KP హోరారీ ఆస్ట్రాలజీ – ప్రేమ వివాహం

KP హోరారీ ఆస్ట్రాలజీ – ప్రేమ వివాహం

KP హోరారీ ఆస్ట్రాలజీ నెంబర్ 32 – ప్రేమ వివాహం

నేను ఒక అబ్బాయిని ఒక సంవత్సరం ప్రేమించాను. పెద్దల అంగీకారంతో మా ప్రేమ వివాహం జరుగుతుందా లేదా ? ఒకవేళ జరిగితే ఎప్పుడు జరుగుతుంది?

హోరారీ ప్రశ్న నెంబర్            :    ప్రేమ వివాహం
హోరారీ నెంబర్                       :    32
చార్టు వేసుకున్న తేదీ               :    05-06-2021
చార్టు వేసుకున్న సమయం     :    11:45:42 PM
చార్టు వేసుకున్నస్థలం             :     Zahirabad

కె పి రూల్ :

5వ స్థానం సబ్ లార్డ్ కు – 2,5,7,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 2,5,7,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో ప్రేమ వివాహం జరుగుతుంది.

అదనంగా 3వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె పెద్దల అంగీకారంతో జరుగుతుంది.

  • 2వ స్థానం కుటుంబం
  • 5వ స్థానం ప్రేమ
  • 7వ స్థానం వివాహం, జీవిత భాగస్వామి
  • 11వ స్థానం స్నేహం, కమ్యూనికేషన్స్
  • 3వ స్థానం పెద్దల అంగీకారం
  • 8వ స్థానం మాంగల్యం – ఇది అమ్మాయి చార్ట్ కావున 8వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఇంకా మంచిది

ఇక్కడ అమ్మాయి ఇచ్చిన 32వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు.

చంద్ర గ్రహం 3వ స్థానానికి అధిపతి

  • 11వ స్థానం మీనా రాశిలో బుధ గ్రహానికి చెందిన రేవతి నక్షత్రంలో స్థితి.
  • బుధ గ్రహం 2, 5 స్థానాలకు అధిపతి
  • చంద్ర గ్రహానికి 2,5 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ రావడం చేత హోరారీ ప్రశ్న అడిగిన జాతకురాలి మైండ్ చాలా స్పష్టంగా ప్రేమ వివాహం జరుగుతుందా లేదా అని తెలియజేస్తుంది.

విశ్లేషణ పద్ధతి

5వ స్థానం సబ్ లార్డ్ శని – చంద్ర నక్షత్రం / బుధ సబ్ లో ఉంది.కావున 5వ స్థానానికి ఈ గ్రహాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.

  1. శని గ్రహం 9వ స్థానంలో స్థితి. 9,10 స్థానాలకు అధిపతి.
  2. చంద్ర గ్రహం 11వ స్థానంలో స్థితి. 3వ స్థానానికి అధిపతి.
  3. చంద్ర గ్రహం బుధ నక్షత్రంలో స్థితి కావడం చేత 2,5 స్థానాలలో బలంగా ఉంది.
  4. బుధ గ్రహం 1వ స్థానం వృషభ రాశిలో కుజ నక్షత్రంలో స్థితి, 2, 5 స్థానాలకు అధిపతి.
  5. కుజ గ్రహం 7, 12 స్థానాలను అధిపతి, 3వ స్థానంలో స్థితి అయ్యాడు, కావున బుధ గ్రహానికి ఈ స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయని అర్థం చేసుకోగలరు.
  6. 5వ స్థానానికి 2,3,5,7,9,10,11,12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి. కావున ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతో జరుగుతుంది. ఎందుకంటె చంద్ర, బుధ గ్రహాలకు 3వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.

ఎప్పుడు జరుగుతుంది ?

  • ప్రస్తుత దశ విశ్లేషణ పద్ధతి
    ప్రస్తుతం బుధ మహాదశలో / రాహు భుక్తి / గురు అంతర –
    ఆగష్టు 10, 2021 నుండి డిసెంబర్ 13, 2021
  • మహాదశ బుధ గ్రహం – 5,10 స్థానాలకు అధిపతి కుజ నక్షత్రంలో స్థితి కావడం చేత 3,7,12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
    12వ స్థానం పడక సుఖాలకు కారకత్వం వహిస్తుంది
  • భుక్తి అధిపతి రాహు గ్రహం – వృషభ రాశిలో చంద్ర గ్రహానికి చెందిన రోహిణి నక్షత్రంలో స్థితి, కావున 3,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి
  • అంతర అధిపతి గురు గ్రహం – 10వ స్థానంలో స్థితి, 8,11 స్థానాలకు అధిపతి
    8వ స్థానం మాంగళ్యం విషయానికి కారకత్వం వహిస్తుంది. ఇది అమ్మాయి చార్ట్ కావున పరిగణలోకి తీసుకోవచ్చు.

ఫైనల్ జడ్జిమెంట్

  • బుధ మహాదశలో / రాహు భుక్తి / గురు అంతర –
    ఆగష్టు 10, 2021 నుండి డిసెంబర్ 13, 2021 మధ్యలో ఈ అమ్మయికి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుందని చెప్పవచ్చు

హోరారీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్ https://nsteluguastrology.com/horary-astrology-rules/

ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది  https://www.youtube.com/nsteluguworld