ఇక్కడ జనవరి 1, 2025 –
- రాశి చక్రం ఇవ్వడం జరిగింది గమనించగలరు. ఈ రాశి చక్రంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకుని వార్షిక (సంవత్సర )ఫలితాలు చెప్పడం జరుగుతుంది
మన వ్యక్తిగత రాశి చక్రములో
- శని, మరియు గురు గ్రహాల యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని జాతకుడు / జాతకురాలి వార్షిక పలితాలు చెప్పడము జరుగుతుంది.
- ఈ రెండు గ్రహాలను దృష్టిలో ఉంచుకుని 12 రాశుల వారికి కేవలము వారి యొక్క లగ్నాన్ని మరియు లగ్నాధిపతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చెప్పడము జరుగుతుంది.
సంఖ్యా శాస్త్ర ప్రకారం
- మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెల ప్రకారం, అనగా సౌర మాసం ప్రకారం ( Solar Month ) ఇవ్వడం జరిగింది.
- ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది. అలాగే వ్యాపారములో లాభ నష్టాల గురించి, అలాగే 2023 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుందా లేదా అని చెప్పడము జరుగుతుంది
2025 సంవత్సరంలో –
ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది? అలాగే కుటుంబం, ఆరోగ్యం ఎలా ఉంటుంది?
అలాగే ఏ రాశి వారికీ ఏ జ్యోతిష్య పరిహారాలు పని చేస్తాయి ?
శని గ్రహ గోచారం
- ప్రస్తుతము జనవరి 1 రోజున కుంభ రాశిలో 20:24:40 డిగ్రీలలో ఉన్నాడు.
- మీ యొక్క లగ్నం నుండి కుంభరాశి ఏ భావము అవుతుంది. ఆ భావము ఎలాంటి పలితాలను తెలియజేస్తుంది, అనే విషయాల గురించి తెలుసుకుందాం
గురు గ్రహ గోచారం
- అలాగే ప్రస్తుతము గురు గ్రహ గోచరం వృషభ రాశిలో 19:05:44 డిగ్రీలలో ఉన్నాడు.
- కావున వృషభ రాశి నుండి పరిగణలోకి తీసుకోవాలి.
మరొక ప్రధానమైన విషయం
- గురు, శని గ్రహాల గోచారంతో పాటు రాహు, కేతు గ్రహాల గోచార స్థితులను పరిగణలోకి తీసుకుని ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది.
- జనవరి 1, 2025 రోజున రాహు గ్రహ గోచరం మీనరాశిలో 07:22:46 డిగ్రీలలో ఉంది. అలాగే కేతు గ్రహం కన్యారాశిలో 07:22:46 డిగ్రీలలో ఉంది.
గమనిక :
- ద్వాదశ రాశుల వారికి ఈ వార్షిక ఫలితాలు లగ్నం నుండి పరిగణలోకి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వివరించబోతున్న ఈ ఫలితాలు చంద్ర రాశి నుండి కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. మొదటి ప్రాముఖ్యత లగ్నానికి ఇవ్వాలి.
- మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులను పరిగణలోకి తీసుకోవాలి.
- కావున మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రంలో ప్రస్తుతం జరుగుతున్న మహాదశ / భుక్తి / అంతర అధిపతులకు ఇక్కడ ఇవ్వబడిన స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే – ఇక్కడ ద్వాదశ రాశులకు ఇవ్వబడిన ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి.
- ధన సంపాదన– 2, 5,10, 11 స్థానాలు
- ధన నష్టాలు – 6, 8, 12 స్థానాలు
- కుటుంబం – 2, 5, 7, 11 స్థానాలు
- ఆరోగ్యం – 1, 5, 11 స్థానాలు
- అనారోగ్యం – 6, 8, 12 స్థానాలు
ప్రధానమైన విషయం –
జాతకుడు / జాతకురాలి యొక్క వృత్తి ఏదైనా సరే, అనగా ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రయివేట్ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నా సరే, ప్రతి ఒకరికి ఈ 2025 సంవత్సరంలో ధన సంపాదన ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే కుటుంబం, ఆరోగ్యం మరియు పరిహారాల గురించి చెప్పడం జరుగుతుంది.
12 రాశులు
- మేష లగ్నం / రాశి – https://nsteluguastrology.com/aies-sign-2025/
- వృషభ రాశి / లగ్నం – https://nsteluguastrology.com/taurus-sign-2025/