జ్యోతిష్య వృత్తి – సంపాదన

జ్యోతిష్య వృత్తి – సంపాదన

హోరారీ ఆస్ట్రాలజీ – జ్యోతిష్య వృత్తి

జ్యోతిష్య వృత్తిలో ధన సంపాదన ఎలా ఉంటుందనే విషయానికి హోరారీ ఆస్ట్రాలజీలో 123వ నెంబర్ తీసుకోవడం జరిగింది. హోరారీ ప్రశ్న : జ్యోతిష్య వృత్తి ఎలా ఉంటుంది ? హోరారీ నెంబర్ : 123 చార్టు వేసుకున్న తేదీ : జూలై 13, 2021 చార్టు వేసుకున్న సమయం : 11:6:32 AM చార్టు వేసుకున్న స్థలం : జహీరాబాద్ కె పి రూల్ : 10వ స్థానం సబ్ లార్డ్ కు – 2,9,10,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 2,9,10,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో ధన సంపాదన బాగుంటుంది. ఇక్కడ 123వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు.

చంద్ర గ్రహం 11వ స్థానానికి అధిపతి

 • చంద్ర గ్రహం 11వ స్థానంలో కేతు నక్షత్రం / చంద్ర షబ్ లో ఉంది.
 • కేతు గ్రహం 2వ స్థానంలో స్థితి. కావున చంద్ర గ్రహం 2వ స్థానంలో బలంగా ఉంది.
 • చంద్ర గ్రహానికి 2, 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ రావడం చేత జాతకుడి యొక్క మైండ్ హోరారీ ప్రశ్నకు సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.

విశ్లేషణ పద్ధతి – 10వ స్థానం సబ్ లార్డ్ బుధ గ్రహం

 • ఈ బుధ గ్రహం – రాహు నక్షత్రం / రాహు సబ్ లో ఉంది. కావున 10వ స్థానానికి ఈ రెండు గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలి
 • బుధ గ్రహం 9వ స్థానంలో స్థితి. 1,10 స్థానాలకు అధిపతి.
 • రాహు గ్రహం 8వ స్థానంలో చంద్ర గ్రహానికి చెందిన రోహిణి నక్షత్రంలో స్థితి.
 • కావున రాహు గ్రహం 11వ స్థానంలో చాల బలంగా ఉన్నాడు.
 • 10వ స్థానానికి 1,8,9,10,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
 • 2వ స్థానానికి సిగ్నిఫికేషన్స్ రాలేదు. రూల్ ప్రకారం 2వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ వస్తే ఇంకా బాగుండేది.
 • అదనంగా 8వ స్థానంతో కూడా సిగ్నిఫికేషన్స్ వచ్చాయి. 8వ స్థానం జ్యోతిష్యానికి కారకత్వం వహిస్తుంది.
 • 10వ స్థానం సబ్ లార్డ్ కు సిగ్నిఫికేషన్స్ పాజిటివ్ గా వచ్చాయి. కావున జ్యోతిష్య వృత్తి ద్వారా సంపాదన బాగుంటుందని చెప్పవచ్చు.

ప్రస్తుత మహాదశ / భుక్తి విశ్లేషణ పద్ధతి

ప్రస్తుతం కేతు మహాదశ మార్చి 2026 వరకు ఉంది.

 • కేతు 2వ స్థానంలో అనురాధ నక్షత్రంలో స్థితి.
 • కావున 5,6 స్థానాలకు సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
 • కేతు గ్రహం 5వ స్థానానికి జ్యోతిష్యానికి కారకత్వం వహిస్తుంది. 6వ స్థానం రుణాలు.
 • కేతు మహా దశలో సంపాదన బాగుంటుందని చెప్పవచ్చు
 • 2వ స్థానం ధన సంపాదన

ప్రస్తుతం కేతు మహాదశ / చంద్ర భుక్తి ఫిబ్రవరి 2021 నుండి సెప్టెంబర్ 2021 వరకు ఉంది

 • చంద్ర గ్రహం 11వ స్థానానికి అధిపతి. మరియు 11వ స్థానంలో కేతు నక్షత్రంలో స్థితి. కావున 2వ స్థానంలో చంద్ర గ్రహం బలంగా ఉంది.
 • కావున చంద్ర భుక్తిలో ధన సంపాదన చాల బాగుంటుంది.
 • ఇదే పద్దతిలో కేతు మహాదశలో తరువాత కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు మరియు శుక్ర గ్రహాల భుక్తి ఉంటాయి.
 • ఈ భుక్తి అధిపతులను కూడా విశ్లేషణ చేసి, ఏ భుక్తిలో ధన సంపాదన బాగుంటుందని చెప్పవచ్చు.
హోరారీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్ http://89g.b09.myftpupload.com/horary-astrology-rules/ ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది  https://www.youtube.com/nsteluguworld