KP Astrology Ruling Planets
1.జన్మ దిన పాలక గ్రహాలు
ఇక్కడ 06-09-2002, శుక్ర వారము రోజున, జహీరాబాద్ లో 20 గం. 24ని.జన్మిచిన రాశి చక్రము ఇవ్వడము జరిగింది గమనించగలరు.
రూలింగ్ ప్లానేట్స్ అనగా
- లగ్నంలో ఏ రాశిలో పడితే – ఆ లగ్నాధిపతి, నక్షత్రాధిపతి మరియు సబ్ లార్డ్
- అలాగే చంద్ర గ్రహం ఏ రాశిలో స్థితి అయితే – ఆ రాశి అధిపతి, నక్షత్రాధిపతి మరియు సబ్ లార్డ్
- అలాగే రోజు – డే లార్డ్
లగ్నము : గురు – బుధ – గురు
రాశి (చంద్ర) : సూర్య – కేతు – బుధ
శుక్రవారం : శుక్ర
- ఈ ఏడు గ్రహలనే పాలక గ్రహాలు (Ruling Planets) అంటారు. వీటిని జన్మ దిన పాలక గ్రహాలు అంటారు.
- మనం ఏ ఈవెంట్ గురించి వీశ్లేషణ చేస్తామో – ఆ ఈవెంట్ కు సంబంధించిన సిగ్నిఫికేటర్స్ లో ఈ పాలక గ్రహాలు కూడా వుంటే ఆ ఈవెంట్ ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది.
- ఏ ఈవెంట్ అయిన సరే – ఆ ఈవెంట్ కు సంబంధించిన సిగ్నిఫికేటర్స్ యెక్క దశ, భుక్తి మరియు అంతర కాలాలలోఈవెంట్ జరుగుతుంది.
- ఈ దశ, భుక్తి మరియు అంతర కాలాల సిగ్నిఫికేటర్స్ – పాలక గ్రహాలతో సిగ్నిఫికేసన్స్ ఉంటె – ఆ ఈవెంట్ ఇంకా ఖచ్చితంగా – ఈ దశ, భుక్తి మరియు అంతర కాలలలోనే జరుగుతుంది.
2.KP హోరారి ఆస్ట్రాలజీ పాలక గ్రహాలు
- KP Horary Astrology – ప్రశ్న జ్యోతిష్యము లో 1 నుండి 249 సబ్ నెంబర్స్ ఉంటాయి.
- తన గురించి తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఈ 1 నుండి 249 సంఖ్యలలో ఏదో ఒక సంఖ్యా చెప్పడము జరుగుతుంది.
- ఈ నెంబర్ ప్రకారము జ్యోతిష్యుడు తన స్థలము నుండి ఏ సమయానికి చార్ట్ వేస్తె ఈ సమయము ప్రకారము చార్ట్ వేసుకోవాలి.
- హోరారి చార్ట్ వేసుకున్నాక, ప్రశ్న అడిగిన వ్యక్తి చెప్పిన సంఖ్యా ప్రకారము లగ్నము అవుతుంది.
- అలాగే ఏ సమయానికి చార్ట్ వేసుకుంటే ఆ సమయము ప్రకారము లగ్నము వుంటుంది.
- ఈ లగ్నానికి చెందిన సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, అలాగే చంద్ర గ్రహానికి సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, అలాగే వీటితో పాటు ఏ రోజు చార్ట్ వేసుకుంటే ఆ రోజుకు చెందిన లార్డ్ … ఈ 9 గ్రహాలను Horary Ruling Planets అంటారు.
- ఈ 9 Ruling Planets ద్వార కూడా event ఎప్పుడు జరుగుతుంది అని చెప్పవచ్చు.
- ఏ రోజు హోరారి ఆస్ట్రాలజీ చార్ట్ వేస్తామో – ఆ రోజు ఆ సమయానికి, ఆ స్థలం నుండి అలాగే KP New Ayanamsa ఉపయోగించి చార్ట్ వేసుకోవాలి.
ఇక్కడ హోరారి క్వశ్చన్ నెంబర్ : 68 ప్రకారము చార్ట్ వేయడము జరిగింది గమనిచగలరు
DATE : 09-06-2017,
సమయము : 07-45-23 am
స్థలము : ZAHEERABAD
ఇక్కడ పైన ఇవ్వబడిన హోరారి చార్ట్ గమనిస్తే – హోరారి క్వశ్చన్ నెంబర్ : 68 ప్రకారము కర్కాటక లగ్నము అయింది.
హోరారి చార్ట్ వేసుకున్న సమయము ప్రకారము – లగ్నము మిథున రాశి అయింది.
చార్ట్ లో సమయము ప్రకారము వచ్చిన లగ్నము మరియు చంద్ర గ్రహలను తీసుకోవాలి
లగ్నము : బుధ – గురు – గురు – శుక్ర
రాశి (చంద్ర) : సూర్య – కేతు – గురు – శుక్ర
ఆదివారం : సూర్య
- ఈ 9 గ్రహలనే హోరారి ఆస్ట్రాలజీ పాలక గ్రహాలు (Ruling Planets) అంటారు.
- మనం ఏ ఈవెంట్ గురించి వీశ్లేషణ చేస్తామో – ఆ ఈవెంట్ కు సంబంధించిన సిగ్నిఫికేటర్స్ లో ఈ పాలక గ్రహాలు కూడా వుంటే ఆ ఈవెంట్ ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది.
- ఏ ఈవెంట్ అయిన సరే – ఆ ఈవెంట్ కు సంబంధించిన సిగ్నిఫికేటర్స్ యెక్క దశ, భుక్తి మరియు అంతర కాలాలలోఈవెంట్ జరుగుతుంది
- ఈ దశ, భుక్తి మరియు అంతర కాలాల సిగ్నిఫికేటర్స్ – పాలక గ్రహాలతో సిగ్నిఫికేసన్స్ ఉంటె – ఆ ఈవెంట్ ఇంకా ఖచ్చితంగా – ఈ దశ, భుక్తి మరియు అంతర కాలలలోనే జరుగుతుంది.
- ఈ హోరారి ఆస్ట్రాలజీ లో మరొక ప్రదానమైన విషయము : వక్ర మార్గములో ఉన్న గ్రహాలను పరిగణలోకి తీసుకోకూడదు.
హోరారీ ఆస్ట్రాలజీ విశ్లేషణ పద్ధతి : https://nsteluguastrology.com/category/articles/horary-astrology/
తెలుగు యూట్యూబ్ ఆస్ట్రాలజీ లింక్ – వేదిక్ & KP ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ, వీడియోలు ఉంటాయి. https://www.youtube.com/nsteluguworld