KP హోరారీ ఆస్ట్రాలజీ నెంబర్ 32 – ప్రేమ వివాహం
నేను ఒక అబ్బాయిని ఒక సంవత్సరం ప్రేమించాను. పెద్దల అంగీకారంతో మా ప్రేమ వివాహం జరుగుతుందా లేదా ? ఒకవేళ జరిగితే ఎప్పుడు జరుగుతుంది?
హోరారీ ప్రశ్న నెంబర్ : ప్రేమ వివాహం
హోరారీ నెంబర్ : 32
చార్టు వేసుకున్న తేదీ : 05-06-2021
చార్టు వేసుకున్న సమయం : 11:45:42 PM
చార్టు వేసుకున్నస్థలం : Zahirabad
కె పి రూల్ :
5వ స్థానం సబ్ లార్డ్ కు – 2,5,7,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె, 2,5,7,11 స్థానాల యొక్క సిగ్నిఫికేటర్స్కు సంబంధించిన దశ, భుక్తి, అంతర కాలములో ప్రేమ వివాహం జరుగుతుంది.
అదనంగా 3వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె పెద్దల అంగీకారంతో జరుగుతుంది.
- 2వ స్థానం కుటుంబం
- 5వ స్థానం ప్రేమ
- 7వ స్థానం వివాహం, జీవిత భాగస్వామి
- 11వ స్థానం స్నేహం, కమ్యూనికేషన్స్
- 3వ స్థానం పెద్దల అంగీకారం
- 8వ స్థానం మాంగల్యం – ఇది అమ్మాయి చార్ట్ కావున 8వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఇంకా మంచిది
ఇక్కడ అమ్మాయి ఇచ్చిన 32వ నెంబర్ ప్రకారం – హోరారీ ప్రశ్న చార్టు, మరియు 12 స్థానాల డిగ్రీలు అలాగే గ్రహాల డిగ్రీల పట్టికలు ఇవ్వడం జరిగింది గమనించగలరు.
చంద్ర గ్రహం 3వ స్థానానికి అధిపతి
- 11వ స్థానం మీనా రాశిలో బుధ గ్రహానికి చెందిన రేవతి నక్షత్రంలో స్థితి.
- బుధ గ్రహం 2, 5 స్థానాలకు అధిపతి
- చంద్ర గ్రహానికి 2,5 మరియు 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ రావడం చేత హోరారీ ప్రశ్న అడిగిన జాతకురాలి మైండ్ చాలా స్పష్టంగా ప్రేమ వివాహం జరుగుతుందా లేదా అని తెలియజేస్తుంది.
విశ్లేషణ పద్ధతి
5వ స్థానం సబ్ లార్డ్ శని – చంద్ర నక్షత్రం / బుధ సబ్ లో ఉంది.కావున 5వ స్థానానికి ఈ గ్రహాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
- శని గ్రహం 9వ స్థానంలో స్థితి. 9,10 స్థానాలకు అధిపతి.
- చంద్ర గ్రహం 11వ స్థానంలో స్థితి. 3వ స్థానానికి అధిపతి.
- చంద్ర గ్రహం బుధ నక్షత్రంలో స్థితి కావడం చేత 2,5 స్థానాలలో బలంగా ఉంది.
- బుధ గ్రహం 1వ స్థానం వృషభ రాశిలో కుజ నక్షత్రంలో స్థితి, 2, 5 స్థానాలకు అధిపతి.
- కుజ గ్రహం 7, 12 స్థానాలను అధిపతి, 3వ స్థానంలో స్థితి అయ్యాడు, కావున బుధ గ్రహానికి ఈ స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయని అర్థం చేసుకోగలరు.
- 5వ స్థానానికి 2,3,5,7,9,10,11,12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి. కావున ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతో జరుగుతుంది. ఎందుకంటె చంద్ర, బుధ గ్రహాలకు 3వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
ఎప్పుడు జరుగుతుంది ?
- ప్రస్తుత దశ విశ్లేషణ పద్ధతి
ప్రస్తుతం బుధ మహాదశలో / రాహు భుక్తి / గురు అంతర –
ఆగష్టు 10, 2021 నుండి డిసెంబర్ 13, 2021 - మహాదశ బుధ గ్రహం – 5,10 స్థానాలకు అధిపతి కుజ నక్షత్రంలో స్థితి కావడం చేత 3,7,12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి.
12వ స్థానం పడక సుఖాలకు కారకత్వం వహిస్తుంది - భుక్తి అధిపతి రాహు గ్రహం – వృషభ రాశిలో చంద్ర గ్రహానికి చెందిన రోహిణి నక్షత్రంలో స్థితి, కావున 3,11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయి
- అంతర అధిపతి గురు గ్రహం – 10వ స్థానంలో స్థితి, 8,11 స్థానాలకు అధిపతి
8వ స్థానం మాంగళ్యం విషయానికి కారకత్వం వహిస్తుంది. ఇది అమ్మాయి చార్ట్ కావున పరిగణలోకి తీసుకోవచ్చు.
ఫైనల్ జడ్జిమెంట్
- బుధ మహాదశలో / రాహు భుక్తి / గురు అంతర –
ఆగష్టు 10, 2021 నుండి డిసెంబర్ 13, 2021 మధ్యలో ఈ అమ్మయికి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుందని చెప్పవచ్చు
హోరారీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్ https://nsteluguastrology.com/horary-astrology-rules/
ఆస్ట్రాలజీ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది https://www.youtube.com/nsteluguworld