హోరారీ ఆస్ట్రాలజీ – అప్పుగా తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తాడు.
నాకు తెలిసిన ఒక వ్యక్తి KP హోరారీ లో 118వ నెంబర్ ఇచ్చి హోరారీ ప్రశ్న అడిగాడు. నేను నా స్నేహితుడికి డబ్బులు అప్పుగా ఇచ్చాను. ఆ డబ్బు ఎప్పుడు ఇస్తాడు.
హోరారీ ప్రశ్న : డబ్బులు
హోరారీ నెంబర్ : 118
హోరారీ చార్టు వేసుకున్న తేదీ : మార్చి 14, 2021
హోరారీ చార్ట్ వేసుకున్న సమయం : 11:54:32 AM
హోరారీ చార్టు వేసుకున్న స్థలం : జహీరాబాద్
KP రూల్
- 11వ స్థానం సబ్ లార్డ్ కు – 1,2,6,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండాలి
- 1వ స్థానం కష్టపడి సంపాదించిన డబ్బు, 2వ స్థానం ధనం, 6వ స్థానం రుణాలు, 11వ స్థానం లాభాలు.
- ఈ డబ్బు 1,11 లేదా 2,11 లేదా 6,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు చెందిన దశ, భుక్తి, అంతర కాలంలో వస్తాయి.
ఇక్కడ 118వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు.
చంద్ర గ్రహం 11వ స్థానానికి అధిపతి
- 6వ స్థానంలో శని నక్షత్రం/ శుక్ర సబ్ లో ఉంది.
- శని గ్రహం 5,6 స్థానాలకు అధిపతి
- శుక్ర గ్రహం 6వ స్థానంలో స్థితి. 2,9 స్థానాలకు అధిపతి.
- చంద్ర గ్రహానికి 2,6,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- ప్రశ్న అడిగిన వ్యక్తి డబ్బు సమయానికి వస్తుందా లేదా అనే ఆలోచనలతో ఉన్నాడని చాలా స్పష్టంగా అర్టం అవుతుంది.
విశ్లేషణ పద్ధతి
11వ స్థానం సబ్ లార్డ్ శుక్ర గ్రహం
- శుక్ర గ్రహం గురు నక్షత్రం / శుక్ర సబ్ లో ఉంది.
- కావున 11వ స్థానానికి ఈ రెండు గ్రహాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేయాలి.
- శుక్ర గ్రహం 6వ స్థానం కుంభ రాశిలో స్థితి, 2,9 స్థానాలకు అధిపతి.
- గురు గ్రహం 5వ స్థానం మకరరాశిలో కుజ గ్రహానికి చెందిన ధనిష్ట నక్షత్రంలో స్థితి.
- కావున 8, 3 స్థానలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- గురు గ్రహం 4, 7 స్థానాలకు అధిపతి
- 11వ స్థానానికి 2, 4, 5, 6, 8, 9 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- ఇక్కడ 8వ స్థానం ప్రోవిడెంట్ ద్వారా లేదా ఇన్సురెన్స్ ద్వారా లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే డబ్బు విషయానికి కారకత్వం వహిస్తుంది.
- 11వ స్థానం మరియు 1వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ రాలేదు.
- గురు గ్రహం 7వ దృష్టితో 11వ స్థానం కర్కాటక రాశిని అలాగే 9వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు.
- ఈ దృష్టి 8 డీగ్రీలలోపు ఉంది కావున 1, 11 స్థానాలతో కూడా సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
ప్రస్తుత మహాదశ / భుక్తి / అంతర విశ్లేషణ పద్ధతి
- శని మహాదశ/శుక్ర భుక్తి / గురు అంతర – డిసెంబర్ 2020 నుండి జూన్ 2, 2021 వరకు ఉంది
- ఈ జాతకుడు మార్చి 14, 2021 రోజున ప్రశ్న అడిగాడు. ఈ రోజు నుండి జూన్ 2, 2021 వరకు ఉంది
- మహాదశ అధిపతి శని గ్రహం చంద్ర నక్షత్రంలో స్థితి. చంద్ర గ్రహం 6వ స్థానంలో స్థితి, 11వ స్థానానికి అధిపతి
- భుక్తి అధిపతి శుక్ర గ్రహం 6వ స్థానంలో గురు నక్షత్రంలో స్థితి. కావున 1, 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- అంతర అధిపతి గురు గ్రహం – పైన వివరించిన విశ్లేషణ పద్ధతి ప్రకారం 1, 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
ఫైనల్ జడ్జిమెంట్
- ఈ విశ్లేషణ పద్దతిని పరిగణలోకి తీసుకుని, ప్రశ్న అడిగిన రోజు మార్చి 14, 2021 నుండి జూన్ 2, 2021 మధ్యలో తన స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది.
- మే 27, 2021 రోజున తన స్నేహితుడు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇచ్చారని ఫోన్ చేసి చెప్పారు.
గురూజీ కృష్ణమూర్తి గారికి మరియు గురూజీ KN రావు గారికి ప్రణామాలు.
హోరారీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్ https://nsteluguastrology.com/horary-astrology-rules/
హోరారీ ఆస్ట్రాలజీ – ప్రేమ వివాహం https://nsteluguastrology.com/kp-horary-astrology-love-marriage/
ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది https://www.youtube.com/nsteluguworld