Horary Astrology – ఆరోగ్యం
మే 23, 2021 రోజున ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుండి ఫోన్ చేసి – తన భర్త హాస్పిటల్ లో అడ్మిట్ చేసాం, ఎప్పుడు ఇంటికి క్షేమంగా వస్తారు? అని అడగడం జరిగింది. హోరారీ నెంబర్ 115 ఇచ్చారు.
హోరారీ ప్రశ్న : హాస్పిటల్ నుండి ఎప్పుడు వస్తారు
హోరారీ నెంబర్ : 115
చార్టు వేసుకున్న తేదీ : 03-05-2021
చార్టు వేసుకున్న సమయం : 03:29:09 PM
చార్టు వేసుకున్నస్థలం : Zahirabad
కె పి రూల్ : 1వ స్థానం సబ్ లార్డ్ కు – 1,5,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 1,5,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో ఇంటికి క్షేమంగా వస్తారు
లేదా 2,4,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో ఇంటికి క్షేమంగా వస్తారు?
- 1వ స్థానం ఆరోగ్యం
- 5వ స్థానం, 11వ స్థానం – రోగాన్ని నయం చేయడం
- 2వ స్థానం కుటుంబం
- 4వ స్థానం గృహం
6,8,12 స్థానాలతో మరియు భాధక, మారక స్థానాలతో ఏ మాత్రం సిగ్నిఫికేషన్స్ ఉండకూడదు.
ఇక్కడ 55వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు.
లగ్నం కన్య రాశి – భాధక స్థానం 7వ స్థానం అవుతుంది
చంద్ర గ్రహం 11వ స్థానానికి అధిపతి
- 5వ స్థానం మకర రాశిలో స్వంత నక్షత్రం శ్రవణం లో స్థితి.
- చంద్ర గ్రహం 5,11 స్థానాలలో బలంగా ఉంది.
- చంద్ర గ్రహనికి 5,11 స్థానాలతో సిగిఫికేషన్స్ వచ్చాయి. ప్రశ్న అడిగిన వ్యక్తి మైండ్ ఆరోగ్యం గురించి చాల స్పష్టంగా తెలియజేస్తుంది.
విశ్లేషణ పద్ధతి
- 1వ స్థానం సబ్ లార్డ్ గురు – కుజ నక్షత్రం / శుక్ర సబ్ లో ఉంది.
- గురు గ్రహం 5వ స్థానంలో స్థితి. 4,7 స్థానాలకు అధిపతి.
- కుజ గ్రహం 9వ స్థానంలో స్థితి కావటం చేత గురు గ్రహం 9వ స్థానంలో బలంగా ఉన్నాడు.
- కుజ గ్రహం 9వ స్థానంలో రాహు నక్షత్రంలో ఉంది. రాహు గ్రహం కూడా 9వ స్థానంలో స్థితి అయ్యాడు. కావున 9వ స్థానంలో కుజ గ్రహం బలంగా ఉన్నాడు.
- కుజ గ్రహం 3,8 స్థానాలకు అధిపతి.
- శుక్ర గ్రహం 8వ స్థానంలో స్థితి సూర్య నక్షత్రంలో స్థితి, సూర్య గ్రహం కూడా 8వ స్థానంలో స్థితి అయ్యాడు, అలాగే 12వ స్థానానికి అధిపతి. కావున 12వ స్థానంలో శుక్ర గ్రహం బలంగా ఉంది
- శుక్ర గ్రహం 2,9 స్థానాలకు అధిపతి.
- 6వ స్థానానికి – 2,3,4,5,7,8,9,12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
- 5వ స్థానం చికిత్స – కావున ట్రీట్మెంట్ జరుగుతుంది.
8,12 మరియు భాధక స్థానం 7వ స్థానం మరియు మారక స్థానాలు 2,7 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి. 11వ స్థానంతో రాలేదు. కావున తీవత్ర ఎక్కువగా ఉంటుంది. - 8వ స్థానం తీవ్రత, 12వ స్థానం హాస్పిటల్ గురించి తెలియజేస్తుంది.
- గురు, కుజ, శుక్ర గ్రహాలకు 9వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ రావడం చేత ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటె 9వ స్థానం అదృష్టాల గురించి తెలియజేస్తుంది
ప్రస్తుత దశ విశ్లేషణ పద్ధతి
- ప్రస్తుతం చంద్ర మహాదశలో / గురు భుక్తి / గురు అంతర –
మార్చి 16, 2021 నుండి – మే 20, 2021 - ప్రస్తుతం చంద్ర మహాదశలో / గురు భుక్తి / శని అంతర –
మే 20, 2021 నుండి – ఆగష్టు 5,2021 - ప్రస్తుతం చంద్ర మహాదశలో / గురు భుక్తి / శని అంతర / శని సూక్ష్మ –
మే 20, 2021 నుండి – జూన్ 1,2021
- మహాదశ చంద్ర – 5వ స్థానంలో బలంగా ఉంది. 11వ స్థానానికి అధిపతి అలాగే 11వ స్థానంలో బలంగా ఉంది.
భుక్తి / అంతర అధిపతి గురు గ్రహం – పైన వివరించిన సిగ్నిఫికేషన్స్ వర్తిస్తాయి. - శని 5వ స్థానంలో చంద్ర గ్రహానికి చెందిన శ్రవణంలో స్థితి. కావున 11వ స్థానంలో బలంగా ఉన్నాడు.
- శని గ్రహం 7వ దృష్టితో 11వ స్థానం కర్కాటక రాశిని చూస్తున్నాడు, అలాగే చంద్ర గ్రహం కూడా చూస్తున్నది.
- శని గ్రహం 7వ దృష్టితో 11వ స్థానం కర్కాటక రాశిని చూస్తున్నాడు. అలాగే చంద్ర గ్రహం కూడా చూస్తున్నది.
ఫైనల్ ప్రిడిక్షన్
- ప్రస్తుతం జరుగుతున్నదశ, భుక్తి, అంతర మరియు సూక్ష్మ కాలాల అధిపతులు 5,11 మరియు 2,4,11 స్థానాలకు సిగ్నిఫికెటర్స్ అయ్యారు.కావున హాస్పిటల్ నుండి ఇంటికి మే 20, 2021 నుండి – జూన్ 1,2021 మధ్యలో వస్తాడని చెప్పవచ్చు.
- మే 26, 2021 బుధవారం రోజున హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి వచ్చాడు.
హోరారీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్ https://nsteluguastrology.com/horary-astrology-rules/
ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్ : https://www.youtube.com/nsteluguastrology