Horary Astrology – Necklace
ఫిబ్రవరి 21, 2021 రోజున ఉదయం 10 గంటలకు,
తన నెక్లెస్ కనిపించడం లేదని నా భార్య ప్రమీల చెప్పడం జరిగింది.
హోరారీ ప్రశ్న జ్యోతిష్య పద్దతిలో – నెక్లెస్ ఇంట్లో ఉందా లేదా తెలుసుకోవటానికి, 1 నుండి 249 నెంబర్స్ మధ్యలో 55 వ నెంబర్ తీసుకున్నాను.
హోరారీ ప్రశ్న : నెక్లెస్ దొరుకుతుందా లేదా?
హోరారీ నెంబర్ : 55
చార్టు వేసుకున్న తేదీ : 21-02-2021
చార్టు వేసుకున్న సమయం : 01:03:47 PM
చార్టు వేసుకున్నస్థలం : Zahirabad
కె పి రూల్ : 6వ స్థానం సబ్ లార్డ్ కు – 2,6,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 2,6,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో వస్తువు దొరుకుతుంది.
- 2వ స్థానం : నగలు
- 6వ స్థానం : వస్తువు పోవడం లేదా దొగతనం జరగడం
- 11వ స్థానం : లాభాలు
ఇక్కడ 55వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు.
చంద్ర గ్రహం : 2వ స్థానానికి అధిపతి.
- 12వ స్థానం వృషభ రాశిలో కుజ నక్షత్రం / రాహు సబ్ లో ఉంది.
- కుజ గ్రహం 11వ స్థానం మేష రాశిలో ఉన్నాడు. అలాగే 6, 11 స్థానాలకు అధిపతి.
- రాహు గ్రహం చంద్ర నక్షత్రంలో స్థితి, కావున 2, 12 స్థానాలలో బలంగా ఉన్నాడు.
- చంద్ర గ్రహం యొక్క సిగ్నిఫికేషన్స్ ప్రశ్న యొక్క మైండ్ గురించి చాల స్పష్టంగా తెలియజేస్తుంది.
విశ్లేషణ పద్ధతి
- 6వ స్థానం సబ్ లార్డ్ కేతు – బుధ నక్షత్రం / సూర్య సబ్ లో ఉంది.
- కేతు గ్రహం 6వ స్థానంలో ఉంది.
- బుధ గ్రహం 8వ స్థానం మకర రాశిలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు
- బుధ గ్రహం 1, 4 స్థానాలకు అధిపతి.
- బుధ గ్రహం చంద్ర నక్షత్రంలో స్థితి కావున 2, 12 స్థానాలలో బలంగా ఉన్నాడు.
- సూర్య గ్రహం 9వ స్థానం కుంభ రాశిలో స్థితి. 3వ స్థానానికి అధిపతి.
- 6వ స్థానం సబ్ లార్డ్ కేతు గ్రహానికి – 6, 8, 1,4, 2,12, 3,9 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- 11వ స్థానంతో సిగినిఫికేషన్ రాకపోయినప్పటికీ 2,6 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ రావడం చేత నెక్లెస్ దొరుకుతుందని చెప్పవచ్చు.
2, 6,11 స్థానాలు సిగ్నిఫికేటర్స్
- 2, 6,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్ – చంద్ర, కుజ, గురు, బుధ, శుక్ర, శని మరియు రాహు కేతు గ్రహాలు.
- 9 గ్రహాలలో 8గ్రహాలు 2,6,11 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ అయ్యారు.
- ఒక సూర్య గ్రహం తప్ప మిగిలిన గ్రహాలన్నీ 2, 6,11 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ అవ్వడం – ఫలితాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు.
ప్రస్తుత దశ విశ్లేషణ పద్ధతి
ప్రస్తుతం కుజ మహా దశ / రాహు భుక్తి / శుక్ర అంతర / శని సూక్ష్మ – ఫిబ్రవరి 21, 2021 నుండి – మర్చి 3, 2021
- మహాదశ కుజ గ్రహం – 11వ స్థానంలో ఉంది. 6,12 స్థానాలకు అధిపతి. సూర్య నక్షత్రంలో ఉంది కావున 3,9 స్థానాలకు కూడా సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- భుక్తి అధిపతి రాహు గ్రహం – 12వ స్థానంలో చంద్ర నక్షత్రంలో ఉంది. కావున 2వ స్థానంతో బలంగా సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- అంతర అధిపతి శుక్ర గ్రహం – 12వ స్థానానికి అధిపతి అయినప్పటికీ, 8వ స్థానంలో కుజ నక్షత్రంలో స్థితి కావటం చేత 6, 11 స్థానాలలో స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఐంది.
- సూక్ష్మ అధిపతి శని గ్రహం – 8వ స్థానానికి అధిపతి అయినప్పటికీ, చంద్ర నక్షత్రంలో ఉండటం చేత, 2వ స్థానానికి సిగ్నిఫికేటర్ అయ్యాడు.
- ప్రస్తుతం జరుగుతున్నదశ, భుక్తి, అంతర మరియు సూక్ష్మ కాలాల అధిపతులు 2,6,11 స్థానాలకు సిగ్నిఫికెటర్స్ అయ్యారు. కావున నెక్లెస్ ఫిబ్రవరి 21, 2021 నుండి – మర్చి 3, 2021 మధ్యలో దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
హోరారీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్ https://nsteluguastrology.com/horary-astrology-rules/
ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది https://www.youtube.com/nsteluguworld