వివాహ సమయము – కృష్ణ మూర్తి పద్ధతి

వివాహ సమయము – కృష్ణ మూర్తి పద్ధతి

పుట్టిన రోజు : సెప్టెంబర్ 9, 1994, మంగళవారము

సమయం    : 20:24:32

స్థలం           : జహీరాబాద్

ఈ అమ్మయికి వివాహాము ఎప్పుడు జరుగుతుంది అనే విషయము గురించి కృష్ణ మూర్తి పద్దతిలో (KP System) ఇప్పుడు వివరంగా వీశ్లేషణ పద్దతిలో తెలుసుకుందాము.

రూల్ :

1. వివాహాము: 7వ స్థానము యెక్క కక్షాధిపతి (Sub Lord) 2 లేక 7 లేక 11 స్థానాలతోటి సిగ్నిఫై అయితే వివాహాము జరుగుతుంది.

2.  ప్రేమ వివాహాము : 5 వ స్థానము యెక్క కక్షాధిపతి (Sub Lord) 7 11 స్థానాలకు చాలా బలంగా  సిగ్నిఫై అయితే ప్రేమ వివాహాము జరుగుతుంది.

KP New Ayanamsa ద్వార బర్త్ చార్ట్ వేసుకోవడము జరిగింది గమనిచగలరు.

 

KP పద్దతిలో చార్ట్ వేసుకున్న తరువాత పునర్పూ దోషము (Punarphoo Dosha) వుందా లేదా చూడాలి.

  • పునర్పూ అంటే శని గ్రహము చంద్ర గ్రహానికి చెందిన నక్షత్రములో వున్నా లేదా కక్షాధిపతితో సంబదము వున్నా లేదా
  • చంద్ర గ్రహము శని నక్షత్రములో వున్నా లేదా శని వున్నా స్థానము నుండి 3 వ స్థానములో కానీ 7 వ స్థానములో కానీ 10  వ స్థానములో కానీ చంద్ర గ్రహాము వున్నా పునర్పూ అంటారు.
  • పైన చెప్పిన విదంగా శని చంద్ర గ్రహాల మద్య పునర్పూకు సంబందించిన రేలషన్ వుంటే వివాహాము ఆలస్యము అవుతుంది లేదా వివాహాము కుదిరిన తరువాత కాన్సిల్ ఆయె అవకాశాలు ఉంటాయి.
  • రాశి చక్రములో మీన లగ్నము 27.14.48 డి(గీలలో పడింది
  • చంద్ర గ్రహము : కన్య రాశిలో 1.27.44 డి(గీలలో పడింది. రాశ్యా ధిపతి – బుధ గ్రహము, నక్ష్యత్రాదిపతి – సూర్య గ్రహము – కక్ష్యాదిపతి – గురు గ్రహము
  • శని  గ్రహము : కన్య రాశిలో 14 .56.34 డి(గీలలో పడింది. రాశ్యా ధిపతి – శనిగ్రహము, నక్ష్యత్రాదిపతి – రాహు  గ్రహము – కక్ష్యాదిపతి – కేతు  గ్రహము
  • ఈ రెండు గ్రహాలకు సంబందించిన రిలేషన్స్ చూస్తే శని చంద్ర గ్రహాలకు సిగ్నిఫికేసన్స్ లేవు. కాబట్టి ఒకవేళ మ్యారేజ్ కుదిరితే కాన్సిల్ కాదు అని చెప్పవచ్చు.

Significators Table – సిగ్నిఫికేటర్స్ పట్టిక

2 5 7 11
PCO —- చంద్ర కేతు, సూర్య, రాహు, కుజ, గురు, శని —-
Occ —- సూర్య శుక్ర, గురు, రాహు —–
PCBL —— బుధ —– —-
BL కుజ చంద్ర బుధ శని

ఇక్కడ 2,5,7,11 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ పట్టిక వేసుకోవడము జరిగింది గమనిచగలరు.  PCO లో వున్నా గ్రహాలు చాలా బలమైన గ్రహాలు.

ఇక వీశ్లేషన పద్దతిలోకి వెళ్ళితే –

  • 7 వ స్థానము యెక్క సబ్ లార్డ్ గురు గ్రహము – ఇక్కడ పట్టిక గమనిస్తే – 7 వ స్థానములో స్తితి  మరియు PCO లో కూడా వున్నాడు. మిగతా ఏ స్థానములో లేదు. కాకపోతే తుల రాశి నుండి 2 వ స్థానాన్ని చూస్తున్నాడు అలాగే 4 వ స్థానాన్ని చూస్తునాడు.
  • ఇక్కడ 2 వ స్థానము కుటుంబాన్ని అలాగే 4 వ స్థానము గృహాన్ని తెలియజేస్తుంది కాబాట్టి మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. 11 వ స్థానముతోటి సిగ్నిఫై అయితే ఇంకా బాగుటుంది.
  • 7 వ స్థానము యొక్క స్టార్ లార్డ్ కుజ గ్రహాము – ఇక్కడ పట్టిక గమనిస్తే – 7 వ స్థానములో PCO లో వుంది. అలాగే 2 వ స్థానములో వుంది. అలాగే 9 వ స్థానానికి కూడా అధిపతి. 9 వ స్థానముతో సిగ్నిఫై అయింది కావున వివాహం జరిగిన తరువాత అదృష్టము కూడా కలసి వస్తుంది. 9 వ స్థానము అదృష్టాన్ని ఇస్తుంది.

నోట్ : మనకు ఎక్కువగా  11 వ స్థానముతోటి కూడా సంబందాలు కనిపిoచలేదు కావున  అప్పుడు 5 వ స్థానముతోటి కూడా సంబందాలు ఉన్నాయా  లేదా అని కూడా చూడవచ్చు

  • 11 వ స్థానము యెక్క సబ్ లార్డ్ బుధ గ్రహాము – 5 వ స్థానములో వుంది అలాగే 7 వ స్థానములో కూడా వుంది.
  • ఇక్కడ 5 వ స్థానము ప్రేమ  వ్యవహారాల గురించి తెలియజేస్తుంది అలగే మ్యారేజ్ ఐన తరువాత దంపతుల మద్య వుండే ప్రేమను కూడా తెలియజేస్తుంది.

మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది?

  • ప్రస్తుతము రాహు మహా దశలో గురు భుక్తి ఏ(పిల్ 2018 నుండి సెప్టెంబర్ 2020 వరకు వుంటుంది. ఈ గురు భుక్తి లో శుక్ర అంతర కాలము మే 2019 నుండి అక్టోబర్ 2019 వరకు వుంటుంది. ఈ కాలములో మ్యారేజ్ జరుగుతుంది అని Prediction ఇవ్వటం జరిగింది.
  • రాహు గ్రహము గురు గ్రహముతో వున్నాడు. రాహు గురు నక్షత్రములో వుంది.
  • గురు గ్రహాము అమ్మాయిలకు భర్త గురించి తెలియజేస్తుంది.
  • అలాగే శుక్ర గ్రహాము 2 వ స్థానాన్ని చూస్తున్నది.
  • అలాగే నవాంశలో మీనా లగ్నము అవుతుంది . గురు గ్రహము నవాంశ లగ్నములో వున్నాడు. ఈ లగ్నము నుండి 7 వ స్థానాన్ని అలాగే 9 వ స్థానములో ఉన్న శుక్ర గ్రహాన్ని చూస్తున్నాడు.

కావున పైన చెప్పిన కాలములో అనగా మే 2019 నుండి అక్టోబర్ 2019లో జరుగుతుంది

ఇక్కడ నవంశా చక్రం ఇవ్వడం జరిగింది గమనిచగలరు