కుంభ రాశి / లగ్నం – అధిపతి శని గ్రహం
- శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు.కుంభ రాశి నుండి కుంభ రాశి 1వ స్థానము అవుతుంది
- గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. కుంభ రాశి నుండి మేషరాశి 3వ స్థానం అవుతుంది.
ధన సంపాదన :
శని గ్రహ గోచరం కుంభ రాశిలోనే స్థితి. అలాగే మీనా రాశి 2వ స్థానం అవుతుంది. కేతు గ్రహ గోచార స్థితి కన్య రాశి నుండి కుంభ రాశి 6వ స్థానం అవుతుంది. కావున కేతు గ్రహ ప్రభావంలో కుంభ రాశి మీద లేదు.
కావున అగ్ని సంబంధ సంస్థలలో పని చేసేవారికి ధన సంపాదన బాగుంటుంది. అలాగే కెమికల్ సంబంధిత ఉద్యోగస్తులకు మరియు వ్యాపారం చేసేవారికి కూడా 2023 సంవత్సరంలో ధన సంపాదనతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి.
జ్యోతిష్య వృత్తిలో ఉన్నవారికి అలాగే ఆధ్యాత్మిక సంబంధిత సంస్థలలో పనిచేసే వారికి మాములుగా ఉంటుంది. అలాగే మిగతా వారికి అసలు బాగుండదు.
- కుంభ లగ్నానికి అధిపతి శని గ్రహం – లగ్నంలో లేదా 4వ స్థానం వృషభ రాశిలో లేదా 5వ స్థానం మిథున రాశిలో లేదా 9వ స్థానం తుల రాశిలో స్థితి అయి 2 స్థానము మీనా రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు బాగుంటాయి.
- అలాగే శని గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 2వ స్థానం మీనా రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు అద్భుతంగా ఉంటాయి.
- అలాగే బుధ గ్రహానికి చెందిన నక్షత్రాలలో లేదా శుక్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 2 స్థానము మీనా రాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు ఇంకా బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి శని భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి శని గ్రహం మీద ఫలితాలు చాలా బాగుంటాయి. అలాగే రాహు, కేతు గ్రహాల దృష్టి శని గ్రాహం మీద ఉంటె ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.
సంఖ్యా శాస్త్ర ప్రకారం
- సంఖ్యా శాస్త్ర ప్రకారం జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.
కుటుంబం :
- కేతు గ్రహ ప్రభావం వలన కుంభ రాశి వారికి, భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. అలాగే నూతన దంపతుల మధ్య కూడా అన్యోనత ఉండదు.
- గురు గ్రహ గోచార ప్రభావం వలన ఈ గొడవలు మరింత పెద్దవి కాకుండా చేస్తాడు. అయినా కూడా కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉండదు.
- గర్భంతో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటె గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఆరోగ్యం :
- కుంభ రాశి చీలమండలు, శ్వాసక్రియ విషయాలకు కారకత్వం వహిస్తుంది.
- అలాగే శని గ్రహం మోకాళ్ళ నొప్పులు, చర్మం, జుట్టు ఊడిపోవుట, పంటి సమస్యలు, ఎముకలు, నరాల బలహీనత విషయాలకు కారకత్వం వహిస్తాడు.
- ఈ రాశి వారికి శ్వాస సంబందిత సమస్యలు బాధిస్తాయి. అలాగే అదనంగా రక్తహీనత లేదా విటమిన్ సమస్యలు ఉన్నవారికి శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి.
- రాశి చక్రంలో శని గ్రహం బలహీనంగా ఉంటె మోకాళ్ళ నొప్పులు మరియు చీలమండల నొప్పులు బాధిస్తాయి. ఒకవేళ 12వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె ఈ నొప్పులు భరించలేనంతగా ఉంటాయి.
- కేతు గ్రహ గోచార ప్రభావంలో శని గ్రహం ఉంటే సంతాన సమస్యలు బాధిస్తాయి
పరిహారాలు :
- ప్రతి మంగళవారం వినాయకుడి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు విష్ణు గాయత్రి మంత్రం జపించాలి.
- కుంభ రాశిలో ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి.
- అలాగే వీరికి రాశి 2023 సంవత్సరంలో సంతాన సమస్యలు ఉంటాయి. సంతాన సమస్యలు ఉన్నవారు లేదా ఆలస్యం అవుతున్నవారికి సంతాన గోపాల మంత్రం ప్రతిరోజూ 108 సార్లు జపించాలి
విష్ణు గాయత్రి –
- ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి,
తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
ధనిష్ఠ గాయత్రి మంత్రం –
- ఓం అగ్ర నాథాయ విద్మహే
సుప్రీతాయ ధీమహి
తన్నో శర్విష్ఠా: ప్రచోదయాత్
శతభిష గాయత్రి మంత్రం –
- ఓం భేషజాయ విద్మహే
వరుణ దేహాయ ధీమహి
తన్నో శతభిషం: ప్రచోదయాత్
పూర్వాభాద్ర గాయత్రి మంత్రం –
- ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి తన్నో
పూర్వప్రోష్టపత: ప్రచోదయాత్
సంతాన గోపాల మంత్రం –
- || ఓం దేవకీ సుత గోవిందా
వాసుదేవ జగత్పతే
దేహిమే తనయం కృష్ణా
త్వా మహం శరణం గతః ||