కవల పిల్లలు – అబ్బాయి, అమ్మాయి
18 – 03-2010, గురువారము రోజున పర్లాకిమిడిలో ఒకరు ఉదయము 09 గం.30 ని. జన్మిచిన అబ్బాయి ఉదయము 09 గం. 32 ని.జన్మిచిన అమ్మాయి పుట్టిన సమయములో కేవలము 2 నిమిషాల తేడా వున్నా ఈ కవల పిల్లల గురించి జాతక చక్రములోని గ్రహాల యెక్క స్థితి గతులను బట్టి KP పద్దతిలో ఉన్నత విద్యా గురించి తెలుసుకుందాము
ఇక్కడ అబ్బాయి మరియు అమ్మాయి రాశి చక్రాలు, గ్రహాలు మరియు 12 స్థానాల యేక్క అధిపతి, నక్షత్రధిపతి మరియు సబ్ లోర్స్ కు సంబంధించిన పట్టికలు ఇవ్వడము జరిగింది గమనించగలరు.
అబ్బాయి రాశి చక్రం
అమ్మాయి రాశి చక్రం
ఇక్కడ పైన ఇవ్వబడిన అబ్బాయి మరియు అమ్మాయి రాశి చక్రాలను గమనిస్తే
అబ్బాయి రాశి చక్రములో – లగ్నము వృషభ రాశి, 5-5-19 డిగ్రీలలో వుంది. 12 వ స్థానము మీనా రాశి అవుతుంది.అలాగే అమ్మాయి రాశి చక్రములో – లగ్నము వృషభ రాశి, 5-36-49 డిగ్రీలలో వుంది. అలాగే 12 వ స్థానము మేష రాశి అవుతుంది.కేవలము పుట్టిన సమయములో రెండు నిమిషాల తేడా వుండేసరికి స్థానాలు మారాయి, అలాగే డిగ్రీలలో కూడా వుంది. అంటే కేవలము రెండు నిమిషాల తేడా వుండేసరికి సుబ్ లార్డ్స్ మరిపోతతాయని గమనించగలరు.
అబ్బాయి విద్యాభ్యాసము
4వ స్థానము – సాదరణ విద్యా –4, 9 స్థానాలను పరిగణలోకి తీసుకోవాలి
9వ స్థానము – ఉన్నత విద్యా – 9, 11 స్థానాలను పరిగణలోకి తీసుకోవాలి
4th Cusp Sub Lord – కుజ గ్రహాము, 3 వ స్థానములో వుంది.
ఈ కుజ గ్రహాము శని నక్షత్రములో , బుధ సుబ్ లో వుంది.
కుజ 7 వ స్థానానికి అలాగే శని 10, 11 స్థానాలకు అధిపతి.
బుధ 2, 3 మరియు 6 స్థానాలకు అధిపతి.
9th Cusp Sub Lord – సూర్య గ్రహాము, 11 వ స్థానములో వుంది.
ఈ సూర్య గ్రహాము శని నక్షత్రములో, శని సుబ్లో వుంది.
సూర్య 5 వ స్థానానికి అలాగే శని 10, 11 స్థానాలకు అధిపతి
11 వ స్థానములో చంద్ర, శుక్ర, బుధ గ్రహాలు కూడా వున్నాయి. ఈ గ్రహాలలో బుధ గ్రహము యెక్క డిగ్రీలు సూర్య గ్రహాము డిగ్రీలకు సుమారు 3 డిగ్రీల దూరములో వున్నాడు.
అమ్మాయి విద్యాభ్యాసము
4th Cusp Sub Lord – కుజ గ్రహాము, 3 వ స్థానములో వుంది
ఈ కుజ గ్రహాము శని నక్షత్రములో , బుధ సుబ్ లో వుంది.
కుజ 7, 12 స్థానాలకు అలాగే శని 10, 11 స్థానాలకు అధిపతి.
9th Cusp Sub Lord – సూర్య గ్రహాము, 11 వ స్థానములో వుంది
ఈ సూర్య గ్రహాము శని నక్షత్రములో, శని సుబ్లో వుంది.
సూర్య 5 వ స్థానానికి అలాగే శని 10, 11 స్థానాలకు అధిపతి
11 వ స్థానములో చంద్ర, శుక్ర, బుధ గ్రహాలు కూడా వున్నాయి.
అబ్బాయి బర్త్ చార్ట్‌లో శని గ్రహాము 12 వ స్థానము మీనా రాశిని అలాగే మీనా రాశిలో వున్నా చంద్ర, శుక్ర, బుధ, సూర్య గ్రహాలను చూస్తున్నాడు. అంటే 11 వ స్థానములో వున్నా గ్రహాలను అలాగే 12వ స్థానముతోటి సిగ్నిఫికేసన్స్ వున్నాయి .అలాగే మీనా రాశి లో వున్నా గ్రహాలు 60 డిగ్రీల దూరములో వున్నా 2 మరియు 3 వ స్థానాన్నిచూస్తున్నాడు. ఈ 60 డిగ్రీల దృష్టిని Western Aspect అంటారు.
అలాగే అమ్మాయి బర్త్ చార్ట్‌లో శని గ్రహాము మీనా రాశిని అలాగే మీనా రాశిలో వున్నా చంద్ర, శుక్ర, బుధ, సూర్య గ్రహాలను చూస్తున్నాడు. కానీ ఈ మీనా రాశికి ఎలాంటి స్థానము లేదు. అంటే 11 వ స్థానములో వున్నా గ్రహాలతో చాలా మంచి సిగ్నిఫికేసన్స్ వున్నాయి .అలాగే మీనా రాశి లో వున్నా గ్రహాలు 60 డిగ్రీల దూరములో వున్నా లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే లగ్నముతో మంచి సిగ్నిఫికేసన్స్ వున్నాయి.అబ్బాయికి 9 వ స్థానముతోటి – 11, 12 స్థానాలతో సిగ్నిఫికేసన్స్ వున్నప్పటికి , లగ్నముతో మంచి సిగ్నిఫికేసన్స్ లేవు.
అదే అమ్మాయి విషయానికొస్తే 9 వ స్థానముతోటి – డైరెక్ట్ గా 11వ స్థానముతో సిగ్నిఫికేసన్స్ ఉన్నాయి, అలాగే లగ్నముతో మంచి సిగ్నిఫికేసన్స్ వున్నాయి.అంటే అమ్మాయికి ఉన్నత విద్యాభ్యాసము వుంటుంది. ఎందుకంటె లగ్నముతోటి మంచి సిగ్నిఫికేసన్స్ వున్నాయి కావున. అదే అబ్బాయి విషయానికొస్తే … ఉన్నత విద్యాభ్యాసము వుంటుంది కానీ మధ్య, మధ్యలో ఆటంకాలు వస్తాయి.