12 భావాలు – కారక గ్రహాలు

12 భావాలు – కారక గ్రహాలు

లగ్నం – తను భావం – కారక గ్రహాలు

ఈ భావము – దేహము, ఆకారము, శరీరతత్త్వం  ఆరోగ్యం, రాజకీయము గురంచి తెలియజేస్తుంది

 1. లగ్నం, లగ్నాధిపతి మరియు చంద్ర గ్రహం, ఈ మూడింటితో గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే ఈ గ్రహాలు బలంగా ఉంటె -జాతకుడు / జాతకురాలు అందంగా ఉంటారు, అలాగే ధైర్యవంతులు మరియు బలవంతులు.
 2. లగ్నం నుండి 7, 8 స్థానాలలో శని, గురు గ్రహాలు కలిసి స్థితి అయితే సంబంధిత సమస్యలు ఉంటాయి. అలాగే ఈ గ్రహాల మధ్యా 3 డిగ్రీల తేడా ఉంటె సంతాన సమస్యలు కూడా ఉంటాయి.
 3. లగ్నం నుండి 4,6,8,12 స్థానాలలో ఎక్కడైనా సూర్య, చంద్ర, బుధ గ్రహాలు స్థితి అయి, శని, రాహేలు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – చెవిటివారు అవుతారు.
 4. 6,8,12 స్థానాధిపతులలో ఎవరైనా లగ్నంలో స్థితి అయి, గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సూర్య, కుజ శని, రాహు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉంటాయి.
 5. లగ్నాధిపతి 7వ స్థానంలో స్థితి అయి, అలాగే 7వ స్థానాధిపతి లగ్నంలో స్థితి అయితే (పరివర్తన అంటారు ) – వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే 7వ స్థానానికి కారక గ్రహమైన శుక్ర గ్రహాంతో లగ్నం/ లగ్నాధిపతితో లేదా 7వ స్థానం/ 7వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వివాహ జీవితం ఇంకా బాగుంటుంది.
 6. అలాగే లగ్నాధిపతి మరియు 4వ స్థానాధిపతి ఒకరి స్థానములో ఒకరు స్థితి అయితే – తండ్రి కంటే తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, అలాగే స్థిరాస్తుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే 4వ స్థానానికి కారకత్వం వహించే చంద్ర గ్రహం బలంగా ఉంటె, ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్న సరే కన్నా తల్లితేనే ఉంటారు. అలాగే 4వ స్థానానికి కుజ గ్రహం స్థిరాస్తుల విషయానికి కారకత్వం వహిస్తాడు. కావున కుజ గ్రహం బలంగా ఉండి, 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – స్థిరాస్తులను కూడబెట్టుకుంటారు.
 7. అలాగే లగ్నాధిపతి మరియు 8వ స్థానాధిపతి ఒకరి స్థానములో ఒకరు స్థితి అయితే – స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈ అధిపతులతో రాహు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – చెడు అలవాట్లు ఉంటాయి. అలాగే డిగ్రీలలో దగ్గరిగా ఉంటె – జాతకుడు/జాతకురాలి యొక్క వ్యక్తిగత జీవితం అస్సలు బాగుండదు.
 8. అలాగే లగ్నాధిపతి మరియు 9వ స్థానాధిపతి ఒకరి స్థానములో ఒకరు స్థితి అయితే – ఏ పని చేసిన అదృష్టాలు ఉంటాయి. అందరిని ఆకట్టుకుంటారు. పెద్దలను గౌరవిస్తారు. గురు గ్రహం 9వ స్థానానికి అదృష్టాలు మరియు ఆధాత్మిక విషయాలకు కారకాత్వం వాహిస్తాడు. కావున 1, 9 స్థానాలు / అధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 9. అలాగే లగ్నాధిపతి మరియు 10వ స్థానాధిపతి ఒకరి స్థానములో ఒకరు స్థితి అయితే – వృత్తి, ఉద్యోగ విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రాజకీయ యోగం కూడా ఉంటుంది. 10వ స్థానానికి శని, బుధ గ్రహాలూ వృత్తి, ఉద్యోగ విషయాలకు కరాకాత్వం వహిస్తారు. కావున లగ్నం/ 10వ స్థానం మరియు 1, 10 అధిపతులతో సిగ్నిఫీకేయన్స్ ఉంటె – వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి.
 10. అలాగే లగ్నాధిపతి మరియు 12వ స్థానాధిపతి ఒకరి స్థానములో ఒకరు స్థితి అయితే – ఆరోగ్యం బాగుండదు.  12వ స్థానానికి శుక్ర గ్రహం సెక్సు విషయాలకు కారకత్వం వహిస్తాడు. కావున శుక్ర గ్రహానికి 1, 12 స్థానాలతో/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ లేకపోతే – సెక్సు మీద ఆసక్తి ఉండదు.

 

ద్వితీయ  భావము – ధన భావము – కారక గ్రహాలు

ఈ భావము – ధనము, సిరి సంపదలు, కుటుంబము, ఆహార స్వీకరణ, కంఠధ్వని, ముఖం, ద్వితీయ కళాత్రము, ఎడమ కన్ను గురించి తెలియజేయును.

 1. 2వ స్థానాధిపతి 2వ స్థానములో స్థితి అయితే – ధన సంపాదన బాగుంటుంది.2వ స్థానానికి గురు గ్రహం – ధనం, సంపద  విషయాలకు కారకత్వం వహిస్తాడు. కావున గురు గ్రహాంతో 2వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉండి, గురు గ్రహం బలంగా ఉంటె – బ్యాంకు బ్యాలన్స్ ధన సంపాదన ఇంకా బాగుంటుంది. అలాగే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి.
 2. 2వ స్థానాధిపతి కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయి, బుధ గ్రహంతో సిగ్నిఫీకేస్న్స్ ఉంటె – మంచి వక్త అవుతారు. ఎందుకంటె 2వ స్థానానికి బుధ గ్రహం ఉపన్యాసము మరియు అందరిని ఆకట్టుకునేలా మాట్లాడే విషయానికి కారకత్వం వహిస్తాడు.
 3. 2వ స్థానాధిపతి 5వ స్థానంలో స్థితి అయితే – ధన సంపాదన బాగుంటుంది. అలాగే వీరి సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. 5వ స్థానానికి గురు గ్రహం సంతానం మరియు తెలివితేటల  విషయాలకు  కారకత్వం వహిస్తాడు. అలాగే 5వ స్థానానికి కుజ గ్రహం అధికారం విషయానికి కారకత్వం వహిస్తాడు. కావున కుజ, గురు గ్రహాలతో సిగినఫీకేషన్స్ ఉంటె మంచి ధన సంపాదనతో పాటు మంచి అధికారి స్థాయి ఉద్యోగంలో స్థిరపడతారు.
 4. 2వ స్థానాధిపతి చంద్ర, శుక్ర కలిసి ఏ స్థానములో స్థితి అయిన కంటి సమస్యలు మరియు రేచీకటి ఉంటాయి. చంద్ర గ్రహం 12వ స్థానానికి కన్ను విషయానికి, అలాగే శుక్ర గ్రహాం 2వ స్థానానికి కన్ను విషయానికి కారకత్వం వహిస్తారు. కావున ఈ రెండు గ్రహాలకు 2 మరియు 12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – కంటే సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి.
 5. 2వ స్థానంలో కుజ గ్రహం స్థితి అయి, 6వ స్థానం, మరియు రాహు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మోసగాడు, జూదమాడుతారు. రాహు గ్రహం 6వ స్థానానికి మోసం చేయడం విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే శని గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మోసాలు చేయడమే వృత్తి అవుతుంది.
 6. 2వ స్థానాధిపతి 7వ స్థానంలో స్థితి అయితే అబ్బాయి /అమ్మాయికి మంచి జీవిత భాగస్వామి వస్తారు. అబ్బాయిలకు శుక్ర గ్రహం 7వ స్థానానికి భార్య అలాగే అమ్మాయిలకు గురు గ్రహం భర్త విషయానికి కారకత్వం వహిస్తారు. వారియొక్క వక్తిగత రాశి చక్రాలలో ఈ గ్రహాలు 2, 7 స్థానాలు / స్థానాధిపతులతో బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి మంచివారు.
 7. 2వ స్థానాధిపతి 11వ స్థానంలో స్థితి అయితే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. గురు గ్రహం 11వ స్థానానికి లాభాలు అలాగే బుధ గ్రహం 11వ స్థానానికి స్నేహితులు, మంచి ప్రతిభ విషయాలకు కారకత్వం వహిస్తారు.కావున 2,11 స్థానాలు / స్థానాధిపతులతో గురు , బుధ గ్రహాలతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె జీవితమంతా ఆర్థికపరమైన సమస్యలు రావు.

 

తృతీయ భావము –భాతృ భావము – కారక గ్రహాలు

ఈ భావము – కనిష్ట సోదరి, సోదరులు. స్టాన చలనము, దగ్గరి ప్రయాణాలు, భావ వ్యక్తీకరణ శక్తి, శారీరక బలము, ధర్మము, లౌకికమైన తెలివితేటలు, నరములకు సంబందించిన వ్యాధులు

 1. 3వ స్థానంలో గురు, శుక్ర గ్రహాలు స్థితి అయితే – సంతాన సమస్యలు ఉంటాయి. అలాగే 12వ స్థానముతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – సంతానం ఉండదు. 12వ స్థానానికి శుక్ర గ్రహం సెక్సకు సంబంధించిన విషయానికి కారకత్వం వహిస్తాడు. కావున సంతానం ఉండదు. అలాగే వీరు ఎవ్వరితోను మాట్లాడారు, ఎవరితోనూ స్నేహం చేయరు.
 2. 3వ స్థానంలో శుక్ర గ్రహం స్థితి అయి బలహీనంగా ఉంటె – చెడు అలవాట్లు ఉంటాయి. దుర్మార్గుడు, కామాందుడు, ధన సంపాదన లేనివాడు. అలాగే రాహు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, అలాగే డిగ్రీలలో దగ్గరిగా ఉంటె ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ శుక్ర, రాహు గ్రహాలు బలంగా ఉంటె – కాస్త మంచి గుణాలు ఉంటాయి, అలాగే సంగతంలో ఇష్టం ఉంటుంది. శుక్ర గ్రాహం – 3వ స్థానానికి సంగీతం, అలాగే రాహు గ్రహం – ఫొటోగ్రఫీ విషయాలకు కారకత్వం వహిస్తారు. కావున 11వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె సంగతం ద్వారా ధన సంపాదన ఉంటుంది.
 3. 3వ స్థానాధిపతి 4వ స్థానములో స్థితి అయితే – ధన సంపాదన బాగుంటుంది. అలాగే మంచి గుణం ఉంటుంది. కానీ చెడు అలవాట్లు ఉన్న జీవిత భాగస్వామి వస్తారు. అలాగే గురు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె జీవితమంతా సంతోషంగా  తృప్తిగా ఉంటారు. గురు గ్రహం  4వ స్థానానికి సంతోషం, తృప్తి విషయాలకు కారకాత్వం వహిస్తాడు. అలాగే శని గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫైనాన్సియల్ స్టేటస్ బాగున్నప్పటికీ  భాధలు ఉంటాయి. ఎందుకంటె శని గ్రహం 4వ స్థానానికి భాదలు ఇవ్వడం గురించి కారకత్వం వహిస్తాడు.
 4. 3వ స్థానాధిపతి 11వ స్థానములో స్థితి అయితే – అనారోగ్య సమస్యలు ఉంటాయి. శని 11వ స్థానానికి పాదాల విషయానికి కారకత్వం వహిస్తాడు, కావున శని గ్రహంతో కూడా బలంగా సిగ్నిఫీకేషన్స్ పాదాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఒకవేళ 3వ స్థానాధిపతి కుజ గ్రహంమైతే – ప్రమాదాలు జరుగుతాయి, కళ్ళు విరిగే అవకాశం కూడా ఉంటుంది.
 5. 3వ స్థానంలో కుజ గ్రహం స్థితి అయితే – కస్టపడి పని చేసారు. మంచి విలాసవంతమైన జీవితం ఉంటుంది. గురు, బుధ  గ్రహలు 11వ స్థానానికి విజయం, స్నేహితులు, ప్రతిభ గురించి కారకత్వం వహిస్తారు, కావున గురు, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.

 

చతుర్థ భావము – మాతృ భావము – కారక గ్రహాలు

ఈ భావము – ఈ భావము ప్రదానంగా తల్లి, వాహానము,గృహాము, సౌఖ్యము గురించి తెలియజేయును. విద్యా, చర స్థిరాస్తులు, వ్యవసాయము, వేదశాస్త్ర అభివృద్ధి, రాజ్యం, విజయము గురించి తెలియజేయును.

 1. 4వ స్థానంలో శని, రాహు గ్రహాలు స్థితి అయి, ఈ గ్రహాలు 4వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. 4వ స్థానానికి శని, రాహు గ్రహాలు చెడు విషయాలకు కారకత్వం వహిస్తారు. అలాగే బుధ గ్రహం 4వ స్థానానికి బంధువుల విషయానికి కారకత్వం వహిస్తాడు. కావున బుధ గ్రహంతో కూడా అదనంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మాతృ సమానురాలితో సంభోగం చేస్తారు.
 2. 4వ స్థానములో సూర్య, బుధ గ్రహాలు స్థితి అయితే – వృత్తిరీత్యా ప్రయాణాలు చేస్తారు, అలాగే ధన సంపాదన కూడా బాగుంటుంది. గురు గ్రహం 9వ స్థానానికి దూరపు ప్రయాణాలకు కారకత్వం వహిస్తాడు, కావున సూర్య, బుధ గ్రహాలతో 9వ స్థానం మరియు గురు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అదృష్టాలు వరిస్తాయి, అలాగే జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు అస్సలు రావు.
 3. 4వ స్థానములో శుక్ర గ్రహం స్థితి అయితే – అందరికి ఇష్టమైనవాడు, ఆస్తిపరుడు. శుక్ర గ్రహం 4వ స్థానానికి వాహనాలు, సౌకర్యవంతమైన జీవితానికి కారకత్వం వహిస్తుంది, కావున 4వ స్థానాధిపతితో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉండి, 4వ స్థానంలో బలంగా ఉంటె ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 4. 4వ స్థానములో బుధ, శుక్ర గ్రహాలు స్థితి అయితే – జ్యోతిష్యం మీద ఆసక్తి, నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది. 8వ స్థానానికి శని గ్రహం,  జ్యోతిష్య విద్యలో పరిశోధన విషయానికి కారకత్వం వహిస్తాడు, అలాగే గురు గ్రహం 12, 9 స్థానాలకు జ్యోతిష్య విద్య మరియు ఆధ్యాత్మిక విషయాలకు కారకత్వం వహిస్తాడు, అలాగే బుధ గ్రహం 12వ స్థానానికి జ్యోతిష్యం మీద ఆసక్తి ఉంటుందనే విషయానికి కారకత్వం వహిస్తాడు, కావున ఈ స్థానాలతోతో, ఈ గ్రహాలకు మంచి సిగ్నిఫీకేషన్స్ ఉంటె – జ్యోతిష్య వృత్తిలో ఉంటారు.
 5. 4వ స్థానములో కేతు, సూర్య గ్రహాలు ఉంటె – గణితంలో మంచి పరిజ్ఞానం ఉంటుంది. గురు, బుధ గ్రహాలు 9, 5 స్థానాలకు విద్యా విషయానికి కారకత్వం వహిస్తారు,కావున గురు, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 5, 9 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె గణితంలో Phd చేస్తారు.

 

పంచమ భావము – పుత్ర భావము – కారక గ్రహాలు

ఈ భావమును సంతాన భావము అని కూడా అంటారు.

సౌఖ్యము, బుద్ది, విద్యా, కామము, సంభోగము, కోరికలు, ఆటలు, సంగీతము, నృత్య కళలు, వ్యాపారము, షేర్ మార్కెట్, ఆధ్యాత్మికత చింతన, అత్త గారి ఆస్తి వచ్చుట, గుండె, వెన్ను బాగాములను తెలియజేయును.

 1.  5 స్థానంలో కుజ గ్రహం స్థితి అయితే – సంతాన సమస్యలు ఉంటాయి, అలాగే దుఃఖాలు కూడా ఉంటాయి. గురు గ్రహం 5వ స్థానానికి పిల్లల విషయానికి కారకత్వం వహిస్తాడు, అలాగే 8వ స్థానానికి సంతానం విషయానికి నష్టాలు ఇస్తాడు. కావున 5వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటే సంతానం ఉంటుంది. అలాగే 8వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె సంతాన సమస్యలు ఉంటాయి.
 2. 5 స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు స్థితి అయితే విద్యావంతులు, మంచి గుణం ఉంటుంది. ఏ సమస్యనైనా పరిష్కరించే తెలివితేటలు మంచి ప్రతిభ ఉంటుంది. బుధ గ్రహం 5వ స్థానానికి – తెలివితేటలు, జ్ఞానం విషయాలకు అలాగే శుక్ర గ్రహం 5వ స్థానానికి సంతోషం విషయానికి కారకత్వం వహిస్తారు. కావున 5వ స్థానాధిపతితో కూడా బలంగా సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. 5వ స్థానాధిపతి 7వ స్థానంలో స్థితి అయితే ఆధ్యాత్మిక విషయాలలో మంచి జ్ఞానం ఉంటుంది. నీజాయితీపరుడు, అలాగే మనోనిగ్రహం కూడా ఉంటుంది. అలాగే మంచి గుణాలున్న జీవిత భాగస్వామి వస్తారు. గురు గ్రహం 7వ స్థానానికి జీవిత భాగస్వామి విషయానికి మంచి పేరు ప్రతిష్టలు విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే బుధ గ్రహం 7వ స్థానానికి వ్యాపారం మరియు చెడు ఎప్పుడు జరుగుతుంది అనే విషయానికి కారకత్వం వహిస్తాడు. గురు, బుధ గ్రహాలకు 5వ స్థానం / 7వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 4. 5వ స్థానంలో సూర్య, శని గ్రహాలు స్థితి అయితే కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అలాగే 10వ స్థానం / 10వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వ్యాపారంలో ఊహించనంతగా లాభాలు ఉంటాయి, అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎందుకంటె సూర్య గ్రహం 10వ స్థానానికి నెంబర్ 1 స్థాయి విషయానికి, అలాగే శని గ్రహం వృత్తి ఉద్యోగాల విషయానికి కారకత్వం వహిస్తారు. కావున 10వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 5. 5వ స్థానాధిపతి 9వ స్థానం లేదా 11వ స్థానములో స్థితి అయితే మంచి విద్యావంతుడు, అందరికి ఇష్టమైనవారు, చిన్నా వయసులోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. గురు, బుధ గ్రహాలు 9 మరియు 11 స్థానాలకు స్నేహితులు, లాభాలు, అదృష్టం విషయాలకు కారకత్వం వహిస్తారు. కావున గురు, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – మంచి ఉన్నతమైన అధికారి స్థాయి ఉద్యోగంలో ఉంటారు లేదా మంచి వ్యాపారస్థుడిగా స్థిరపడుతారు.

 

షష్టభావము – శత్రు భావము – కారక గ్రహాలు

ఈ భావము ప్రదానంగా  శ(తువులు,రోగములు, ఋణముల గురించి తెలియజేయును.

తగాదాలు, (కూరమైన పనులు, సేవక వృత్తి, గవర్నమెంట్ ఉద్యోగము, పిసినారితనం, దొంగతనము, మేనమామలు, పోటి పరిక్షలలో విజయము, జీర్ణాశయ వ్యాధుల గురించి తెలియజేయును.

 1. లగ్నంలో 6వ స్థానాధిపతి, బుధ గ్రహాం కలిసి స్థితి అయితే చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయి. బుధ గ్రహం 1వ స్థానానికి చర్మం గురించి కారకత్వం వహిస్తాడు. కావున బుధ గ్రహం బలంగా ఉండి 6వ స్థానాధిపతికి చాలా దగ్గరిగా అనగా 5 డీగ్రీలలోపు స్థితి అయితే చర్మ వ్యాధులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. శుక్ర గ్రహం 1వ స్థానానికి అందం విహాయానికి, అలాగే శని గ్రహం 1వ స్థానానికి వెంట్రుకలు విషయానికి కారకాత్వం వహిస్తారు. కావున బుధ గ్రహానికి మరియు 1వ స్థానం/ స్థానాధిపతి లేదా 6వ స్థానం/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె మొఖం మీద కురుపులు, అలాగే జుట్టు కూడా ఊడిపోతుంది.
 2. 1, 6 స్థానాధిపతులకు రాహు, కేతు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – తలకు సంబంధించిన వ్యాధులు, లేదా మైగ్రేన్ సమస్యతో భాదపడుతారు. సూర్య గ్రహం 1వ స్థానానికి తల విషయానికి కారకత్వం వహిస్తాడు. కావున సూర్య గ్రహముతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శని, కుజ గ్రహాలకు 6వ స్థానంలో స్థితి ఐన లేదా 6వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉన్న- జననేంద్రియ సమస్యలు ఉంటాయి.
 3. కుజ గ్రహం 6వ స్థానానికి మాగవాళ్ళకు జననేంద్రియ విషయాలకు కరాకత్వం వాహిస్తాడు. అలాగే శని గ్రహం 6వ స్థానానికి అనారోగ్య విషయాలకు కారకత్వం వాహిస్తారు. కావున 6వ స్థానంతోపాటు 8వ స్థానం/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – జబ్బు యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
 4. 6వ స్థానములో చంద్ర, కుజ గ్రహాలు స్థితి అయితే ఏదోఒక అనారోగ్య సమస్యతో బాధపడుతారు. చంద్ర గ్రహాం 3వ స్థానానికి ఉపిరిత్తితులు విషయానికి అలాగే కుజ గ్రహం 1వ స్థానానికి రక్తం విషయానికి కరాకాత్వం వహిస్తారు. కావున చంద్ర, కుజ గ్రహాలకు 1వ స్థానము / స్థానాదిపాతి మారియు 3వ స్థానాం / స్థానాదిపాతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఉపిరిత్తులకు సంబంధించిన వ్యాధి ఉంటుంది.
 5. 6వ స్థానములో సూర్య, శుక్ర గ్రహాలు స్థితి అయితే ఏదోఒక అనారోగ్య సమస్యతో బాధపడుతారు. సూర్య గ్రహం 2వ స్థానానికి కంటి సమస్యలకు కారకత్వం వహిస్తాడు. అలాగే శుక్ర గ్రహం 2వ స్థానానికి గొంతు విషయానికి కారకత్వం వహిస్తాడు. కావున ఈ రెండు గ్రహాలకు 2వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె కంటి సమస్యలు ఉంటాయి. అలాగే గొంతుకు సంబంధిన వ్యాధి కూడా ఉంటుంది. ఆలాగే ఈ రెండు గ్రహాల మధ్యా  5 డిగ్రీల తేడా ఉంటె – అబ్బాయిలకు – వీర్యంలో కదలికలు ఉండవు. అమ్మాయిలకు నెలవారీ సమస్యలు ఉంటాయి.

 

సప్తమ భావము – కళత్ర భావము – కారక గ్రహాలు

ఈ భావము ప్రదానంగా వివాహాము, జీవిత భాగస్వామి, భార్య, భాగస్వామ్య వ్యాపారాల గురించి తెలియజేయును.

 1. 7 స్థానాధిపతి 12 స్థానంలో స్థితి అయిన లేదా 12స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – అబ్బాయి/అమ్మాయి ఇతరులతో  అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. శుక్ర గ్రహం 5 స్థానానికి శృంగారం, అలాగే 7వ స్థానానికి వివాహం, అలాగే 12వ స్థానానికి సెక్సులో ఆనందం (Sexual Pleasure ) విషయాలకు కారకత్వం వహిస్తారు. కావున శుక్ర గ్రహానికి 5, 12 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి  7వ స్థానంతో  మాత్రం సిగ్నిఫీకేషన్స్ లేకపోతే – ఇతరులతో అక్రమ సంబంధాలు ఉంటాయి.
 2. 7 స్థానాధిపతి 5వ స్థానంలో మరియు 5వ స్థానాధిపతి 7వ స్థానంలో స్థితి ఐన లేదా ఒకరి నక్షత్రాలలో ఒకరు స్థితి ఐన జీవిత భాగస్వామి మంచి మనుసున్నవారుగా ఉంటారు. గురు, శుక్ర గ్రహాలు 5వ స్థానానికి వివాహం ఐన తరువాత దంపతుల మధ్య ఉండే ప్రేమ విషయానికి కారకత్వం వహిస్తారు. అలాగే 7వ స్థానానికి శుక్ర గ్రహం భార్య, అలాగే గురు గ్రహం భర్త విషయానికి కారకత్వం వహిస్తారు.
 3. 7వ స్థానాధిపతికి బుధ, గురు, శుక్ర గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 5, 11 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – జీవిత భాగస్వామి అందమైన భర్త / భార్య లభిస్తారు. అలాగే మంచి మనస్సు, గుణం కూడా ఉంటుంది. ఎందుకంటె 5, 11 స్థానాలకు గురు, బుధ, శుక్ర గ్రహాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, స్నేహం గురించి కారకత్వం వహిస్తారు. కావున గురు, శుక్ర గ్రహాలకు 5, 7 స్థానాలకు/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వారియొక్క వివాహ జీవితం జీవితమంతా ఆనందంగా ఉంటుంది.
 4. 7వ స్థానాధిపతి 7వ స్థానంలో స్థితి అయి, సూర్య, శని, రాహు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వివాహజీవితం సంతోషకంగా ఉండదు. ఇతరులతో సంబంధాలు, రెండవ వివాహం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటె 7వ స్థానానికి సూర్య గ్రహం రెండవ వివాహానికి, అలాగే శని, రాహు గ్రహాలు ప్రత్యేకించి వివాహ జీవితానికి భాదలు ఇవ్వడం గురించి కారకత్వం వహిస్తారు.
 5. 7వ స్థానాధిపతితో గురు, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, ద్విస్వభావ రాశులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె రెండవ వివాహం జరుగుతుంది. గురు, బుధ గ్రహాలు ద్విస్వభావ గ్రహాలు, కావున ద్విస్వభావ రాశులు ఏ స్థానాలైన ఆ స్థానాలతో/ స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె రెండవ వివాహం 100% జరుగుతుంది.

 

అష్టమ భావము – ఆయుర్ధాయ భావము – కారక గ్రహాలు

ఈ భావము ప్రదానంగా ఆయుర్దాయము, ఆకస్మిక పరిస్థితులు, మానశిక భాదలు, అవమానాలు, రహస్య ప్రవర్తనలు, దురదృష్టము, శ(తువుల నుండి అపాయము, అపజయాలు, షేర్ల వలన లాభము, తల్లికి అదృష్టము, ఇన్సూరెన్స్ డబ్బులు, వీలునామా, ప్రభుత్వ శిక్ష, రోడ్ ప్రమాదాలు, రహస్య అవయములకు రోగాలు.

 1. 8వ స్థానాధిపతి 9వ స్థానములో స్థితి 5 కంటే ఎక్కువ గ్రహాలతో 9వ స్థానం/ 9వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె పూర్ణాయుస్సు ఉంటుంది. సూర్య గ్రహం 9వ స్థానానికి దర్మం, అలాగే గురు గ్రహం అదృష్టం, ఆధ్యాత్మిక విషయాలకు, అలాగే కేతు గ్రహం కూడా ఆధ్యాత్మిక విషయాలకు కారకత్వం వహిస్తారు. కావున 5 కంటే ఎక్కువ గ్రహాలలో, ఈ 3 గ్రహాలతో తప్పనిసరిగా సిగ్నిఫీకేషన్స్ ఉండి రాహు గ్రహం తప్ప మిగతా గ్రహాలలో ఏవైనా రెండు గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే పూర్ణాయుస్సు ఉంటుంది.
 2. చంద్ర గ్రహం 8 స్థానములో స్థితి అయి, బలహీనంగా ఉంటె – ఏదోఒక అనారోగ్య సమస్యతో భాధపడుతుంటారు. శని గ్రహం 8 స్థానానికి ఆయుర్దాయం విషయానికి కారకత్వం వాహిస్తాడు. కావున 8 స్థానము / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయుర్ధాయం బాగుంటుంది. అలాగే శని గ్రహం స్థానములో స్థితి అయితే  స్థానం నుండి 8 స్థానమైతే  స్థానాధిపతితో చంద్ర గ్రహానికి సిగ్నిఫీకేషన్స్ ఉన్న ఆయుర్ధాయం బాగుంటుంది. ఒకవేళ  విధంగా సిగ్నిఫీకేషన్స్ లేకుండా కుజ గ్రహాంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె  అనారోగ్యంతో చనిపోతారు. ఎందుకంటె 8 స్థానానికి కుజ గ్రహం చనిపోవడం విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే చంద్ర, కుజ గ్రహాల డిగ్రీలు  తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది
 3. 8 స్థానాధిపతి లగ్నంలో స్థితి అయితే – నేను చెప్పిందే సత్యం అదే పట్టించాలి అనే  మొండివాడు, అలాగే పెద్దలను  గౌరవించాడు. అలాగే జీవితమంతా ఏదోఒక అనారోగ్య సమస్య ఉంటుంది.  సూర్య గ్రహము 1వ స్థానానికి ఆరోగ్యం విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే కుజ గ్రహం 1వ స్థానానికి రక్తం విషయానికి కారకత్వం వహిస్తాడు. సూర్య, కుజ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగా ఉంటాయి.
 4. 8వ స్థానాధిపతి 8వ స్థానంలో స్థితి అయితే – అబ్బాయి / అమ్మాయి ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు. అలాగే చెడు అలవాట్లు ఉంటాయి. రాహు గ్రహం 6వ స్థానానికి మోసాలు. అలాగే 9వ స్థానానికి దురదృష్టం మరియు దూరపు ప్రయాణాలకు విషయాలకు కారకత్వం వహిస్తారు. కావున 8వ స్థానాధిపతికి రాహు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, 6,9 స్థానాలతో సిగినీఫీకేసన్స్ ఉంటె – చెడు అలవాట్లు ఉంటాయి, ఎక్కడో ఇంటికి దూరంగా ఉంటారు.
 5. 8వ స్థానములో శని గ్రహం స్థితి అయితే – మొదట్లో కష్టాలు ఉన్నప్పటికీ వృద్యాప్యంలో ఆనందగా జీవిస్తారు. అలాగే శని గ్రహానికి 2వ స్థానం / స్థానాధిపతి మరియు గురు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఆస్తులను కూడబెట్టుకుంటారు, అలాగే ఫైనాసియల్ స్టేట్స్ బాగుంటుంది. ఎందుకంటె గురు గ్రహం 2వ స్థానానికి సంపద విషయానికి కారకత్వము వాహిస్తాడు. కావున వృద్యాప్యంలో సంపాదించుకున్న ధనాన్ని సేవ కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ సంతోషంగా ఉంటారు.

 

నవమ భావము – భాగ్య భావము – కారక గ్రహాలు

ఈ భావాన్ని పూర్వ పుణ్య స్థానము మరియు శుభ స్థానము అలాగే ధర్మ స్థానము అంటారు.

ఈ భావము ప్రదానంగా పితృ  విషయములు, జాతకుని స్థితి గతులు, అదృష్టము, మత సంబంధ విషయాలు, తీర్థ యాత్రలు, వీదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యా, చట్టపరమైన విషయాలు, విజ్ఞాన శాస్త్రం, మానసిక స్వచ్ఛత, నేర్చుకోవడం, పట్టాభిషేకము, సంపదలు, (శేయస్సు, కోర్ట్ వ్యవహారములు

 1. 9 స్థానాధిపతి గురు గ్రహమై – బుధ గ్రహం మరియు 12వ స్థానముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె జ్యోతిష్య వృత్తిలో ఉంటారు. అలాగే గురు గ్రహానికి చంద్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉండి, ఈ గ్రహాలు 5డీగ్రీలలోపు ఉంటె – జ్యోతిష్యంలో మంచి పరిజ్ఞానం ఉంటుంది. బుధ గ్రహము 12వ స్థానానికి జ్యోతిష్యం విషయానికి కారకత్వం వహిస్తారు, గురు, చంద్ర గ్రహాలు 9వ స్థానానికి ఆధ్యాత్మిక సంబంధమైన విద్యా విషయానికి కారకత్వం వహిస్తారు. అలాగే  శని గ్రహానికి ఈ  గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉండి  8వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె జ్యోతిష్యంలో నెంబర్ 1అవుతారు. ఎందుకంటె శని గ్రహం 8వ స్థానానికి  జ్యోతిష్య విద్యలో పరిశోధన విషయానికి కారకత్వం వహిస్తాడు.
 2. 9వ స్థానములో శుక్ర గ్రహం స్థితి ఐన లేదా 9వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వివాహం ఐన తరవాత వివాహ జీవితం బాగుంటుంది, అలాగే అదృష్టాలు కూడా ఉంటాయి. శుక్ర గ్రహం 9వ స్థానానికి మంచి పుణ్యక్షేత్రాలకు, అభివృద్ధి విషయాలకు కారకత్వం వహిస్తారు. అలాగే అదనంగా శుక్ర గ్రహం గురు గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉన్నా లేదా గురు నక్షత్రాలలో స్థితి ఐన ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 3. 9వ స్థానాధిపతికి – 2, 10, 11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు రావు. గురు గ్రహం 2వ స్థానానికి ధనం, 10వ స్థానానికి అడ్మినిస్ట్రేషన్, 11వ స్థానానికి విజయానికి కారకత్వం వహిస్తాడు. కావున గురు గ్రహాముతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె – వీరు ఏ పని చేసిన అదృష్టాలు ఉంటాయి, అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి.
 4. 9వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి ఒకరి రాశిలో ఒకరు స్థితి అయిన లేదా ఒకరి నక్షత్రంలో స్థితి ఐన మొదట్లో సంపాదన లేకపోయినా తరువాత ధన సంపాదన బావుంటుంది. అలాగే 7, 10 స్థానాలతో మరియు బుధ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వీరికి మొదటి నుండి వ్యాపారంలో విజయాలు ఉంటాయి. ఎనుకంటె బుధ గ్రహం 7, 10 స్థానాలకు వ్యాపారం విషయానికి కారకత్వం వహిస్తాడు.
 5. 9వ స్థానాధిపతికి 8వ స్థానం/స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఆర్థికంగా నష్టాలు ఉంటాయి. అలాగే గురు గ్రహానికి 8వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఆకస్మికంగా ఆదాయం ఉంటుంది. గురు  గ్రహం 8వ స్థానానికి ఆకస్మిక ఆదాయం విషయానికి కారకత్వం వహిస్తాడు.

 

దశమ భావము – రాజ్య భావము – కారక గ్రహాలు

ఈ భావము ప్రదానంగా వృత్తి, ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది.

పితృ కర్మలు, సంఘములో పేరు ప్రతిష్టలు, విజయము, టీచింగ్ వృత్తి, ఆశయాములు, డాక్టర్, వ్యవసాయము, వ్యాయామ (కీడలు, తొడలు మరియు మోకాళ్ళు. నాణ్యత, అధికారం, ప్రవర్తన

 1. 10వ స్థానాధిపతి 9వ స్థానములో స్థితి అయితే ధన సంపాదన బాగుంటుంది, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. కుజ గ్రహం 10వ స్థానానికి  కార్యనిర్వాహక అధికారం, అలాగే గురు గ్రహం మేనేజ్మెంట్ అలాగే బుధ గ్రహం వృత్తి విషయానికి కారకత్వం వాహిస్తారు. కావున 10వ స్థానం . 10వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి.
 2. 10వ స్థానాధిపతి 11వ స్థానములో స్థితి అయితే ధన సంపాదన బాగుంటుంది, అలాగే భూ సంబంధ వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. కుజ, శని, కేతు గ్రహాలు 4, 10, 11 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ భూ సంబంధ వ్యాపారంలో లాభాలు ఉహించనంతగా ఉంటాయి. ఈ గ్రహాలతో ఏ ఒక స్థానంతో సిగ్నిఫీకేషన్స్ లేకపోయినా భూ సంబంధ వ్యాపారం ఉండదు, కానీ మంచి బిల్డింగ్ కట్టుకుంటారు. ఎందుకంటె కుజ, శని, కేతు గ్రహాలు భూములు / పొలాలు / బిల్డింగ్స్ విషయానికి కారకత్వం వహిస్తారు.
 3. 10వ స్థానాధిపతి మరియు 2వ స్థానాధిపతి ఒకరి రాశిలో ఒకరు స్థితి ఐన లేదా ఒకరి నక్షత్రంలో ఒకరు స్థితి ఐన వ్యాపారం చేస్తారు. గురు గ్రహం 2వ స్థానానికి సంపద విషయానికి కారకత్వం వహిస్తాడు కావున 2వ స్థానం/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వ్యాపారం ఇంకా బాగుంటుంది.
 4. 10వ స్థానాధిపతి మరియు 6వ స్థానాధిపతి ఒకరి రాశిలో ఒకరు స్థితి ఐన లేదా ఒకరి నక్షత్రంలో ఒకరు స్థితి ఐన ప్రభుత్వ ఉద్యొగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. శని గ్రహం 6వ స్థానానికి గవర్నమెంట్ సర్వీస్ విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే సూర్య, చంద్ర గ్రహాలు కూడా 6వ స్థానానికి మెంట్ సర్వీస్ విషయానికి కారకత్వం వహిస్తారు. కావున ఈ గ్రహాలతో తప్పనిసరిగా 6, 10 స్థానాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ప్రభుత్వ ఉద్యొగం ఖచ్చితంగా వస్తుంది.
 5. 10వ స్థానములో సూర్య, కుజ గ్రహాలు స్థితి అయి, శని, బుధ గ్రహాలకు కూడా 10వ స్థానం/ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉన్న లేదా 10వ స్థానాధిపతి కేంద్ర స్థానాలలో స్థితి అయి, శని, బుధ గ్రహాలతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె న్యాయ సంబంధ వృత్తిలో ఉంటారు. శని, బుధ గ్రహాల కలయిక లాయర్ / లా విషయానికి కారకత్వం వహిస్తారు. కావున ఈ రెండు గ్రహాలు 5 డీగ్రీలలోపు ఉంటె లాయర్ వృత్తి మంచి లాభసాటిగా ఉంటుంది.

ఏకదశ భావము – లాభ భావము కారక గ్రహాలు

ఈ భావము ప్రదానంగా లాభాల  గురించి తెలియజేస్తుంది.

అన్ని విధముల లాభము, వ్యాపారాలలో లాభము, అబివృద్ది, ముత్తాతల ఆస్తి లభించుట, స్నేహితులు, ఆశయములు పలించుట, సుఖవంతమైన జీవతము, బహుమతులు, ఎడమ చెవి, ముఖ్యమైన దస్తావేజులు, చికిత్స వలన రోగములు నయమగుట, తల్లి ఆయుర్దాయము, ఎన్నికలు.

 1. 11వ స్థానాధిపతి లగ్నంలో స్థితి అయితే మంచి ధన సంపాదన ఉంటుంది. అలాగే అందం, అలంకరణ మీద మోజు ఎక్కువగా ఉంటుంది. శుక్ర గ్రహం 1వ స్థానానికి సౌందర్యం, 2వ స్థానానికి కనుబొమ్మలు, 5వ స్థానానికి సినిమా రంగం విషయాలకు కారకత్వం వహిస్తుంది. స్ కావున శుక్ర గ్రహానికి 11వ స్థానంతో పాటు 1, 2, 5 స్థానాలు / స్థానాధిపతులతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె సినిమాలలో నటించాలనే కోరిక బలంగా ఉంటుంది. అలాగే అదనంగా బుధ గ్రహంతో కూడా సిగ్నిఫీకేసన్ ఉంటె – ఖచ్చితంగా సినిమా రంగంలో స్థిరపడిపోతారు. బుధ గ్రహం 5వ స్థానానికి ఆటలు / నటన విషయానికి కారకత్వం వహిస్తాడు.
 2. 11వ స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు స్థితి అయితే మంచి గుణాలు ఉన్నవారు. ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శుక్ర గ్రహం  4వ స్థానానికి సంతోషాలు మరియు సౌకర్యవంతమైన జీవితం, అలాగే బుధ గ్రహం 4వ స్థానానికి కుటుంబం, స్నేహితులు విషయానికి కారకత్వం వహిస్తారు. కావున బుధ, శుక్ర గ్రహాలకు 4వ స్థానాం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె జీవితమంతా సంతోషంగా ఉంటారు. అమ్మాయిల రాశి చక్రంలో ఈ సిగ్నిఫీకేషన్స్ ఉంటె వివాహం జరిగిన తరువాత సుఖంగా, అందంగా ఉంటుంది.
 3. 11వ స్థానాధిపతి శుభ గ్రహాలతో అనగా బుధ, గురు, శుక్ర గ్రహాలతో కలిసి ఏ స్థానంలో స్థితి ఐన వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఈ మూడు గ్రహాలు 9, 10 మరియు 11 స్థానాలకు అభివుద్ది విషయానికి కారకత్వం వహిస్తారు. కావున 9. 10, 11 స్థానాలు / స్థానాధిపతులకు సిగ్నిఫీకేషన్స్ ఉంటె స్థిరాస్తులను సంపాదించుకుంటారు, అలాగే ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి.
 4. 11వ స్థానాధిపతి మరియు 2వ స్థానాధిపతి ఒకరి రాశిలో ఒకరు స్థితి ఐన లేదా ఒకరి నక్షత్రాలలో స్థితి అయితే ధన సంపాదన బాగుంటుంది. అలాగే ఈ అధిపతులతో 1వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఫలితాలు ఇంకా బాగుంటాయి.1వ స్థానం వ్యక్తిగత జీవితం విషయానికి కారకత్వం వహిస్తాడు. కావున 1వ స్థానాధిపతి బలంగా ఉంటె ధన సంపాదనతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
 5. 11వ స్థానములో శని గ్రహం స్థితి అయి, బలంగా ఉంటె వ్యవసాయం బాగుంటుంది. అలాగే కుజ గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వ్యసాయంలో లాభాలు బాగుంటాయి. అలాగే శని, కుజ గ్రహాలకు 4వ స్థానంతో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వ్యవసాయంలో లాభాలు చాల బాగుంటాయి, అలాగే మంచి రైతుగా పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఎందుకంటె శని, కుజ గ్రహాలు 4వ స్థానానికి వ్యయసాయ భూముల విషయానికి కారకత్వం వహిస్తారు. అలాగే ఈ 4వ స్థానం జల రాశులైతే వ్యవసాయంలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది, లాభాలు ఎక్కువగా ఉంటాయి.

 

ద్వాదశ భావము – వ్యయ భావము – కారక గ్రహాలు

ఈ భావము ప్రదానంగా అన్ని విధాల వ్యయము, వృతి వ్యాపారాలలో నష్టాలు, ఉద్యోగము పోవుట, ఆటంకములు, ఆనారోగ్యము, రుణాలు, గాయాలు, భార్య మరణము, వీదేశీ ప్రయాణాలు, ఖర్చులు, కుడి కన్ను, కారాగార శిక్ష, హాస్పిటలులో చికిత్స

 1.  12 స్థానంలో సూర్య, శని గ్రహాలు స్థితి అయితే చెడు అలవాట్లు, అనవసరపు ఖర్చులు చేస్తారు. 12వ స్థానానికి శని గ్రహం  ఖర్చుల విషయానికి అలాగే రాహు గ్రహం చెడు పనులు  చేయడం, అలాగే ఖర్చులు, జైలుకు వెళ్లడం విషయాలకు కారకత్వం వహిస్తారు. కావున  రాహు గ్రహముతో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
 2. 12వ స్థానములో సూర్య, శుక్ర గ్రహాలు స్థితి అయితే – అబ్బాయి / అమ్మాయికి ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. యెంత సంపాదించిన వీరి దగ్గర డబ్బు నిలవదు. శుక్ర గ్రహం 2వ స్థానానికి శృంగార సుఖం గురించి, అలాగే సూర్య గ్రహం 12వ స్థానానికి ఆధాత్మిక విషయానికి కారకత్వం వహిస్తారు. కావున ఈ రెండు గ్రహాలు 12వ స్థానంలో బలహీనంగా ఉంటె జీవితమంతా ఆర్థిక సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. అలాగే 12వ స్థానాధిపతితో కూడా సిగ్నిఫీకేషన్స్ ఉంటె ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ గ్రహాలు 12వ స్థానములో బలంగా ఉంటె ఆర్థికంగా నష్టాలు అంతగా ఉండవు.
 3. 12వ స్థానములో గురు, బుధ గ్రహాలు స్థితి అయితే – మొదట్లో ధన సంపాదన లేకోపోయినప్పటికీ 35 సంవత్సరాల తరువాత ధన సంపాదన బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఒకవేళ 35 సంవత్సరాల తరువాత రాహు మహాదశ మొదలైతే ధన సంపాదన మాములుగా ఉంటుంది, అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఒకవేళ 35 సంవత్సరాల తరువాత గురు మహాదశ మొదలైతే – ధన సంపాదన చాల బాగుంటుంది, సేవ చేస్తారు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎందుకంటె రాహు 12వ స్థానానికి చెడు విషయానికి, అలాగే గురు గ్రహం మంచి గుర్తింపు ఇవ్వడానికి, అలాగే ఆధాత్మిక విషయాలకు కారకత్వం వహిస్తారు.
 4. 12వ స్థానములో గురు, శుక్ర గ్రహాలు స్థితి అయి – 7వ స్థానం / స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒకవేళ 12వ స్థానాధిపతితో సిగ్నిఫీకేషన్స్ ఉంటె వ్యాపారంలో నష్టాలు ఉంటాయి. ఒకవేళ 12వ స్థానాధిపతి బుధ, గ్రహమమైతే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు మామూలుగానే ఉంటాయి. బుధ గ్రహం 7వ స్థానానికి వ్యాపారం విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే చంద్ర, బుధ గ్రహాలు వైశ్య గ్రహాలు కావున అదనంగా  బుధ గ్రహనికి  చంద్ర గ్రహంతో సిగ్నిఫీకేషన్స్ ఉన్న లేదా చంద్ర నక్షత్రంలో స్థితి ఐన వ్యాపారములో వీరికి లాభాలు చాలా బాగుంటాయి.
 5. 12వ స్థానములో చంద్ర, కుజ గ్రహాలు స్థితి అయితే – మూర్ఖుడు, పెద్దలంటే ఏ మాత్రం గౌరవం లేనివారు. అలాగే వీరికి వివాహ జీవితం అసలు బాగుండదు. విడిపోయి దూరంగా ఉంటారు. అలాగే ఈ రెండు గ్రహాలు 5 డిగ్రీల లోపు ఉంటె తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు గ్రహాలు 12వ స్థానానికి సోమరితనం మరియు  గాలిలో మెడలు కట్టుకోవడం విషయాలకు  కారకత్వం వహిస్తారు. కావున 12వ స్థానములో ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటె వివాహ జీవిత కాస్త బాగుంటుంది. బలంగా ఉంటె వివాహ జీవితం అస్సలు బాగుండదు.

చాలా ప్రధానమైన ఆర్టికల్ : 12 భావాలు – విశ్లేషణ పద్ధతి https://nsteluguastrology.com/12-houses-analysis-method/

NS తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ లింక్ – https://www.youtube.com/nsteluguworld