మేష రాశి / లగ్నం – అధిపతి కుజ గ్రహం
- శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలో 20:24:40 డిగ్రీలలో ఉన్నాడు. మేషరాశి నుండి కుంభ రాశి 11వ స్థానము అవుతుంది
- గురు గోచరము – జనవరి 1 రోజున వృషభ రాశిలో 19:0544 డిగ్రీలలో ఉన్నాడు. మేష రాశి నుండి వృషభ రాశి 2వ స్థానం అవుతుంది.
- రాహు గోచరము – జనవరి 1 రోజున మీనా రాశిలో 07:32:46 డిగ్రీలలో ఉన్నాడు. మేషరాశి నుండి మీనా రాశి 12వ స్థానము అవుతుంది
- కేతు గోచరము – జనవరి 1 రోజున కన్యా రాశిలో 07:32:46 డిగ్రీలలో ఉన్నాడు. మేష రాశి నుండి కన్యా రాశి 6వ స్థానం అవుతుంది.
ధన సంపాదన :
మేష రాశి గురు, శని గ్రహాల గోచార ప్రభావంలో ఉంది. కావున సహజంగా 2025 సంవత్సరంలో ఈ రాశి /లగ్నం వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెడుతారు. అలాగే ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవవుతాయి.
ప్రభుత్వ ఉద్యోగస్తులకు దన సంపాదన పెరుగుతుంది. అలాగే స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టె అవకాశాలు ఉంటాయి.
సాఫ్ట్వేర్ వ్యాపారాలు, వైద్య సంబంధిత వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది.
- మేష రాశికి అధిపతి అయిన కుజ గ్రహం ఏ స్థానములో స్థితి అయిన సరే 11వ స్థానము కుంభరాశితో లేదా అధిపతి శని గ్రహంతో బలంగా సిగ్నిఫికేసన్స్ ఉంటె వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే వ్యాపారము చేస్తున్నవారికి అదృష్టాలు వరిస్తాయి.
- అలాగే కుజ గ్రహం స్వంత నక్షత్రాలలో స్థితి అయిన లేదా శని, గురు గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్టితి అయి 11వ స్థానము కుంభరాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- అలాగే ప్రస్తుతం వీరికి కుజ భుక్తి నడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి.
- మీ వ్యక్తిగత రాశి చక్రంలో గురు, శని గ్రహాల గోచార దృష్టి కుజ గ్రహం మీద లేకుంటే ఈ ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ కుజ గ్రహం మీద దృష్టి ఉంటే ఈ ఫలితాలు ఇంకా చాలా బాగుంటాయి, అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.
కుటుంబం :
- గురు, శని గ్రహాల గోచారం పరిగణలోకి తీసుకుంటే ఈ 2025 సంవత్సరంలో శుభ వ్రతాలూ వింటారు. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి.
- కొడుకులు / కూతుళ్లు వలన కుటుంబానికి మంచి పేరు వస్తుంది.
- గురు, శని గ్రహాల గోచారం కుజ, శుక్ర గ్రహాలతో సంబందం ఉంటె, కోర్టు కేసుల విషయంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచారం 5వ స్థానాధిపతి సూర్య గ్రహంతో సంబంధం ఉంటె, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ఈ గ్రహాల మీద రాహు, కేతు గ్రహాల గోచార ప్రభావం ఉంటె, ఈ ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. వీరు కింద ఇవ్వబడిన పరిహారాలను పాటిస్తే ప్రతికూలత తగ్గుతుంది.
ఆరోగ్యం :
- మీన రాశిలో రాహు గ్రహ గోచార స్థితి మరియు కన్య రాశిలో కేతు గ్రహ గోచార స్థితి ప్రభావం వలన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలను ఇచ్చే అవకాశాలు. ఉన్నాయి. కావున ఆరోగ్యం విషయంలో కింద ఇవ్వబడిన పరిహారాలను పాటిచండం వలన కాస్త ఉపశమనం ఉంటుందని చెప్పవచ్చు.
- మేష రాశి తల, మెదడు విషయాలకు కారకత్వం వహిస్తుంది. కావున సూర్య గ్రహానికి కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మైగ్రేన్, మెదడు సంబందిత సమస్యలు బాధిస్తాయి. అలాగే కుజ గ్రహానికి 1, 8 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె తలకు సంబందించిన సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి.
- ఆస్తమా మరియు ఉపిరిత్తితుల సమస్యలు ఉన్నవారు ఈ 2025 సంవత్సరంలో కాస్త జాగ్రతగా ఉండాలి. వీరికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ సమస్యను మరింత తీవ్రత చేసాడు. కావున వీరికి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
సంఖ్యా శాస్త్ర ప్రకారం
- సంఖ్యా శాస్త్ర ప్రకారం మార్చి 21 నుండి ఏప్రిల్ 20 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.
- పుట్టిన రోజు లోని సంఖ్యలను కూడగా మొత్తం సంఖ్యా 9వ నెంబర్ వస్తే, పైన ఇవ్వబడిన ఫలితాలు బాగుంటాయని చెప్పవచ్చు.
పరిహారాలు :
- ప్రతి మంగళవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. ప్రతి రోజు శ్రీ అంగారక గాయత్రి మంత్రం 108 సార్లు జపించాలి.
- మేష రాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి
శ్రీ అంగారక గాయత్రి మంత్రం –
- ఓం వీరధ్వజాయ విద్మహే
విఘ్నహస్తాయ ధీమహీ
తన్నో భౌమ ప్రచోదయాత్
అశ్విని గాయత్రి మంత్రం –
- ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్
భరణి గాయత్రి మంత్రం –
- ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి: ప్రచోదయాత్
కృత్తిక గాయత్రి మంత్రం –
- ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్