వృషభ రాశి / లగ్నం – 2025

వృషభ రాశి / లగ్నం – అధిపతి కుజ గ్రహం

  • శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలో 20:24:40 డిగ్రీలలో ఉన్నాడు.
    వృషభ రాశి నుండి కుంభ రాశి 10వ స్థానము అవుతుంది
  • గురు గోచరము – జనవరి 1 రోజున వృషభ రాశిలో 19:0544 డిగ్రీలలో ఉన్నాడు.  వృషభ రాశి నుండి వృషభ రాశి 1వ స్థానం అవుతుంది.
  • రాహు గోచరము – జనవరి 1 రోజున మీనా రాశిలో 07:32:46 డిగ్రీలలో ఉన్నాడు. వృషభ రాశి నుండి మీనా రాశి 11వ స్థానము అవుతుంది
  • కేతు గోచరము – జనవరి 1 రోజున కన్యా రాశిలో 07:32:46 డిగ్రీలలో ఉన్నాడు.  వృషభ రాశి నుండి కన్యా రాశి 5వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

వృషభ రాశి గురు గ్రహ గోచారం 19:0544 డిగ్రీలలో ఉన్నాడు . అలాగే శని గ్రహ గోచార స్థితితో పాటు రాహు, కేతు గ్రహాల స్థితిని పరిగణలోకి తీసుకుంటే, ఆధ్యాత్మిక రంగంలో మరియు విద్యా సంస్థలలో ఉన్నవారికి ధన సంపాదన బాగుంటుంది.

చిరు వ్యాపారాలు మరియు ప్రైవేట్ ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం ఖచ్చితంగా అదృష్టాలను ఇస్తుందని చెప్పవచ్చు.

ప్రత్యేకించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేవారు మరియు జ్యుయలరీ వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రతగా ఉంటె, లాభాలు ఉంటాయని చెప్పవచ్చు.

  • వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం – 2వ స్థానం మిథున రాశిలో లేదా 6వ స్థానం తులా రాశిలో లేదా 9వ స్థానం మకర రాశిలో లేదా 10వ స్థానము కుంభ రాశిలో లేదా 11వ స్థానం మీనరాశిలో స్థితి అయితే పలితాలు బాగుంటాయి.
  • ఈ విదంగా కాకుండా మేష, సింహ మరియు ధనుస్సు రాశిలో శుక్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో అంటే 13.20 డీగ్రీల నుండి 26.40 డీగ్రీల మద్యలో శుక్ర గ్రహం స్థితి అయిన ఈ పలితాలు ఇంకా బాగుంటాయి.
  • అలాగే ప్రస్తుతము వీరికి శుక్ర భుక్తి నడిస్తే ఈ పలితాలు ఇంకా  అద్బుతంగా ఉంటాయి.
  • మీ వ్యక్తిగత రాశి చక్రంలో గురు, శని గ్రహాల గోచార దృష్టి శుక్ర గ్రహం మీద లేకుంటే ఈ ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ దృష్టి ఉంటే ఈ ఫలితాలు ఇంకా చాలా బాగుంటాయి, అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.
  • ఈ గ్రహాలకు 6 మరియు 8 స్థానాలతో సంబంధం ఉంటే, ఈ ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.

కుటుంబం :

  • గురు మరియు శని గ్రహాల గ్రహాల గోచార స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. భార్య, భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది.
  • అలాగే కోర్టు కేసుల విషయంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
  • కొడుకులు / కూతుళ్లు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
  • నూతన దంపతులు శుభ వార్తలు వింటారు.

ఆరోగ్యం :

  • రాహు, కేతు గ్రహాల ప్రభావంలో వృషభ రాశి ఉంది. కావున వీరికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే జాగ్రతగా ఉండాలి.
  • ఈ 2025 సంవత్సరంలో సర్జరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
  • సహజంగా వృషభ రాశి ముఖం, కండ్లు, చెంపలు, గొంతు విషయాలకు కారకత్వం వహిస్తుంది. కావున శుక్ర గ్రహానికి 6 మరియు 8 స్థానాల ప్రభావంలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
  • అలాగే శుక్ర గ్రహం అండాశయ సమస్యలు, అందం మరియు ముఖం మీద మచ్చలు, లైంగిక సమర్థత, నేత్ర సంబంధ సమస్యలు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
  • రాశి చక్రంలో శుక్ర, చంద్ర గ్రహాలు బలహీనంగా ఉండి, 6, 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె అండాశయ సమస్యలు ఉంటాయి.
  • అలాగే శుక్ర, కుజ గ్రహాలకు 12, 6 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె సంతాన సమస్యలు ఉంటాయి.
  • కేతు గ్రహ గోచార స్థితి వృషభ రాశి ప్రభావంలో ఉంది. కావున గర్భంతో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

  • సంఖ్యా శాస్త్ర ప్రకారం ఏప్రిల్ 21 నుండి మే 21 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.
  • పుట్టిన రోజు లోని సంఖ్యలను కూడగా మొత్తం సంఖ్యా 6వ నెంబర్ వస్తే, పైన ఇవ్వబడిన ఫలితాలు బాగుంటాయని చెప్పవచ్చు.

పరిహారాలు :

  • ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. ప్రతి రోజు శ్రీ వృషభ గాయత్రి మంత్రం జపించాలి.
  • వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి

శ్రీ వృషభ గాయత్రి –

  • ఓమ్ ధీక్ష శృంగాయ విద్మహే
    వేద హస్తాయ ధీమహి,
    తన్నో వృషభ ప్రచోదయాత్

కృత్తిక గాయత్రి మంత్రం –

  • ఓం వణ్ణిదేహాయై విద్మహే
    మహాతపాయై ధీమహి
    తన్నో కృత్తికా ప్రచోదయాత్

రోహిణి గాయత్రి మంత్రం –

  • ఓం ప్రజావిరుధ్ధై చ విద్మహే
    విశ్వరూపాయై ధీమహి
    తన్నో రోహిణి ప్రచోదయాత్

మృగశిర గాయత్రి మంత్రం –

  • ఓం శశిశేఖరాయ విద్మహే
    మహారాజాయ ధిమహి
    తన్నో మృగశిర: ప్రచోదయాత్