మిథున రాశి / లగ్నం – 2025

మిథున రాశి / లగ్నం – అధిపతి బుధ గ్రహం

  • శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలో 20:24:40 డిగ్రీలలో ఉన్నాడు. మిథున రాశి నుండి కుంభ రాశి 9వ స్థానము అవుతుంది
  • గురు గోచరము – జనవరి 1 రోజున వృషభ రాశిలో 19:0544 డిగ్రీలలో ఉన్నాడు.  మిథున రాశి  నుండి వృషభ రాశి 12వ స్థానం అవుతుంది.
  • రాహు గోచరము – జనవరి 1 రోజున మీనా రాశిలో 07:32:46 డిగ్రీలలో ఉన్నాడు. మిథున రాశి నుండి మీనా రాశి 10వ స్థానము అవుతుంది
  • కేతు గోచరము – జనవరి 1 రోజున కన్యా రాశిలో 07:32:46 డిగ్రీలలో ఉన్నాడు.  మిథున రాశి నుండి కన్యా రాశి 4వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

మిథున రాశి గురు, శని గ్రహల గోచార ప్రభావంలో ఉంది. కావున 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. అలాగే ధన సంపాదనతో పాటు అదృష్టాలు కూడా ఉంటాయి.

ఈ సంవత్సరంలో వీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతం అవుతుంది. ప్రత్యేకించి ఆధ్యాత్మిక సంబంధిత వ్యాపారాలు మరియు ఆహార సంబంధ వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది. ఈ 2025వ సంవత్సరం అదృష్టాలను ఇచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు.

షేర్ మార్కెట్ వ్యాపారాలు చేసేవారు ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటే నష్టాలను అధిగమించవచ్చు

  • మిథున లగ్నానికి అధిపతి బుధ గ్రహం – ఈ బుధ గ్రహం లగ్నంలో లేదా 4వ స్థానం కన్య రాశిలో లేదా 5వ స్థానం తుల రాశిలో లేదా  9వ స్థానం  కుంభరాశిలో లేదా 10వ స్థానం మీనా రాశిలో స్థితి అయి, అదనంగా గురు గ్రహంతో సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి. ప్రత్యేకించి వ్యాపారం చేస్తున్న వారికి ధన సంపాదన బాగుంటుంది. ఈ గ్రహాలకు 6 మరియు 8 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ ఫలితాలు అనుకూలంగా ఉండవు.
  • అలాగే ఈ బుధ గ్రహం 2వ స్థానం కర్కాటక రాశిలో తన స్వంత నక్షత్రం ఆశ్లేష నక్షత్రములో లేదా 6వ స్థానం వృచ్చిక రాశిలో తన స్వంత నక్షత్రం జేష్ట నక్షత్రములో లేదా 10వ స్థానం మీన రాశిలో తన స్వంత నక్షత్రం రేవతి నక్షత్రములో స్థితి అయి, 6వ స్థానం వృచ్చిక రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి. ఈ గ్రహాలకు 6 మరియు 8 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ ఫలితాలు అనుకూలంగా ఉండవు.
  • అలాగే ప్రస్తుతము వీరికి బుధ భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
  • మీ వ్యక్తిగత రాశి చక్రంలో గురు, శని గ్రహాల గోచార దృష్టి బుధ గ్రహం మీద లేకుంటే ఈ ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ దృష్టి ఉంటే ఈ ఫలితాలు ఇంకా చాలా బాగుంటాయి, అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.

కుటుంబం :

  • మిథున రాశికి 4వ స్థానం కన్య రాశిలో కేతు గ్రహ గోచార స్థితి ప్రభావం ప్రేమ వివాహం చేసుకున్న వారి మధ్య అన్యోన్యత ఉండదు. విడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే విడాకుల కోసం కోర్ట్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు గ్రహ గోచార స్థితిని పరిగణలోకి తీసుకుంటే వృషభ రాశి నుండి 2వ స్థానం మిథున రాశి అవడం చేత, తీవ్రత కాస్త తగ్గుతుంది.
  • కేతు గ్రహ గోచార ప్రభావం వలన గర్భంతో ఉన్నవారు కూడా జాగ్రతగా ఉండాలి.
  • ఒకవేళ మీ వ్యక్తిగత రాశి చక్రంలో బుధ గ్రహం కేతు గ్రహ గోచార ప్రభావంలో ఉంటె అబార్షన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున గర్భంతో ఉన్నవారు జాగ్రతగా ఉండాలి. అలాగే 8వ స్థానాధిపతితో బుధ గ్రహ సంబంధం ఉంటె ఖచ్చితంగా అబార్షన్స్ అవుతుందని చెప్పవచ్చు

ఆరోగ్యం :

  • రాహు గ్రహ మరియు శని గ్రహ గోచార ప్రభావం వలన అనారోగ్య సమస్యలు మరియు ప్రమాదాలను ఇస్తుంది. ఈ 2025 సంవత్సరంలో రక్త హీనత మరియు మూత్రపిండ సమస్యలు ఉన్నవారు జాగ్రతగా ఉండాలి.
  • మిథున రాశి భుజాలు, చేతులు, చేతి వేళ్ళు సూచిస్తుంది. అలాగే బుధ గ్రహం ప్రధానంగా నరాల సమస్యలు, చర్మం, మరియు పిచ్చి విషయాలకు కారకత్వం వహిస్తాడు.
  • గురు, శని గ్రహాల గోచార ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే సహజంగా ఉండే బుజాల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.
  • రాహు, కేతు గ్రహాల ప్రభావంలో బుధ గ్రహం ఉంటె, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాగే 12వ స్థానంతో కూడా ఉంటె చికిత్స కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
  • అలాగే రాహు, కేతు గ్రహాల ప్రభావంలో బుధ, శుక్ర గ్రహాలు మరియు 8వ స్థానాధిపతి ఉంటె, మూత్రపిండ సమస్యలు ఇబ్బంది పెడతాయి

సంఖ్యా శాస్త్ర ప్రకారం

  • సంఖ్యా శాస్త్ర ప్రకారం మే 21 నుండి జూన్ 21 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.
  • పుట్టిన రోజు లోని సంఖ్యలను కూడగా మొత్తం సంఖ్యా 5వ నెంబర్ వస్తే, పైన ఇవ్వబడిన ఫలితాలు బాగుంటాయని చెప్పవచ్చు.

పరిహారాలు :

  • ప్రతి బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శ్రీ వేంకటేశ్వర గాయత్రి మంత్రం జపించాలి.
  • మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి.

శ్రీ వేంకటేశ్వర గాయత్రి –

  • ఓం నిరంజనాయ విద్మహే
    నిరాధారాయ ధీమహి,
    తన్నోవేంకట ప్రచోదయాత్.

మృగశిర గాయత్రి మంత్రం –

  • ఓం శశిశేఖరాయ విద్మహే
    మహారాజాయ ధిమహి
    తన్నో మృగశిర: ప్రచోదయాత్

ఆరుద్ర గాయత్రి మంత్రం –

  • ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
    పశుం తనాయ ధిమహి
    తన్నో ఆర్ద్రా: ప్రచోదయాత్

పునర్వసు గాయత్రి మంత్రం –

  • ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
    అదితి పుత్రాయ ధిమహి
    తన్నో పునర్వసు ప్రచోదయాత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *