Progeny Rules in Astrology
సంతానం – ప్రాధనమైన విషయాలు
- గురు గ్రహం – 5వ స్థానానికి సంతానం విషయానికి కారకత్వం వహిస్తాడు.
- ఆడవారి రాశి చక్రములో – గురు గ్రహం 6, 8, 12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంది.
- D1 చార్ట్, D9 చార్ట్ మరియు D7 చార్ట్ లో లగ్నాధిపతి, పంచమాధిపతి బాగుంటే పిల్లలు తొందరగా పుడతారు.
- అలాగే రాశి చక్రముతో పాటు నవాంశా మరియు సప్తమాంశా లో గురు గ్రహం నీచంలో ఉంటే పిల్లల ఆలస్యం అవుతుంది.
- ఆడవారి రాశి చక్రములో – చంద్ర మరియు గురు గ్రహాలు బలహీనంగా ఉంటె – సంతానం విషయములో సమస్యలు వస్తాయి
- ఆడవారికి శుక్ర గ్రహం నీచంలో ఉంటే ఫర్టిలైజేషన్ సమస్యలు వస్తాయి. ఈ శుక్ర గ్రహానికి కుజ గ్రహముతో సిగ్నఫీకేసన్స్ లేకపోతే సంతానం విషయములో సమస్యలు వస్తాయి.
- ఐదవ స్థానాధిపతి ఏ గ్రహమైన సరే ఆ గ్రహముతో – శని మరియు రాహు గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె సంతానం విషయములో సమస్యలు వస్తాయి.
- ఆడవారి రాశి చక్రములో – 5వ స్థానాధిపతి ఏ గ్రహమైన సరే ఆ గ్రహముతో – కేతు మరియు కుజ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె అబార్సన్స్ ఉంటాయి.
- దశ నాధుడు 5 లో,9లో,1లో,7లో ఉంటే కచ్చితంగా అప్పుడే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది..(గ్రహం నీచత్వం పొందకూడదు)
- D7 చార్ట్ లో 1 మరియు 5 స్తానాలలో కుజ గ్రహం లేదా సూర్య గ్రహం ఉంటే మగపిల్లవాడు పుడతాడు. ఈ గ్రహాలు 1, 5 స్థానాలలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే, మగపిల్లవాడు పుట్టే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రధానమైన విషయం
- అడ మరియు మగ వారి రాశి చక్రములో గురు, శని గ్రహాల స్థితి బాగుండాలి. లేకపోతే సంతానం ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
- రాశి చక్రములో ఈ రెండు గ్రహాల స్థితి గతులను బట్టి 100% ఖచ్చితంగా సంతానం ఉంటుందా లేదా అని చెప్పవచ్చు.
- ఆడవారి రాశి చక్రములో శుక్ర, కుజ గ్రహాల స్థితి గతులను బట్టి 100% ఖచ్చితంగా సంతానం ఉంటుందా లేదా అని చెప్పవచ్చు. ఎందుకంటె శుక్ర, కుజ గ్రహాలు బలహీనంగా ఉంటె – బహిష్టు సమస్యలు ఉంటాయి.
- అలాగే మగ వారి రాశి చక్రములో సూర్య, శుక్ర గ్రహాలు బలహీనంగా ఉంటె – వీర్యములో మొటాలిటీ తక్కువగా ఉంటుంది.
- భార్య భర్తల రాశి చక్రములో ఈ గ్రహాల యొక్క స్థితి గతులను బట్టి 100% ఖచ్చితంగా సంతానం ఉంటుందా లేదా అని చెప్పవచ్చు.
Astrology Consultancy Services – https://nsteluguastrology.com/services/
NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld