ప్రశాంతమైన నిద్ర కోసం – వేదిక్ మంత్రాలు / శ్లోకాలు

ప్రశాంతమైన నిద్ర కోసం – వేదిక్ మంత్రాలు / శ్లోకాలు

వేదిక్ మంత్రం / శ్లోకము

 • యా దేవీ సర్వభూతేషు !
  నిద్ర రూపేణా సంస్థితా !
  నమస్తస్యై నమస్తస్యై !
  నమస్తస్యై నమో నమః !

హనుమాన్ మంత్రం / శ్లోకము

 • రామస్కందం హనూమంతం !
  వైనతేయం వృకోదరమ్ !
  శయనే యః స్మరేత్ నిత్యం !
  దుస్వప్నం తస్య నస్యతే !

ఈ శ్లోకాలను రాత్రి పడుకునే ముందు జ్ఞాన ముద్రలో ఉండి జపించాలి.
జ్ఞాన ముద్ర అనగా చేతి బొటనవేలు మరియు చూపుడు వేలు ఒకదగ్గరికి చేయాలి. ఈ ముద్రను ప్రాణ శక్తినిచ్చే ధ్యాన ముద్ర అంటారు.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు వేదిక్ శ్లోకాన్ని జపించాలి.
నిద్రలో చెడు స్వప్నాలు వస్తున్నవారు హనుమాన్ శ్లోకం జపించాలి.
ప్రతిరోజు జ్ఞాన ముద్రలో ఉండి జపించడం వలన ప్రశాంతమైన నిద్ర వస్తుంది.

ఇలా క్రమం తప్పకుండా వారం రోజులు చేయండి. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. మొదటి రోజు 15 నిమిషాలతో మొదలుపెట్టి వారం తరువాత సమయాన్ని తగ్గిస్తూ ప్రతి రోజు ఒక అలవాటుగా కనీసం 5 నిముషాలు ఈ శ్లోకాలను జపించడం మరి మంచిది.