మన వ్యక్తిగత రాశి చక్రములో
శని, మరియు గురు గ్రహాల యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని జాతకుడు / జాతకురాలి జాతక పలితాలు చెప్పడము జరుగుతుంది.
ఈ రెండు గ్రహాలను దృష్టిలో ఉంచుకుని 12 రాశుల వారికి కేవలము వారి యొక్క లగ్నాన్ని మరియు లగ్నాధిపతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చెప్పడము జరుగుతుంది.
సంఖ్యా శాస్త్ర ప్రకారం
మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెల ప్రకారం, అనగా సౌర మాసం ప్రకారం ( Solar Month ) ఇవ్వడం జరిగింది.
కింద ఇవ్వబడిన ఫలితాలు మీరు పుట్టిన నేలను బట్టి కూడా వర్తిస్తాయి.
ఈ పలితాలు వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఎలా ఉంటుంది. అలాగే వ్యాపారములో లాభ నష్టాల గురించి, అలాగే 2023 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుందా లేదా అని చెప్పడము జరుగుతుంది.
శని గ్రహ గోచారం
- ప్రస్తుతము శని గ్రహ గోచారం మకర రాశిలో జనవరి 16 వరకు ఉంటాడు. తరువాత జనవరి 17 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. ఈ కుంభ రాశిలోనే రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు
- మీ యొక్క లగ్నం నుండి కుంభరాశి ఏ భావము అవుతుంది. ఆ భావము ఎలాంటి పలితాలను తెలియజేస్తుంది, అనే విషయాల గురించి తెలుసుకుందాం
గురు గ్రహ గోచారం
- అలాగే ప్రస్తుతము గురు గ్రహ గోచరం జనవరి 1, 2023 రోజున మీనరాశిలో 7 డిగ్రీలలో ఉన్నాడు.
- తరువాత ఏప్రిల్ 22, 2023 రోజున మేష రాశిలోకి ప్రవేశిస్తాడు
తరువాత సెప్టెంబర్ 4, 2023 రోజున గురు గ్రహ గోచరం మేష రాశిలో 21 డిగ్రీలలో వక్రంలో ఉంటాడు. మేష రాశిలోనే డిసెంబర్ 31, 2023 వరకు వక్రంలోనే ఉంటాడు - కావున మీన రాశి నుండి పరిగణలోకి తీసుకోవాలి
1. మేష లగ్నం –
సౌర మాసం (Solor Month – March 21 – April 20)
శని గోచరము – జనవరి 17 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. మేషరాశి నుండి కుంభ రాశి 11వ స్థానము అవుతుందిగురు
గురు గోచరము – మేష రాశి నుండి మీన రాశి 12వ స్థానం అవుతుంది.
- మేష లగ్నానికి అధిపతి కుజ గ్రహము కావున ఈ కుజ గ్రహము ఏ స్థానములో స్థితి అయిన సరే 11వ స్థానము కుంభరాశితో లేదా అధిపతి శని గ్రహంతో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే వ్యాపారము చేస్తున్నవారికి అదృష్టాలు వరిస్తాయి
- అలాగే కుజ గ్రహము స్వంత నక్షత్రాలలో స్థితి అయిన లేక శని, గురు గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్టితి అయి 11వ స్థానము కుంభరాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- అలాగే కుజ గ్రహము గురు గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 11వ స్థానము కుంభ రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి కుజ భుక్తి నడిస్తే పలితాలు ఇంక అద్బుతంగా ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు బాధిస్తాయి.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం మర్చి 21 నుండి ఏప్రిల్ 20 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
2. వృషభ లగ్నం
సౌర మాసం (Solor Month April 21 – May 20)
శని గోచరము – కుంభ రాశి 10వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 11వ స్థానము అవుతుంది.
- వృషభ లగ్నానికి అధిపతి శుక్ర గ్రహము – 2వ స్థానము మిథున రాశిలో లేక 5వ స్థానము కన్య రాశిలో లేక 9వ స్థానము మకర రాశిలో లేక 10వ స్థానము కుంభ రాశిలో స్థితి అయితే పలితాలు బాగుంటాయి.
- ఈ విదంగా కాకుండా మేష, సింహ మరియు ధనుస్సు రాశిలో శుక్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో అంటే 13.20 డీగ్రీల నుండి 26.40 డీగ్రీల మద్యలో శుక్ర గ్రహము స్థితి అయిన పలితాలు ఇంకా బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి శుక్ర భుక్తి నడిస్తే పలితాలు ఇంకా అద్బుతంగా ఉంటాయి.
- ఒకవేళ 9వ స్థానము మకర రాశితో ఏ మాత్రమూ సిగ్నిఫికేసన్స్ లేకుండా ఉంటె పలితాలుఅసలు బాగుండవు.
- లేదా మీ వ్యక్తిగత రాశి చక్రంలో గురు, శని గ్రహాల గోచార దృష్టి శుక్ర గ్రహం మీద లేకుంటే ఈ ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ దృష్టి ఉంటే ఈ ఫలితాలు చాల బాగుంటాయి, అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం ఏప్రిల్ 21 నుండి మే 20 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
3. మిథున లగ్నం –
సౌర మాసం (Solor Month May 21 – June 20)
శని గోచరము – కుంభ రాశి 9వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 10వ స్థానము అవుతుంది.
- మిథున లగ్నానికి అధిపతి బుధ గ్రహము – లగ్నములో లేక కన్య రాశిలో స్థితి అయి, మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి. ప్రత్యేకించి వ్యాపారం చేస్తున్న వారికి ధన సంపాదన బాగుంటుంది
- అలాగే 9వ స్థానము కుంభరాశిలో లేక 5వ స్థానము తుల రాశిలో స్థితి అయి, మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే 2వ స్థానము కర్కాటక రాశిలో తన స్వంత నక్షత్రం ఆశ్లేష నక్షత్రములో లేక 6వ స్థానము వృచ్చిక రాశిలో తన స్వంత నక్షత్రం జేష్ట నక్షత్రములో లేక 10వ స్థానము మీన రాశిలో తన స్వంత నక్షత్రం రేవతి నక్షత్రములో స్థితి అయి 8వ స్థానము మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు చాలా బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి బుధ భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం మే 21 నుండి జూన్ 20 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
4. కర్కాటక లగ్నం
సౌర మాసం (Solor Month June 21 – July 22)
శని గోచరము – కుంభ రాశి 8వ స్థానము అవుతుంది.
గురు గోచరము –మీన రాశి 8వ స్థానము అవుతుంది.
- కర్కాటక లగ్నానికి అధిపతి చంద్ర గ్రహము – లగ్నములో లేక 2వ స్థానము సింహ రాశిలో లేక 5వ స్థానము వృచ్చిక రాశిలో లేక 9వ స్థానము మీన రాశిలో లేక 10వ స్థానము మేష రాశిలో స్థితి అయి 7వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే 11వ స్థానము వృషభ రాశిలో చంద్ర గ్రహానికి చెందిన రోహిణి నక్షత్రములో స్థితి అయి 7వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి. అలాగే ప్రస్తుతము వీరికి చంద్ర భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- అలాగే 3వ స్థానము కన్య రాశిలో చంద్ర గ్రహానికి చెందిన హస్త నక్షత్రములో స్థితి అయి 7వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి చంద్ర గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం జూన్ 21 నుండి జులై 22 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
5. సింహ లగ్నం
సౌర మాసం (Solor Month July 23 – August 22)
శని గోచరము – కుంభ రాశి 7వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 8వ స్థానము అవుతుంది.
- సింహ లగ్నానికి అధిపతి సూర్య గ్రహము – లగ్నములో లేక 5వ స్థానము ధనుస్సు రాశిలో లేక 9వ స్థానము మేష రాశిలో స్థితి అయి 6వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే సూర్య గ్రహానికి చెందిన స్వంత నక్షత్రాలలో స్థితి అయి 6వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి సూర్య భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి సూర్య గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం జులై 23 నుండి ఆగష్టు 22 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
6. కన్య లగ్నం
సౌర మాసం (Solor Month August 23 – September 21)
శని గోచరము – కుంభ రాశి 6వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 7వ స్థానము అవుతుంది.
- కన్య లగ్నానికి అధిపతి బుధ గ్రహము – లగ్నములో లేక 5వ స్థానము మకర రాశిలో లేక 9వ స్థానము వృషభ రాశిలో లేక 10వ స్థానము మిథున రాశిలో స్థితి అయి 5వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే బుధ గ్రహానికి చెందిన స్వంత నక్షత్రాలలో స్థితి అయి 5వ స్థానము మకర రాశితో మంచి సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి బుధ భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి బుధ గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం ఆగస్ట్ 23 నుండి సెప్టెంబరు 21 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
7. తుల లగ్నం
సౌర మాసం (Solor Month September 22 – October 20)
శని గోచరము – కుంభ రాశి 5వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 6వ స్థానము అవుతుంది.
- తుల లగ్నానికి అధిపతి శుక్ర గ్రహము – లగ్నములో లేక 4వ స్థానములో లేక 5వ స్థానములో లేక 9వ స్థానము మిథున రాశిలో లేక్ 10వ స్థానము కర్కాటక రాశిలో బుధ నక్షత్రం అశ్లేషలో స్థితి అయి 4వ స్థానము మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే శుక్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో శుక్ర గ్రహము స్థితి అయి 4వ స్థానము మకర రాశితో మరియు 3వ స్థానము ధనుస్సు రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి శుక్ర భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి శుక్ర గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 20 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
8. వృచ్చిక లగ్నం
సౌర మాసం (Solor Month October 21 – November 20)
శని గోచరము – కుంభ రాశి 4వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 5వ స్థానము అవుతుంది.
- వృచ్చిక లగ్నానికి అధిపతి కుజ గ్రహము – లగ్నములో లేక 2వ స్థానము ధనుస్సు రాశిలో లేక 5వ స్థానము మీన రాశిలో లేక 7వ స్థానము వృషభ రాశి లో ప్రత్యేకించి కుజ నక్షత్రములో స్థితి లేక 9వ స్థానము కర్కాటక రాశిలో లేక 10వ స్థానము సింహ రాశిలో స్థితి అయి 3వ స్థానం మకరరాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి
- అలాగే కుజ గ్రహానికి చెందిన నక్షత్రాలలో లేక గురు గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 3వ స్థానం మకరరాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి కుజ భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి కుజ గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం అక్టోబర్ 20 నుండి నవంబర్ మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
9. ధనుస్సు లగ్నం
సౌర మాసం (Solor Month November 21 – December 21)
శని గోచరము – కుంభ రాశి 3వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 4వ స్థానము అవుతుంది.
- ధనుస్సు లగ్నానికి అధిపతి గురు గ్రహము –లగ్నములో లేక 4వ స్థానము మీన రాశిలో 5వ స్థానము మేష రాశిలో లేక 9వ స్థానము సింహ స్థితి అయి 2వ స్థానం మకర రాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి
- అలాగే గురు గ్రహానికి చెందిన నక్షత్రాలలో లేక సూర్య గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 2వ స్థానము మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి గురు భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి గురు గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం నవంబర్ 21 నుండి డిసెంబర్ 21 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
10. మకర లగ్నం
సౌర మాసం (Solor Month December 22 – January 21)
శని గోచరము – కుంభ రాశి 2వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 3వ స్థానము అవుతుంది.
- మకర లగ్నానికి అధిపతి శని గ్రహము – లగ్నములో లేక 2వ స్థానము కుంభ రాశిలో లేక 5వ స్థానము వృషభ రాశిలో లేక 9వ స్థానము కన్య రాశిలో లేక 10వ స్థానము తుల రాశి స్థితి అయి 12 స్థానము ధనుస్సు రాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే శని గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 1వ స్థానముతో రాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి శని భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి శని గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం డిసెంబర్ 22 నుండి జనవరి 21 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
11. కుంభ లగ్నం
సౌర మాసం (Solor Month January 22 – February 19)
శని గోచరము – కుంభ రాశి 1వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 2వ స్థానము అవుతుంది..
- కుంభ లగ్నానికి అధిపతి శని గ్రహము – లగ్నములో లేక 4వ స్థానము వృషభ రాశిలో లేక 5వ స్థానము మిథున రాశిలో లేక 9వ స్థానము తుల రాశిలో స్థితి అయి 12 స్థానము మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే శని గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 12 స్థానము మకర రాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు అద్భుతంగా ఉంటాయి.
- అలాగే బుధ గ్రహానికి చెందిన నక్షత్రాలలో లేక శుక్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 12 స్థానము మకర రాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు అద్భుతంగా ఉంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి శని భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి శని గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం జనవరి 22 నుండి ఫిబ్రవరి 18 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
12. మీన లగ్నం
సౌర మాసం (Solor Month – February 19 – March 20)
శని గోచరము – కుంభ రాశి 12వ స్థానము అవుతుంది.
గురు గోచరము – మీన రాశి 1వ స్థానము అవుతుంది.
- మీనలగ్నానికి అధిపతి గురు గ్రహము – లగ్నములో లేక 2వ స్థానము మేష రాశిలో లేక 5వ స్థానము కర్కాటక రాశిలో లేక 9వ స్థానము వృచ్చికరాశిలో స్థితి అయి 11మకర రాశితో మరియు 10 స్థానము ధనుస్సు రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- గురు నక్షత్రములో స్థితి అయి 11వ స్థానము మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- చంద్ర నక్షత్రములో లేక కుజ నక్షత్రములో స్థితి అయి 11వ స్థానము మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి
- ప్రస్తుతము వీరికి గురు భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి గురు గ్రహం మీద లేకున్నా ఫలితాలు అసలు బాగుండవు.
- అలాగే సంఖ్యా శాస్త్ర ప్రకారం ఫిబ్రవరి 19 నుండి మర్చి 20 మధ్యలో జన్మించిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి.
జ్యోతిష్యం నేర్చుకోండి : http://89g.b09.myftpupload.com/astrology-course-details/
NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology