వృత్తి ఉద్యోగాలు – Professions

వృత్తి ఉద్యోగాలు – Professions

Astrology Professions Rules

రాశి చక్రములో 10వ స్థానం –ఈ స్థానం   వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది.

10వ స్థానానికి శని గ్రహము – వృత్తి ఉద్యోగాల విషయానికి కారకత్వం వహిస్తాడు. అలాగే కస్టపడి పని చేయడము గురించి కారకత్వం వహిస్తాడు.

అలాగే 10వ స్థానానికి    సూర్య గ్రహము     ర్యాంక్ అనే విషయానికి కారకత్వం వహిస్తాడు.

అలాగే 10వ స్థానానికి     బుధ గ్రహము       చేస్తున్న వృత్తి ఏమిటి అనే విషయానికి కారకత్వం వహిస్తాడు.

అలాగే 10వ స్థానానికి     గురు గ్రహము       మేనేజ్మెంట్ (Management)

అలాగే 10వ స్థానానికి     కుజ గ్రహము        కార్యనిర్వాహక అధికారం గురించి తెలియజేస్తుంది.

వృత్తి ఉద్యోగాల విషయానికి – రాశి చక్రములో ఈ గ్రహాలు బలంగా ఉన్నాయా లేదా చూడాలి. అలాగే 10వ స్థానానికి లేదా 10వ స్థానాధిపతితో ఈ గ్రహాలతో సిగ్నఫీకేసన్స్ ఉన్నాయా లేదా చూడాలి

 

గ్రహములు – వృత్తికి సంబంధించిన కారకత్వాలు

  1. రవి – గవర్నమెంట్ ఉద్యోగము, వైద్య సంబంధ వృత్తి, పరిపాలనా శాఖలు, మొదలగునవి.
  2. చంద్రుడు – నీటి ద్వారా లభ్యమయ్యే వాటి వల్ల వ్యాపారము, వ్యయసాయము మొదలగునవి.
  3. కుజుడు – పొలిసు డిపార్ట్ మెంట్, మిలిటరి, లోహ సంబంధ పరిశ్రమలందు, విద్యుత్ శాఖ, ఇంజనీరింగ్ మొదలగునవి
  4. బుధుడు – పుస్తక ప్రచురణ, తీర్పు చెప్పుట, వ్యాపార రంగము, క్లరికల్, కమ్యునికేషన్ మొదలైనవి.
  5. గురువు – ఉపాద్యాయ రంగము, పాండిత్యము, పోరోహిత్యము, ముద్రణ, ప్రవచానకర్త మొదలగునవి.
  6. శుక్రుడు – న్యాయ రంగము, కవిత్వము, శిల్పవిద్య, రాజకీయ రంగము, మధ్యవర్తిత్వము, పాట కచేరీలు, లలిత కళలు మొదలగునవి.
  7. శని –  సేవకా వృత్తి, కర్మాగారములో ఉద్యోగాలు, చర్మ సంబంధ వృత్తులు, నూనె వ్యాపారము, భూ సంబంధ వ్యవహారాలు మొదలగునవి.
  8. రాహువు – అధికారము, చౌర్యము, చిత్రమైన వృత్తులు, కమ్యునికేషన్,, మొదలగునవి.
  9. కేతువు – వేదాంత, ప్రవచనాలు, సదా ప్రయాణాలు చేయు వృత్తులు మొదలగునవి.

 

వృత్తులు – గ్రహముల సమ సప్తకముల ద్వారా అంటే 1/7 Axis

  1. రవి, కుజ గ్రహాలు – ఈ గ్రహాలు  సహజ  మిత్రులు. ఒకరి మీద ఒకరికి దృష్టి ఉంటె – అనగా  సమ సప్తకములో ఉంటె ఈ గ్రహాలకు బలం వస్తుంది. రాజకీయ రంగంలో రాణిస్తారు, పోలీసు, మిలిటరీ, లేదా  మెడికల్ వృత్తి యందు రాణించు అవకాశము కలదు.
  2. రవి, గురు గ్రహాలు – వీరు సహజ మిత్రులు .ఒకరు ఆత్మ కారకుడు, మరొకరు జ్ఞాన కారకుడు. వీరు బలము కలిగి శభ స్థానాలలో వుండిన మంచి అధికారము కలిగిన ఉద్యోగము, వేద విద్య సంబంధ వృత్తి, భక్తి జ్ఞానములను బోధించు వృత్తులు కలుగును.
  3. రవి /శని  గ్రహాలు- వీరు సహజ పాపులు. కావున ఈ గ్రహాలు ఒకరి నక్షత్రంలో ఒకరు స్థితి అయితే ఈ గ్రహాలకు బలం వస్తుంది. వీరికి సమాన బలము కలిగి ఇద్దరు అనుకూలమైన రాజకీయ సంబంధ, వేదాంత, వైరాగ్య సంబంధిత వృత్తులు కలుగును. అయితే రవి శనుల యొక్క స్థితులను, బలములను బాగుగా పరిశీలించాలి.
  4. చంద్ర, బుధ గ్రహాలు – ఈ రెండు గ్రహములు వ్యాపార సంబంధ గ్రహములు. ఈ గ్రహాలు  బలముగా వుండి శుభ స్థానములో స్థితి పొందిన వ్యాపార రంగము, మంచి గుర్తింపు పోందే వృత్తులు, బట్టల వ్యాపారమందు వృత్తులు కలుగును.
  5. చంద్ర, శుక్ర గ్రహాలు – వీరు శుభులై బలము కల్గి ఉన్న వాహన సంబంధ ( రవాణా సంబంధ), సౌందర్య పోషణా రంగములోని వృత్తులు, నీటి సంబంధిత వృత్తులు కలుగును. రచనా రంగము, లలిత కళలకు సంబంధించిన రంగము లందు వృత్తులు కలుగును.
  6. చంద్ర, గురు గ్రహాలు – వీరు యిద్దరు మిత్రులు. వీరి సమసప్తకము గజకెసరీ యోగముగా చెప్పబడుతుంది. ఈ గ్రహాలు బలముగా  ఉండి శుభ స్థాన స్థితి పొందిన ఉన్నత ఉద్యోగము కలుగును. సాధారణముగా ఈ స్థితి కలిగిన వారు ఏ వృత్తిలో ఉన్నను బాగుగా గుర్తింపు పొందుతారు.
  7. చంద్ర, కుజ గ్రహాలు – వీరి సమ సప్తకము అనగా 1/7 దృష్టి  చంద్ర మంగళ  యోగముగా చెప్పబడును. ఈ విదంగా 1/7 దృష్టి ఉండి ఒకరినక్షత్రములో ఒకరు ఉంటె ఈ యోగము యొక్క బలం రెట్టింపు అవుతుంది. మందుల వ్యాపార రంగమందు, వైద్య వృత్తి, భూ సంబంధ వ్యాపార రంగ మందు వృత్తి కలుగును.
  8. కుజ, గురు గ్రహాలు – వీరిద్దరు సహజ మిత్రులు. వీరి సమ సప్తకము శుభకరముగా ఉన్న భూ సంబంధ, వ్యయసాయ, న్యాయ సంబంధ, వృత్తులు కలుగును. చేయు వృత్తులందు మంచి అభివృద్ధి కలుగును.
  9. గురు, శని గ్రహాలు – వీరి సమ సప్తకము వారి వారి బలములను బట్టి వృత్తిలో ప్రావీణ్యత కలుగును. గ్రంధ రచయిత, పబ్లిషర్ అయ్యే ఆకాశము కలుగును. రిసర్త్చ్ రంగ మందు ప్రవేశము లేదా రీసర్చ్ చేసి పిహెచ్ డి పొందే అవకాశ ముండును.  జ్ఞాన వైరాగ్య విషయము లందు ప్రావీణ్యత కలుగును.
  10. శని, బుధ గ్రహాలు – వీరిద్దరు సహజ మిత్రులు. అలాగే ఈ గ్రహాలు బలంగా ఉండి, సమ సప్తకములో వున్న రచనా రంగ మందు మరియు నాటక, రేడియో రంగమందు ప్రవేశము కలుగును. సంభాషణలు వ్రాయుట యందు నైపుణ్యము కలిగి యుందురు.

 

ప్రదానమైన విషయం

  • పైన వివరించిన ఈ గ్రహాలు 1/7 Axis లో ఉండి – ఈ గ్రహాలు 5డీగ్రీల లోపు ఉంటె ఇంకా మంచిది.

NS Telugu You Tube Channel : https://www.youtube.com/nsteluguworld

KP హోరారీ ఆస్ట్రాలజీ లింక్ : https://nsteluguastrology.com/category/articles/horary-astrology/