త్రికరణ శుద్ధితో ఈ మంత్రాన్ని విన్నా, జపించిన మానసిక రుగ్మతల ను దూరం చేస్తుంది
- ఓం భూర్భువస్సువః
- తత్సవితుః వరేణియం
- భర్గో దేవస్య ధీమహి
- ధియో యోనః ప్రచోదయాత్
ఈ మంత్రలోని ప్రతి బీజాక్షరానికి మనస్సును, మెదడును ఉత్తేజపరిచే వైబ్రేషన్స్ ఉన్నాయని ఋగ్వేదంలో చెప్పబడింది.
ఓం భూర్భువస్సువః
- ఓం – పరమేశ్వర నామం
- భూర్ – భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరికి ప్రాణవాయువు, పదార్థాలు ఇవ్వడం
- భువః – మానసిక సమస్యల నుండి విముక్తి పొందడం
- సువః – ఆధ్యాత్మిక జ్ఞానం నుండి సుఖ సంతోషాలను పొందడం
ఇక తరువాత గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలు
- తత్ – గణేశుడు – విజయం
- స – నృసింహస్వామి – దైర్యం
- వి – విష్ణు – కార్య నిర్వహణ అధికారం
- తుర్ – ఈశ్వరుడు – శ్రేయస్సు
- వ – శ్రీకృష్ణ – యోగం
- రే – రాధాదేవి – ప్రేమ
- ణీ – లక్ష్మీదేవి – ధనం
- యం – సరస్వతి – జ్ఞానం
- భర్ – భార్గవ – రక్షణ
- గో – గోమతి – తెలివి
- దే – దేవిక – తగ్గుట
- వ – వారాహి – భక్తి
- స్య – భూదేవి – దేవతల తల్లి
- ధీ – సూర్యుడు – వెలుగు
- మ – మర్యాద – గౌరవం పొందడం
- హి – తపస్సు – పశ్చత్తాపం
- ది – మేధావి – దూరదృష్టి
- యో – భ్రమ – మేల్కొలుపు
- యో – యోగిని – ఉత్పత్తి ప్రక్రియ
- నః – ధరణి – మధురం
- ప్ర – ప్రభవ – ఆదర్శం
- చొ – దైర్యం
- ద – ద్రస్య – జ్ఞానం
- యత్ – సేవ, ప్రార్ధన చేయడం
గాయత్రీకి మూడు పేర్లు – గాయత్రీ, సావిత్రి, సరస్వతి
- ఇంద్రియములకు గాయత్రీ
- సత్యమునకు సావిత్రి
- వాగ్దేవత స్వరూపిణి – హృదయం, వాక్కు క్రియలకు సరస్వతి
త్రికరణ శుద్ధితో ఈ మంత్రాన్ని విన్నా, జపించిన బీజాక్షరాల ధ్వని ప్రకంపనలు మనస్సు , శరీరం ఒక తెలియని అనుభూతికి లోనవుతుంది. తద్వారా పాజిటివ్ గా ఆలోచించే ఆలోచన శక్తి పెరుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
జ్యోతిష్య పరిహారాలు : https://nsteluguastrology.com/category/articles/astro-remedies-telugu/
NS తెలుగు ఆస్ట్రాలజీ యు ట్యూబ్ ఛానల్ – https://www.youtube.com/nsteluguworld
Aryan Astrology Research Centre – https://aryanastrologyresearchcentre.blogspot.com