అధిపతి – శుక్ర గ్రహం
- వృషభ రాశి స్థిర రాశి మరియు భూతత్వ రాశి కావడం చేత స్థిరమైన ఆలచనతో ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కావున సంకల్ప బలంతో విజయం వరిస్తుంది.
- ప్రతి విషయంలో మంచి ప్రణాళికతో ఉండి విజయం వైపు ప్రయాణిస్తారు.
- నీతి నీజాయితిగా ఉండే మనస్తత్వం.
- అలాగే వీరు సహజంగా విలాసవంతంగా, సౌకర్యంగా ఉండాలనుకుంటారు.
వృత్తి
- ఫైనాన్సియల్ బిజినెస్, కమిషన్ ఏజెంట్స్
- ఆహార పదార్థాలు, హోటల్ బిజినెస్
- సినిమా రంగం, సంగీతం, సుగంధ ద్రవ్యాలు
ధన సంపాదన
- వృషభ రాశికి అధిపతి అయిన శుక్ర గ్రహానికి బుధ, శని గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ఫైనాన్సియల్ స్టేటస్ బాగుంటుంది.
- గురు, శుక్ర గ్రహాలు 4వ స్థానానికి ధన సంపాదన విషయానికి కారకత్వం వహిస్తారు.
- కావున శుక్ర గ్రహానికి 4వ స్థానంతో సిగ్నిఫికేసన్స్ ఉండి గురు గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – ధన సంపాదన చాల బాగుంటుంది. వీరు ఏ వ్యాపారం చేసిన లాభాలు ఉంటాయి అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.
ఆరోగ్యం
- వృషభ రాశి – ముఖం మరియు గొంతు, మెడ విషయానికి కారకత్వం వహిస్తుంది.
- కావున గొంతుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.
శుక్ర గ్రహం రాశి చక్రంలో బలహీనంగా ఉంటె – థైరాయిడ్ మరియు ముఖం మీద మచ్చలు వచ్చి అందవికారంగా ఉంటారు.
అదృష్ట సంఖ్యలు
- 5, 6
Zodiac Signs : https://nsteluguastrology.com/category/zodiac-signs/
You Tube Channel : https://www.youtube.com/nsteluguastrology
Astrology Articles : https://nsteluguastrology.com/astrology-articles/