జ్యోతిష్యం – సంతానం ఉంటుందా లేదా

జ్యోతిష్యం – సంతానం ఉంటుందా లేదా

Progeny Rules in Astrology

సంతానం – ప్రాధనమైన విషయాలు

  1. గురు గ్రహం – 5వ స్థానానికి సంతానం విషయానికి కారకత్వం వహిస్తాడు.
  2. ఆడవారి రాశి చక్రములో – గురు గ్రహం 6, 8, 12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంది.
  3. D1 చార్ట్, D9 చార్ట్ మరియు D7 చార్ట్ లో లగ్నాధిపతి, పంచమాధిపతి బాగుంటే పిల్లలు తొందరగా పుడతారు.
  4. అలాగే రాశి చక్రముతో పాటు నవాంశా మరియు సప్తమాంశా లో గురు గ్రహం నీచంలో ఉంటే పిల్లల ఆలస్యం అవుతుంది.
  5. ఆడవారి రాశి చక్రములో – చంద్ర మరియు గురు గ్రహాలు బలహీనంగా ఉంటె – సంతానం విషయములో సమస్యలు వస్తాయి
  6. ఆడవారికి శుక్ర గ్రహం నీచంలో ఉంటే ఫర్టిలైజేషన్ సమస్యలు వస్తాయి. ఈ శుక్ర గ్రహానికి కుజ గ్రహముతో సిగ్నఫీకేసన్స్ లేకపోతే సంతానం విషయములో సమస్యలు వస్తాయి.
  7. ఐదవ స్థానాధిపతి ఏ గ్రహమైన సరే ఆ గ్రహముతో – శని మరియు రాహు గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె సంతానం విషయములో సమస్యలు వస్తాయి.
  8. ఆడవారి రాశి చక్రములో – 5వ స్థానాధిపతి ఏ గ్రహమైన సరే ఆ గ్రహముతో – కేతు మరియు కుజ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె అబార్సన్స్ ఉంటాయి.
  9. దశ నాధుడు 5 లో,9లో,1లో,7లో ఉంటే కచ్చితంగా అప్పుడే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది..(గ్రహం నీచత్వం పొందకూడదు)
  10. D7 చార్ట్ లో 1 మరియు 5 స్తానాలలో కుజ గ్రహం లేదా సూర్య గ్రహం ఉంటే మగపిల్లవాడు పుడతాడు. ఈ గ్రహాలు 1, 5 స్థానాలలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే, మగపిల్లవాడు పుట్టే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.

 

ప్రధానమైన విషయం

  1. అడ మరియు మగ వారి రాశి చక్రములో గురు, శని గ్రహాల స్థితి బాగుండాలి.  లేకపోతే సంతానం ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
  2. రాశి చక్రములో ఈ రెండు గ్రహాల స్థితి గతులను బట్టి 100% ఖచ్చితంగా సంతానం ఉంటుందా లేదా అని చెప్పవచ్చు.
  3. ఆడవారి రాశి చక్రములో  శుక్ర, కుజ గ్రహాల  స్థితి గతులను బట్టి 100% ఖచ్చితంగా సంతానం ఉంటుందా లేదా అని చెప్పవచ్చు. ఎందుకంటె శుక్ర, కుజ గ్రహాలు బలహీనంగా ఉంటె – బహిష్టు సమస్యలు ఉంటాయి.
  4. అలాగే మగ వారి రాశి చక్రములో సూర్య, శుక్ర గ్రహాలు బలహీనంగా ఉంటె – వీర్యములో మొటాలిటీ తక్కువగా ఉంటుంది.
  5. భార్య భర్తల రాశి చక్రములో ఈ గ్రహాల యొక్క స్థితి గతులను బట్టి 100% ఖచ్చితంగా సంతానం ఉంటుందా లేదా అని చెప్పవచ్చు.

Astrology Consultancy Services – https://nsteluguastrology.com/services/

NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld