక్త సంబంధిత వ్యాధులు ఖచ్చితంగా వస్తాయి. కావున కుజ భుక్తిలో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
 4. కుజ గ్రహనికి 6,8,12 స్థానాలు / స్థానాధిపతులతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి, రాహు, శని మరియు సూర్య గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మానసిక సమస్యలు, అలాగే శారీరక సమస్యలు ( సెక్స్ విషయంలో కోరిక లేకపోకడము – physical distress). అలాగే మారక, భాదాక స్థానాలు/స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే మారక, భాదాక స్థానాధిపతులు బలహీనంగా ఉంటె మరణం కూడా ఉంటుంది లేదా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

శుక్ర మహాదశ / రాహు భుక్తి – 3 సంవత్సరాలు

 1. రాహు గ్రహం ఏ స్థానంలో స్థితి అయితే ఆ స్థానాధిపతితో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉండి, 5, 9 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉన్న లేదా యోగ కారక గ్రహంతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటే – వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఫలితాలు బాగుంటాయి. అలాగే ఆస్తుల విషయములో కూడా ఫలితాలు బాగుంటాయి. అలాగే ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. అలాగే 11వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఈ రాహు భుక్తిలో ఫలితాలు ఇంకా బాగుంటాయి. అంటే జాతకుడికి రాజయోగం ఉంటుందని చెప్పవచ్చు.
 2. రాహు గ్రహానికి – ఉపచయ ( 3,6,10,11) స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – శత్రువులు మిత్రులు అవుతారు. బందువులతో సఖ్యత బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు ఆశించినతగా లేకపోయినా ఈ రాహు భుక్తిలో మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది.
 3. మహాదశ అధిపతి శుక్ర గ్రహం నుండి లేదా లగ్నం నుండి రాహు గ్రహానికి 8, 12 స్థానాలు / స్థానాధిపతులతో కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. కానీ శత్రువుల వలన నష్టాలు జరిగే అవకాశం ఉంది.
 4. అలాగే మహాదశ అధిపతి శుక్ర గ్రహం నుండి లేదా లగ్నం నుండి రాహు గ్రహానికి 8, 12 స్థానాలు / స్థానాధిపతులతో పాటు 2, 7 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే శుక్ర గ్రహం నుండి మరియు లగ్నం నుండి అంటే రెండిటినుండి సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యల వలన ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share: