1. ఆదివారం – సూర్య గ్రహం
- జపాకుసుమ సంకాశం,
- కాశ్యపేయం మహద్యుతిమ్ |
- తమోరిం సర్వపాపఘ్నం,
- ప్రణతోస్మి దివాకరమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి ఆదివారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం సూర్య మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా సూర్య భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 6000 వేల సార్లు జపించాలి.
సూర్య గ్రహం 1వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది.
- ఏ నెలలోనైనా 1,10,19,28 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 6000 వేల సార్లు జపించవచ్చు.
2. సోమవారం – చంద్ర గ్రహం
- దధిశంఖ తుషారాభం,
- క్షీరోదార్ణవ సంభవమ్ |
- నమామి శశినం సోమం,
- శంభోర్ముకుట భూషణమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి సోమవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం చంద్ర మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా చంద్ర భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 10000 వేల సార్లు జపించాలి
చంద్ర గ్రహం 2వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది.
- ఏ నెలలోనైనా 2,11,20,29 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 10000 వేల సార్లు జపించవచ్చు.
3. మంగళవారం – కుజ గ్రహం
- ధరణీ గర్భ సంభూతం,
- విద్యుత్కాంతి సమప్రభమ్ |
- కుమారం శక్తిహస్తం,
- తం మంగళం ప్రణమామ్యహమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం కుజ మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా కుజ భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 7000 వేల సార్లు జపించాలి
కుజ గ్రహం 9వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది.
- ఏ నెలలోనైనా 9,18,27 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 6000 వేల సార్లు జపించవచ్చు.
4. బుధవారం – బుధ గ్రహం
- ప్రియంగు కలికాశ్యామం,
- రూపేణా ప్రతిమం బుధమ్ |
- సౌమ్యం సౌమ్య గుణోపేతం,
- తం బుధం ప్రణమామ్యహమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి బుధవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం బుధ మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా బుధ భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 17000 వేల సార్లు జపించాలి.
బుధ గ్రహం 5వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది
- ఏ నెలలోనైనా 5,14,23 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 17000 వేల సార్లు జపించవచ్చు.
5. గురువారం – గురు గ్రహం
- దేవానాంచ ఋషీణాంచ,
- గురు కాంచన సన్నిభమ్ |
- బుద్ధి భూతం త్రిలోకేశం,
- తం నమామి బృహస్పతిమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి గురువారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం గురు మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా గురు భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 16000 వేల సార్లు జపించాలి
గురు గ్రహం 3వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది.
- ఏ నెలలోనైనా 9,18,27 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 6000 వేల సార్లు జపించవచ్చు.
6. శుక్రవారం – శుక్ర గ్రహం
- హిమకుంద మృణాలాభం,
- దైత్యానాం పరమం గురుమ్ |
- సర్వశాస్త్ర ప్రవక్తారం,
- భార్గవం ప్రణమామ్యహమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా శుక్ర భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 20000 వేల సార్లు జపించాలి
శుక్ర గ్రహం 6వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది.
- ఏ నెలలోనైనా 6,15,26 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 20000 వేల సార్లు జపించవచ్చు.
7. శనివారం – శని గ్రహం
- నీలాంజన సమాభాసం,
- రవిపుత్రం యమాగ్రజమ్ |
- ఛాయా మార్తండ సంభూతం,
- తం నమామి శనైశ్చరమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి శనివారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం శని మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా శని భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 19000 వేల సార్లు జపించాలి.
శనిగ్రహం 8వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది.
- ఏ నెలలోనైనా 8,17,26 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 19000 వేల సార్లు జపించవచ్చు.
8. రాహు గ్రహం
- అర్ధకాయం మహావీర్యం,
- చంద్రాదిత్య విమర్దనమ్ |
- సింహికాగర్భ సంభూతం
- తం రాహుం ప్రణమామ్యహమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి సోమవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం రాహు మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా రాహు భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 18000 వేల సార్లు జపించాలి.
రాహు గ్రహం 4వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది.
- ఏ నెలలోనైనా 4,13,22,31 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 18000 వేల సార్లు జపించవచ్చు.
9.కేతు గ్రహం
- పలాశపుష్ప సంకాశం,
- తారకాగ్రహ మస్తకమ్ |
- రౌద్రం రౌద్రాత్మకం ఘోరం,
- తం కేతుం ప్రణమామ్యహమ్ ||
ఈ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం 108 సార్లు జపించాలి. అలాగే ప్రస్తుతం కేతు మహాదశ నడుస్తున్న వారు లేదా ఏ మహాదశలోనైనా కేతు భుక్తి నడుస్తున్న వారు ఈ స్తోత్రాన్ని 7000 వేల సార్లు జపించాలి.
కేతు గ్రహం 7వ సంఖ్యాకు ఆధిపత్యం వహిస్తుంది
- ఏ నెలలోనైనా 7,16,25 వ తేదీలలో జన్మించిన వారు ఈ మంత్రాన్ని 7000 వేల సార్లు జపించవచ్చు.
ఈ నవగ్రహ స్తోత్ర మంత్రాలు జపించడం వలన ఆర్థిక సమస్యలు మనస్సులోని కోరికలు నెరవేరుతాయి.
సంకల్ప బలంతో జపించడం వలన మనస్సులోని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం కూడా చేయాలి. సంకల్పంతో చేసే నవగ్రహ స్తోత్రానికి ధ్యానం తోడైతే ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఇది అక్షర సత్యం.
జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/articles/astro-remedies-telugu/
NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguworld
Aryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.blogspot.com/