Astrology Golden Rules
ఇక్కడ ఇవ్వబడిన ఈ రూల్స్
వ్యక్తిగతంగా రాశి చక్రములో పరిశోదనాత్మకంగా వీశ్లేషణ చేసి ఖచ్చితమైన పలితాలు గమనించాను. కావున ఈ రూల్స్ 100% జ్యోతిష్య గోల్డెన్ రూల్స్ గా పరిగణలోకి తిసుకోగలరు.
6,8,12 స్థానాలు – గ్రహాలు
- సూర్య, కుజ, శని మరియు రాహు కేతు గ్రహాలు – 6వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – జాతకుడికి మంచి హోదా, పేరు ప్రతిష్టలు, ఆకర్షణ శక్తి, ఉంటుంది. కానీ రోగాలు ఎక్కువగా ఉంటాయి.
- రాహు 6వ స్థానములో ఉంటె – వీదేశీ ప్రయాణాల ద్వార మంచి సంపాదన ఉంటుంది. శత్రువుల నుండి విజయం ఉంటుంది. అలాగే నరాలకు సంబంధిచిన వ్యాది ఉంటె తుగ్గుతుంది.
- ఒకవేళ 6వ స్థానం సబ్ లార్డ్ – రాహు గ్రహం అయితే – రాహు గ్రహం రాహు నక్షత్రాలలో స్థితి ఐన లేదా 6వ స్థానములో బలంగా ఉన్న – పై పలితాలు వర్తిస్తాయి. ఒకవేళ 8వస్థానంతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఈ పలితాలు కొద్దిగా నెగెటివ్ గా ఉంటాయి. ఒకవేళ 12వ స్థానంతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – నరాలకు సంబంధిచిన వ్యాధితో మృతువు కూడా ఉంటుంది.
- 6వ స్థానములో – చంద్ర, గురు, శుక్ర మరియు బుధ గ్రహాలు ఉంటె – మంచి తెలివైనవాడు, కానీ రోగాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
- 8వ స్థానములో – కుజ గ్రహం బలంగా ఉంటె – నష్టాలు ఉంటాయి, ఒకవేళ భాధక,మారక స్థానాలతో బలంగా సిగ్నఫీకేసన్స్ ఉంటె – మృతువు కూడా ఉంటుంది.
- 8వ స్థానములో శని గ్రహం బలంగా ఉంటె – ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది
- 6వ స్థానములో చంద్ర, శుక్ర గ్రహాలు స్థితి అయితే – తోబుట్టువులతో హ్యాపీగా ఉంటారు.
- ఏదైనా శుభ గ్రహం 8వ స్థానములో స్థితి అయి – మరొక శుభ గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – తీర్త యాత్రలు చేస్తారు
- 6,8,12 స్థానాలతో – అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉంటారు. లేదా 6,8,12 స్థానాల యొక్క సబ్ లార్డ్ తో గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉన్న – కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉంటారు.
- బుధ గ్రహం 6వ స్థానములో స్థితి అయి – శని గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – చెవికి సంబంధించిన వ్యాది వస్తుంది.
- కేతు గ్రహానికి 12వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – కేతు మహాదశలో మంచి పలితాలు ఉంటాయి
- 6వ స్థానం లేదా 6వ స్థానాధిపతితో 8వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – రోగాలు మరియు ఇంట్లో దొంగతనం ద్వార నష్టాలు ఉండే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.
- చంద్ర గ్రహముతో – కుజ మరియు బుధ గ్రహాలు కలిసి ఉన్న – లేదా 6వ స్థానాధిపతితో కలిసి ఉన్న – ఇంట్లో దొంగతనం ద్వార లేదా మోసపోవడం ద్వార నష్టాలు ఉంటాయి. చంద్ర, బుధ గ్రహాల కలిసి ఉండడం మంచిది. కాకపోతే వీరి అజాగ్రత్త మరియు అతి ఆత్మవిశ్వాసం (Over Confidence) వలన నష్టాలు ఉంటాయి.
- 6,8,12 స్థానాధిపతులతో – 9వ స్థానాధిపతి / నక్షత్రాదిపతితో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుటుంది. మంచి రాజ యోగం అని చెప్పవచ్చు.
- 6,8,12 సబ్ లార్డ్స్ తో – కేంద్ర, కోణ స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుటుంది. మంచి రాజ యోగం అని చెప్పవచ్చు.
- 2వ స్థానాధిపతి లేదా సబ్ లార్డ్ తో – 6,8,12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ధన సంపాదన బాగుంటుంది. కానీ సేవ్ చేసుకోలేరు
- కుజ గ్రహనికి – చంద్ర,సూర్య మరియు గురు గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – లేదా ఏదో ఒక గ్రహముతో స్టితి ఐన – అనారోగ్యం ఉంటుంది లేదా లిటిగేసన్ (Litigation) సమస్యలు ఉంటాయి.
- 2 మరియు 7 స్థానాధిపతులు మరియు శుక్ర గ్రహం – 6,8,12 స్థానాధిపతుల యొక్క నక్షత్రాలలో స్టితి అయితే – (పేమ విషయములో మరియు ఇంటి విషయములో సంతోషం ఉండదు. అలాగే జీవిత భాగస్వామికి అనారోగ్యం ఉంటుంది. భార్య భర్తలు విడిపోతారు. కొందరికి రెండవ వివాహం కూడా జరిగే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.
- 2వ స్థానాధిపతి – 6,8,12 స్థానాలలో స్థితి అయిన- లేదా తన స్వంత రాశి నుండి 6,8,12 స్థానాలలో స్థితి అయిన – ధన సంపాదన బాగుంటుంది కానీ జాతకుడు ఎప్పటికి మనీ సేవ్ చేసుకోలేడు.
- శని గ్రహం వక్రములో ఉండి 8వ స్థానములో స్థితి అయితే – కుటుంబానికి దూరంగా ఉంటారు.
- 9వ స్థానాధిపతితో – 6,8,12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – చిన్న చిన్న ఆక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. కానీ ప్రమాదం ఉండదు.
అప్పులు ఎవ్వరు చేస్తారు?
- 6వ స్థానం, 6వ స్థానాధిపతి, శని మరియు రాహు గ్రహలు 2వ స్థానముతో లేదా 2వ స్థానాధిపతితో మరియు 2వ స్థానానికి సహజ కారాక గ్రహమైన గురు గ్రహముతో – సిగ్నఫీకేసన్స్ ఉంటె – అప్పులు ఎక్కువగా ఉంటాయి.
- 10 మరియు 11 స్థానాధిపతులు కలిసి – 2 & 8 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – అప్పులు చేస్తారు.
- KP పద్దతిలో 2వ స్థానం సబ్ లార్డ్ – 8వ స్థానాధిపతి యొక్క నక్షత్రాలలో స్థితి అయిన – ఖర్చులుఅప్పు చేసే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.
- KP పద్దతిలో 2వ స్థానం సబ్ లార్డ్ – 8వ స్థానాధిపతి యొక్క నక్షత్రాలలో స్థితి అయి – 12వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – అప్పు చేసి, తీర్చలేని స్థాయికి వెళ్లుతారు. వీరి జాతకములో బుధ, చంద్ర గ్రహాలు బలహీనంగా ఉండి, 3,5,8 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – సూసైడ్ చేసుకునే అవకశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
- 2వ స్థానాధిపతి నీచలో ఉండి, 8వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – 2వ స్థానాధిపతి యొక్క దశలో అప్పులు చేసే అవకశాలు ఎక్కువగా ఉంటాయి.
గోల్డెన్ రూల్స్ – 1
- వ్యపారం – 2,5,9,10,11 స్థానాధిపతులు బలంగా ఉండి- 6,8 స్థానాలతో లేదా స్థానాధిపతులతో సిగ్నఫీకేసన్స్ లేకపోతే – బిజినెస్ బాగుటుంది. బిజినెస్ మాత్రమే వృత్తి గా ఉంటుంది.
- లగ్నం ఏదైనా సరే – లగ్నానికి సంబంధిచిన యోగ కారక గ్రహముతో – లగ్నానికి సిగ్నఫీకేసన్స్ బలంగా ఉంటె – ఫైనన్చియల్ సమస్యలు ఉండవు. మంచి ఎదుగుదల ఉంటుంది.
- రాహు, కేతు గ్రహాలు కాకుండా – మిగత 7గ్రహాలలో, 4 గ్రహాల కంటే ఎక్కువగా కేంద్ర, కోణ స్థానాలలో ఉండి, బలంగా ఉంటె – జీవతమంతా సంతోషముగా ఉంటాడు. కర్కాటక, సింహా, తుల రాశి వారికి ఇంకా బాగుంటుంది. అదృష్టాలు వరిస్తాయి.
- గురు మరియు చంద్ర అలాగే శని మరియు శుక్ర గ్రహాలు ఒకే రాశిలో స్థతి ఐన లేదా ఒపోజిట్ స్థానాలలో స్టితి ఐన మంచి ఉన్నత స్థానములో ఉంటారు.
- అన్ని రాశులలో కంటే కర్కాటక రాశిలో స్థితి ఐన గ్రహాలు సహజంగా పలితాలను ఇస్తాయి. ఈ కర్కాటక రాశిలో ఎన్ని ఎక్కువా గ్రహాలు ఉంటె అంత మంచిది. ఈ రూల్ 100% నిజం
Golden Rules – నీచ స్థానములో ఉన్న గ్రహాలు
- నీచ గ్రహాలు – 6.8,12 స్థానాలలో ఉంటె మంచి రాజ యోగం ఉంటుంది.
- సూర్య గ్రహం – నీచలో ఉండి, 8, 12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉండి – కుజ మరియు శని గ్రహాల దృష్టి ఉన్న లేదా సిగ్న్ఫికేసన్స్ ఉంటె – గవర్నమెంట్కు సంబంధిచిన విషయాలలో మంచి పలితాలు ఉండవు.
- సూర్య, చంద్ర గ్రహాలకు నీచలో ఉన్న శని గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది.
- నీచలో ఉన్న శని గ్రహము యొక్క సబ్ లార్డ్ తో సూర్య, చంద్ర గ్రహాలకు బలంగా సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. అలాగే రోగాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
- 11వ స్థానాధిపతి నీచ స్థానములో ఉండి – 6.8,12 స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ధనవంతుడు పేదవాడు అవుతాడు. ఒకవేళ నీచ స్థానములో లేకపోతే కాస్తా పరువలేదు అని చెప్పవచ్చు.
కేంద్ర స్థానాలు -1,4,7,10 కోణ స్థానాలు – 1,5,9 లాభ స్థానాలు – 2,11
రాశి చక్రములో – కేంద్ర, కోణ, లాభ స్థానాధిపతులు – కేంద్ర, కోణ, లాభ స్థానాలతో మరియు కేంద్ర, కోణ, లాభ స్థానాధిపతులతో – ఒకరికొకరికి సిగ్నఫీకేసన్స్ మంచి రాజ యోగం ఉంటుంది.
- 1వ స్థానాధిపతి – కేంద్ర, కోణ, లాభ స్థానాలలో, ఏ స్థానములో స్థితి అయిన – ఆ స్థానానికి సంబంధించిన పలితాలు బాగుంటాయి.
- 4వ స్థానాధిపతి -5, 7,9,10 & 11 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన – ఆ స్థానానికి సంబంధించిన పలితాలు బాగుంటాయి.
- 5వ స్థానాధిపతి -7,9,10 & 11 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన – ఆ స్థానానికి సంబంధించిన పలితాలు బాగుంటాయి.
- 2వ స్థానాధిపతి -4, 5, 7,10 & 11 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన – ఆ స్థానానికి సంబంధించిన పలితాలు బాగుంటాయి.
- 7వ స్థానాధిపతి -9,10 & 11 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన – ఆ స్థానానికి సంబంధించిన పలితాలు బాగుంటాయి.
- 9వ స్థానాధిపతి -10 & 11 స్థానాలలో ఏ స్థానములో స్థితి అయిన – ఆ స్థానానికి సంబంధించిన పలితాలు బాగుంటాయి.
- 10వ స్థానాధిపతి – 11వ స్థానములో నములో స్థితి అయి – ఈ రెండు గ్రహాలకు సిగ్నఫీకేసన్స్ ఉంటె వృతి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది.
- రాశి చక్రములో పైన వివరించిన ఈ 7 యోగాలలో ఎన్ని ఎక్కువ మ్యాచ్ అయితే – వారి జాతకము అంత బాగుటుంది. అంటే మహారాజ యోగం ఉంటుంది. ఫైనన్చియల్ స్టేటస్ బాగుంటుంది. వాహనాలు ఉంటాయి. సంఘములో మంచి పేరు ప్రతిష్టలు మరియు గుర్తింపు పొందిన హోదా ఉంటుంది. సంతానం మంచి అభివృద్దిలోకి వస్తారు. రాశి చక్రములో – ఈ కేంద్ర, కోణ మరియు లాభ స్థానాలను అధిపతుల మద్యన ఉన్న సిగ్నఫీకేసన్స్ బట్టి జాతకము ఎలా ఉంటుంది అని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు.
- కేంద్ర, కోణ మరియు లాభ స్థానాల యొక్క సబ్ లార్డ్స్ ను కూడా పరిగణలోకి తీసుకుని KP పద్దతిలో పైన వివరించిన రూల్స్ మ్యాచ్ అయితే – ప్రిడిక్షన్ 100% ఇంకా ఖచ్చితత్వం వస్తుంది.
Golden Rules – 10వ స్థానం
- 10వ స్థానాధిపతి 6వ స్థానములో స్థతి అయితే, బాల్యములో సమస్యలు ఉన్నప్పటికీ, 25 సంవత్సరాల తరువాత, మంచి ఆఫీసర్ స్థాయి పోజిసన్ లో ఉంటారు.
- 10వ స్థానాధిపతి కేంద్ర, కోణ స్థానలలో స్థతి అయిన లేదా 11వ స్థానములో స్థతి అయి – శుభ గ్రహాల దృష్టి ఉంటె, మంచి తెలివైన వ్యాపారి అవుతారు.
- 10వ స్థానాధిపతి కేంద్ర, కోణ స్థానలలో స్థతి అయిన లేదా 2వ స్థానములో స్థతి అయి, సూర్య లేదా కుజ లేదా శని గ్రహాల దృష్టి ఉంటె, మంచి రాజ యోగం ఉంటుంది.
- 10వ స్థానాధిపతి మరియు 3వ స్థానాధిపతి ఉండి, 3వ స్థానాధిపతి బలహీనంగా ఉంటె – నష్టాలు ఉంటాయి. జీవితములో ఎదుగుదల ఉండదు.
- 10వ స్థానాధిపతి, 10వ స్థానములో స్థతి అయి, శుభ గ్రహాల దృష్టి ఉంటె మంచి గుణం ఉంటుంది. అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె, అబ్బాయి / అమ్మాయి ఐన – మంచి గుణం ఉండదు. చెడు అలవాట్టు ఉంటాయి.
ఫైనాన్సియల్ ఆస్ట్రాలజీ
- ధన స్థానాలు – 2, 11
- లక్ష్మి స్థానాలు – 5, 9
- వైశ్య గ్రహాలు – చంద్ర & బుధ గ్రహాలు
- 1వ స్థానం – వ్యక్తిగత జీవితం, కస్టపడి పని చేయడం
- వ్యాపారానికి – 7వ స్థానం
- స్థిరాస్తులకు – 4వ స్థానం
- వృత్తి ఉద్యోగాలకు – 10వ స్థానం
- 2, 11 స్థానాధిపతులతో చంద్ర, బుధ గ్రహాలతో ఒకరికి ఒకరికి సిగ్నఫీకేసన్స్ ఉంటె – ధనయోగం ఇస్తుంది.
- లగ్నాధిపతి పదకొండవ అధిపతి తో కలిసి 11వ స్థానముతో లేదా అధిపతితో 1వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ధన సంపాదన బాగుటుంది.
- 4వ స్థానం / అధిపతి 11వ స్థానం లేదా 7వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుతుంది. ఈ స్థానాలకు కుజ మరియు శని గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ఇంకా మంచిది. ఈ గ్రహాలు స్థలాలకు, బిల్డింగ్స్ కారకత్వము వహిస్తాయి. అలాగే ఈ గ్రహాలకు చంద్ర, బుధ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – చంద్ర, బుధ, మరియు కుజ శని గ్రహాలకు చెందిన మహాదశ / భుక్తి కాలాలలో లాభాలు చాలా బాగుంటాయి
- 7వ స్థానం / అధిపతి 5, 10, 11 స్థానాలతో లేదా అధిపతులతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ఏ వ్యాపారమైన సరే ఆ వ్యాపారంలో నష్టాలు ఉండవు.
- 11వ స్థానాధిపతితో 2 మరియు 5 స్థానాధిపతులతో సిగ్నఫీకేసన్స్ ఉండి – ప్రత్యేకించి 11 వ స్థానములో ఏ గ్రహాలు స్థితి ఐన – ఈ గ్రహాలకు సంబంధించిన దశలో ధన సంపాదన బాగుటుంది.
- నీచంలో ఉన్న గ్రహాలు డబ్బునిస్తుంది కానీ మనశాంతి ఇవ్వవు. కావున నీచలో ఉన్న గ్రహాలతో ధన స్థానాలతో మరియు లక్ష్మి స్థానాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె మంచి పలితాలు ఉంటాయి.
- ఒకవేళ సిగ్నఫీకేసన్స్ లేకపోతే ధన సంపాదన ఉన్నప్పటికి ఆరోగ్య సమస్యలు మాత్రం ఉంటాయి.
- 5వ స్థానాధిపతి 1,5, 9 లో గాని 11 లో గాని 10 లో గాని ఉంటే ఫైనాన్సియల్ స్టేటస్ బాగుటుంది. ఈ అధిపతులు రాశి చక్రములో బలంగా ఉంటె ఇంకా మంచిది
గోల్డెన్ రూల్స్ – 2
- 5వ స్థానాధిపతి మరియు 10వ స్థానాధిపతి లేదా 10వ స్థానాధిపతి అమాత్య కారక గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – విద్యా సంస్థల ద్వారా ధన సంపాదన ఉంటుంది. విద్యా సంస్థలు స్థాపిస్తారు
- 10వ స్థానం / స్థానాధిపతి మరియు 11వ స్థానం / స్థానాధిపతి మీద అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ లేకపోతే – విద్యా సంస్థల ద్వారా ధన సంపాదన ఉంటుంది. విద్యా సంస్థలు స్థాపిస్తారు
- ఆత్మ కారక మరియు అమాత్య కారక గ్రహాలతో 10వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – విద్యా సంస్థల ద్వారా ధన సంపాదన ఉంటుంది. విద్యా సంస్థలు స్థాపిస్తారు
- చంద్ర గ్రహం ఆత్మ కారక గ్రహం అయి – లగ్నంలో స్థితి అయిన లేదా లగ్నాధిపతితో బలంగా సిగ్నఫీకేసన్స్ ఉన్న – ధన సంపాదన బాగుటుంది. ఫైనన్చియాల్ స్టేటస్ బాగుటుంది.
- 2వ స్థానములో శని గ్రహం ఉండి. సూర్య గ్రహముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె ధన సంపాదన ఉండదు. అప్పులు చేస్తారు. సూర్య గ్రహముతో సిగ్నఫీకేసన్స్ లేకపోతే బాగుటుంది.
- 1, 2 స్థానాధిపతులు రాశి చక్రములో ఎక్కడ ఉన్న ఈ గ్రహాలు బలంగా ఉంటే. ఎక్కువగా కష్ట పడకుండానే వ్యాపారం లో లాభాలు ఉంటాయి.
- 2, 3 స్థానాధిపతులు ఓకే రాశిలో స్థితి అయితే గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఈ గ్రహాల మీద శుభ గ్రహాల దృష్టి ఉంటే ఇంకా మంచిది
- 3, 4 స్థానాధిపతులు ఒకే రాశిలో స్థితి అయి.. ఈ గ్రహాలతో కుజ గ్రహం తో సిగీనిపీకేసన్స్ ఉంటే. మిలట్రీ లో మంచి ఉద్యోగం చేస్తారు
- 4, 5 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, శుక్ర గ్రహం బలంగా ఉంటే… ట్రావెల్స్ బిజినెస్ చేస్తారు
- 5, 6 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయితే.. అలసిపోకుండా ఎన్ని గంటలైనా వర్క్ చేస్తారు. బ్యాంక్ మరియు పోలీస్ జాబ్ చేసేవారిలో ఈ కాంబినేషన్ ఉంటుంది.
గోల్డెన్ రూల్స్ – 3
- 6, 7 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, కుజ, శని గ్రహాలతో లేదా 12వ స్థానాధిపతితో సిగ్నఫీకేసన్స్ ఉంటె- రెండవ వివహం జరుగుతుంది. లేదా విడిపోయి వేరేగా ఉంటారు.
- 7, 8 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, 11వ స్థానంతో లేదా అధిపతితో సిగ్నఫీకేసన్స్ ఉంటె – అనుకోకుండా ధన సంపాదన విషయములో అదృష్టాలు ఉంటాయి.
- 8, 9 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, 9వ స్థానం/ స్థానాధిపతి బలంగా లేకపోతే – అదృష్టాలు అంతగా ఉండవు
- 9, 10 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయితే – వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ది ఉంటుంది. ఈ స్థానాధిపతుల మీద శుభ గ్రహాల దృష్టి ఉంటె ఇంకా మంచిది. ధనవంతులందరి జాతకాలలో ఇదే కాంబినేషన్ ఉంటుంది.
- 10, 11 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయితే – చర, స్థిరాస్తులు ఎక్కువగా సంపంధించుకుంటారు. ఈ స్థానాలతో శని, కుజ గ్రహాలతో సిగ్నపీకేసన్స్ ఉంటె ఇంకా మంచిది.
గోల్డెన్ రూల్స్ – 4
- 11, 12 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి, ఈ స్థానాధిపతుల మీద లేదా 11, 12 స్థానాల మీద అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఏ వ్యాపారం చేసిన నష్టాలు ఉంటాయి. చేస్తున్న ఉద్యోగములో అభివృద్ధి ఉండదు.
- 1, 12 స్థానాధిపతులు ఏదైనా ఒక రాశిలో స్థితి అయి – ఈ స్థానాధిపతుల మీద లేదా ఈ స్థానాల మీద అశుభ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉంటె – ఏ వ్యాపారం చేసిన నష్టాలు ఉంటాయి. చేస్తున్న ఉద్యోగములో అభివృద్ధి ఉండదు.
- బుధ గ్రహం బలహీనంగా ఉన్న లేదా బుధ గ్రహం నుండి 12వ స్థానాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో బుధగ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె – పిసినారి
- అలాగే చంద్ర గ్రహం బలహీనంగా ఉన్న లేదాచంద్ర గ్రహం నుండి 12వ స్థానాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో చంద్ర గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె –మంచి మనస్సు ఉన్న వ్యక్తీ
- అలాగే శుక్ర గ్రహం బలహీనంగా ఉన్న లేదా శుక్ర గ్రహం నుండి 12వ స్థానాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో శుక్ర గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉండి అలాగే 7వ స్థానముతో సిగ్నఫీకేసన్స్ ఉంటె –అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి.
- గురు గ్రహం బలహీనంగా ఉన్న లేదా గురు గ్రహం నుండి 12వ స్థానాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో గురు గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె – మతపరమైన వక్రీకరణ మరియు మార్పిడులు చేస్తారు
- అలాగే శని గ్రహం బలహీనంగా ఉన్న లేదా శని గ్రహం నుండి 12వ స్థానాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో శని గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె – చేడు అలవాట్టు, చెడు స్నేహాలు ఉంటాయి
- అలాగే శని గ్రహం బలహీనంగా ఉన్న లేదా శని గ్రహం నుండి 12వ స్థానాధిపతి –ఏ గ్రహం అయితే ఆ గ్రహంతో శని గ్రహానికి సిగ్నఫీకేసన్స్ ఉంటె – చేడు అలవాట్టు, చెడు స్నేహాలు ఉంటాయి
- 12వ స్థానాధిపతి లేదా నక్షత్రాదిపతి 4 మరియు 7 స్థానాల కంటే బలంగా ఉంటె – వివాహ జీవితం సంతృప్తిగా ఉండదు
- 12వ స్థానాధిపతి లేదా నక్షత్రాదిపతి 2 మరియు 11 స్థానాల కంటే బలంగా ఉంటె – అప్పులు ఎక్కువగా ఉంటాయి.
గోల్డెన్ రూల్స్ – 5
- 1వ స్థానాధిపతి 2వ స్థానములో స్థతి అయితే – ఎడ్యుకేషన్ బాగుటుంది. ధన సంపాదన మరియు మంచి అలవాట్టు ఉంటాయి.
- ఒకవేళ 2వ స్థానాధిపతి లగ్నములో ఉంటె – కఠినమైన మనస్సు అంటే దయ ఉండదు. కుటుంబ సభ్యలతో కోపంతో ఉంటారు. ధన సంపాదన కూడా మాములుగానే ఉంటుంది. ఇతరులను మోసం చేయాలనే ఆలోచన ఉంటుంది.
- 2వ స్థానాధిపతి 3వ స్థానములో ఉంటె – దైర్యం, మరియు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి మనస్సు ఉంటుంది. మంచి నైపుణ్యం ఉంటుంది.
- ఒకవేళ 3వ స్థానాధిపతి 2వ స్థానములో ఉంటె – మంచి కండలు తిరిగిన శరీరం ఉంటుంది. కానీ మంచి మనసు ఉండదు. సోమరిగా మరియు సంతోషముగా ఉండరు. డబ్బు సంపాందించాలి అనే ఆలోచనలో ఉంటారు. అక్రమ సంబందాలు పెట్టుకుంటారు
- 3వ స్థానాధిపతి 4వ స్థానములో ఉంటె – ధనవంతుడు, తెలివైనవాడు ఎప్పుడు సంతోషముగా ఉంటాడు.
- ఒకవేళ 4వ స్థానాధిపతి 3వ స్థానములో ఉంటె – కస్టపడి సంపాదించుకుని ధనవంతుడు అవుతారు. దైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు సంతోషముగా ఉంటారు. కాకపోతే వీరికి ఎప్పుడు ఏదోఒక అనారోగ్య సమస్య వస్తుంది
గోల్డెన్ రూల్స్ – 6
- 5వ స్థానాధిపతి 6వ స్థానములో స్థతి అయితే – సంతానం విషయములో సమస్యలు ఉంటాయి. లేదా మొదటి సంతానం తల్లి తండ్రులకు వ్యతిరెంకగా ఉంటాడు. లేదా మృతువు కలిగే అవకశాలు ఉంటాయి. లేదా సంతానం లేకపోతే దత్తత తీసుకుంటారు
- ఒకవేళ 5, 6 స్థానాధిపతుల మీద శుభ గ్రహాల దృష్టి ఉంటె సంతానం విషయములో పైన వివరినచిన పలితాలు కాస్త పాజిటివ్ గా ఉంటాయి
- 6వ స్థానాధిపతి 7వ స్థానములో స్థతి అయితే – మంచి గుణాలు ఉంటాయి. ధన సంపాదన బాగుటుంది. మంచి పేరు ప్రాఖ్యాతలు వస్తాయి. వీరికి రెండవ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 6 & 7 స్థానాధిపతులలో ఏదైనా ఒక గ్రహము గురు, బుధ గ్రహాలు అయితే ఇంకా మంచిది.
- 7వ స్థానాధిపతి 8వ స్థానములో స్థతి అయితే – ప్రతి విషయానికి చిరాకు పడుతారు. వీరికి జబ్బులు కూడా ఎక్కువగా ఉంటాయి. చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి. వీరి జీవితములో సంతోషం అనేది ఉండదు.
- ఒకవేళ 8వ స్థానాధిపతి 7వ స్థానములో స్థతి అయితే – దేవుడి మీద నమ్మకము ఉండదు. పొట్టకు సంబందించిన సమస్యలు ఉంటాయి. భార్య వలన మానసికంగా కృంగిపోతరు. లేదా భార్య చనిపోవడం వలన బాధలు ఉంటాయి.
- 9వ స్థానాధిపతి 10వ స్థానములో స్థతి అయితే – ధర్మపరులుగా ఉంటారు. కోపం ఉండదు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. చాలా దైర్యంగా పనులు చేస్తారు. అలాగే విజయం కూడా వరిస్తుంది.
- అలాగే 10వ స్థానాధిపతి 9వ స్థానములో స్థతి అయితే – మంచి పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తిగా చలామణి అవుతారు. ఫైనాన్సియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. కానీ వీరికి మనశాంతి లేక బాధ పడుతుంటారు.
- 10వ స్థానాధిపతి 11వ స్థానములో స్థతి అయితే – నీజాయితీ గల వ్యక్తులు. ధనవంతుడు. భార్య పిల్లలతో ఆనందంగా అలగే అన్ని సౌకర్యాలతో జీవితమంతా హయిగా ఉంటారు.
- అలాగే 11వ స్థానాధిపతి 10వ స్థానములో స్థతి అయితే – ధర్మపరులు, ధనవంతుడు, మంచి గుర్తింపు మరియు పరువు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి, సహాయం చేసే గుణం ఉంటుంది. అందరు గౌరవిస్తారు.
- 11వ స్థానాధిపతి 12వ స్థానములో స్థతి అయితే – అబ్బాయి కైనా లేదా అమ్మాయి కైనా సరే చెడు స్నేహాలు ఉంటాయి. అలాగే నైతికంగా దిగజారిపోతారు
గోల్డెన్ రూల్స్ – 7
- 12వ స్థానాధిపతి 1వ స్థానములో స్థతి అయితే – ఫైనన్చియల్, శారీరంకంగా మరియు కుటుంబంలో ఏలాంటి సంతోషం ఉండదు.
- అలాగే 12వ స్థానాధిపతి 1వ స్థానములో స్థతి అయితే – దొంగ, జూదగాడు, అమ్మాయిల వెంట తిరగడం, పిసినారి
- 11వ స్థానాధిపతి 3వ స్థానములో స్థతి అయితే, మంచి మాటలతో ఆకర్షించే గుణం మరియు మాటకారి, అలాగే ఆకర్షించే ముఖ వర్ఛస్సు, అనుకున్నది సాదించాలి అనే మంచి ఆలోచనతో ఉంటాడు, అలాగే సాదిస్తాడు. కస్టపడి పని చేసే గుణం, స్వంతగా పెద్ద పెద్ద సంస్తలను స్థాపించ గలిగే సామర్ద్యం ఉంటుంది.
- 11వ స్థానాధిపతి 6,8 స్థానలలో స్థతి అయి- సూర్య, కుజ, శని గ్రహాలతో బలంగా సిగ్నఫీకేసన్స్ ఉంటె – మంచి పలితాలు ఉంటాయి. ఈ పలితాలు కూడా మనం ఉహించనంతగా ఉంటాయి.
- అలాగే 11వ స్థానాధిపతి 8వ స్థానములో స్థతి అయి, సూర్య, కుజ మరియు శని గ్రహాలలో ఏ గ్రహం బలంగా ఉంటె – ఆ గ్రహానికి సంబంధించిన మహాదశ బాగుటుంది. ఒకవేళ ఈ గ్రహాలతో 2/6 axis లో సిగ్నఫీకేసన్స్ ఉంటె ఆ మహాదశ, బాగుండదు. ఈ రూల్ 100% కరెక్ట్.
ఆస్ట్రాలజీ పిడిఎఫ్ ఫైల్స్ : https://nsteluguastrology.com/astro-pdf-files/
NS Telugu Astrology You Tube Link : https://www.youtube.com/nsteluguworld
Aryan Astrology Research Center : https://aryanastrologyresearchcentre.blogspot.com/