హోరారీ ఆస్ట్రాలజీ రూల్స్

హోరారీ ఆస్ట్రాలజీ రూల్స్

KP Horary Astrology – ప్రశ్న జ్యోతిష్యములో

 1. 1 నుండి 249 సబ్ నెంబర్స్ ఉంటాయి. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఈ 1 నుండి 249 సంఖ్యలలో ఏదో ఒక సంఖ్యా చెప్పడము జరుగుతుంది. ఈ నెంబర్ ప్రకారము జ్యోతిష్యుడు తన  స్థలము నుండి ఏ సమయానికి చార్ట్ వేస్తె ఈ సమయము ప్రకారము చార్ట్ వేసుకోవాలి.
 2. 1 నుండి 249 సంఖ్యలకు ఏ లగ్నం వస్తుంది? దీనికి సంబంధించిన పిడిఎఫ్ ఫైల్స్ లో Sub Lord Table పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక్కడ పిడిఎఫ్ ఫైల్స్ లింక్ ఇవ్వడం జరిగింది గమనించగలరు. https://nsteluguastrology.com/astro-pdf-files/
 3. హోరారీ చార్ట్ వేసుకున్నాతరువాత , వారు అడిగిన ప్రశ్నకు సంబందించిన స్థానాలతోటి చంద్ర గ్రహానికి సిగ్నిఫికేషన్స్ సంబందాలు ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ రేలషన్ వుంటే ప్రశ్నకు సంబందించిన స్థానాలతోటి వీశ్లేషణ చేసి ఆ ఈవెంట్ జరుగుతుందా లేదా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ లేకపోతే ఆ హోరారి రాశి చ(కాన్ని వీశ్లేషణ చేయలిసిన అవసరము లేదు.
 4. ఈ హోరారి జ్యోతిష్యములో ఈవెంట్కు చెందిన దశ భుక్తి కాలాలకు చెందిన గ్రహాలు వక్ర మార్గములో వుంటే ఆ వక్ర మార్గములో వున్నా గ్రహాలు సరైనా మార్గములోకి వచ్చిన తరువాత ఆ ఈవెంట్ జరుగుతుంది.
 5. హోరారి చార్ట్ వేసుకున్నాక, ప్రశ్న అడిగిన వ్యక్తి చెప్పిన సంఖ్యా ప్రకారము లగ్నం అవుతుంది. అలాగే ఏ సమయానికి చార్ట్ వేసుకుంటే ఆ సమయము ప్రకారము లగ్నం వుంటుంది.

పాలక గ్రహాలు – Ruling Planets

 1. హోరారీ చార్టు వేసుకున్న సమయం ప్రకారం వచ్చిన, లగ్నానికి చెందిన సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, అలాగే చంద్ర గ్రహానికి సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, అలాగే వీటితో పాటు ఏ రోజు చార్ట్ వేసుకుంటే ఆ రోజుకు చెందిన లార్డ్.
 2. ఈ 9 గ్రహాలను Ruling Planets అంటారు. ఈ 9 Ruling Planets ద్వార  కూడా ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పవచ్చు.
 3. ఈ రూలింగ్ ప్లానేట్స్ ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వడంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి.

 

తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నవ్యక్తి –

తనకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ? అని ప్రశ్నఇచ్చి 43వ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ ప్రకారం ఇక్కడ హోరారీ చార్ట్ కింద ఇవ్వడం జరిగింది గమనించగలరు.

Horary Number          :         43

Date of Judgement    :         20-02-2021, శనివారం

Time of Judgement    :         11.22:23

Place of Judgement   :         Zahirabad

 

 

ప్రశ్న : ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ?

కే పి రూల్ – 6వ స్థానం సబ్ లార్డ్ – 2,6,10,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె – 2,6,10,11 సిగ్నిఫికేటర్స్ దశ, భుక్తి, అంతర కాలములో ప్రమోషన్ వస్తుంది.

కావున విశ్లేషణ చేయదని ముందు, చంద్ర గ్రహానికి 2,6,10,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చిన తరువాతనే, 6వ స్థానం సబ్ లార్డ్ ను పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేయాలి.

43వ నెంబర్ ప్రకారం లగ్నం మిథున లగ్నం అవుతుంది. ఈ 1 నుండి 249 నెంబర్స్ ప్రకారం ఏ లగ్నం వస్తుంది అనే పిడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయడం జరిగింది. పిడిఎఫ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

పాలక గ్రహాలు (Ruling Planets) ఏమిటనే విషయానికొస్తే

సమయం : 11:22:23 AM, Zahirabad స్థలం నుండి హోరారీ చార్టు వేసుకున్నాను. కావున ఈ సమయానికి లగ్నం వృషభ రాశి అవుతుంది.

కావున లగ్నం ప్రకారం

 1. సైన్ లార్డ్ : శుక్ర
 2. స్టార్ లార్డ్ : సూర్య
 3. సబ్ లార్డ్ : రాహు
 4. సబ్ సబ్ లార్డ్ : శుక్ర

అలాగే చంద్ర గ్రహం స్థితి ప్రకారం

 1. సైన్ లార్డ్ : శుక్ర
 2. స్టార్ లార్డ్ : చంద్ర
 3. సబ్ లార్డ్ : రాహు
 4. సబ్ సబ్ లార్డ్ : బుధ

డే లార్డ్ : శనివారం – శని

ఈ 9 గ్రహాలనే రూలింగ్ ప్లానేట్స్ అంటారు.

తెలుగు యూట్యూబ్ ఆస్ట్రాలజీ లింక్ – వేదిక్ & KP ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ, వీడియోలు ఉంటాయి. https://www.youtube.com/nsteluguworld