మకర రాశి  రాశి / లగ్నం – 2024

మకర రాశి / లగ్నం – అధిపతి చంద్ర గ్రహం

  • శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు.మకర రాశి నుండి కుంభ రాశి 2వ స్థానము అవుతుంది
  • గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. మకర రాశి నుండి మేషరాశి 4వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

మకర రాశికి 2వ స్థానం కుంభ రాశి అవుతుంది. అలాగే మేష రాశి 4వ స్థానం అవుతుంది. రాహు, కేతు గ్రహాల ప్రభావం మకర రాశి మీద లేదు. కావున 2023 సంవత్సరంలో చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం ఏదైనా సరే ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే అదృష్టాలు వరిస్తాయి. ప్రత్యేకించి భూ సంబంధ వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టె అవకాశాలు ఉన్నాయి

  • మకర లగ్నానికి అధిపతి శని గ్రహం  – లగ్నంలో లేదా  2వ స్థానం  కుంభ రాశిలో లేదా 5వ స్థానం వృషభ రాశిలో లేదా  9వ స్థానం కన్యా రాశిలో లేదా 10వ స్థానం తుల రాశి స్థితి అయి  2 స్థానము మీనా రాశితో రాశితో  సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు చాలా బాగుంటాయి.
  • అలాగే శని గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 3వ స్థానం / 3వ స్థానాధిపతి గురు గ్రహంతో సిగ్నిఫి కేసన్స్ ఉంటె పలితాలు ఇంకా బాగుంటాయి.
  • అలాగే ప్రస్తుతము వీరికి శని భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
  • గురు, శని గ్రహాల గోచార దృష్టి శని గ్రహం మీద ఫలితాలు చాలా బాగుంటాయి. అలాగే రాహు, కేతు గ్రహాల దృష్టి శని గ్రాహం మీద ఉంటె ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

  • సంఖ్యా శాస్త్ర ప్రకారం డిసెంబర్ 22 నుండి జనవరి 20 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.

కుటుంబం :

  • కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న కుటుంబ కోర్టు కేసుల విషయంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
  • ఎప్పటికి కుటుంబంతో ఆనందంగా ఉంటారు. వీలైనప్పుడలా కుటుంబమంతా కలిసి తీర్థ యాత్రలు కూడా చేసే అవకాశాలు ఈ 2023 సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి.
  • గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వివాహం కానివారికి వివాహాలు కూడా జరుగుతాయి. కొత్తగా వివాహం అయినవారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి.

ఆరోగ్యం :

  • మకర రాశి మోకాళ్ళు, ఎముకలు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
  • అలాగే శని గ్రహం మోకాళ్ళ నొప్పులు, చర్మం, జుట్టు ఊడిపోవుట, పంటి సమస్యలు, ఎముకలు, నరాల బలహీనత విషయాలకు కారకత్వం వహిస్తాడు.
  • కావున 2023 సంవత్సరంలో ఈ రాశి వారికి పంటి సమస్యలు, జుట్టు ఊడిపోవడం, చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి.
  • రాశి చక్రంలో శని గ్రహానికి 1, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి, బుధ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె నరాల బలహీనత ఉంటుంది.
  • అలాగే శని గ్రహానికి 6, 8 స్థానాలతో మరియు కుజ గ్రహంతో సిగ్నిఫికేషన్స్ సిగ్నిఫికేషన్స్ ఉంటె రక్తహీనత సమస్యలు ఉంటాయి.
  • అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాతం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • అలాగే 2023 సంవత్సరంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.

పరిహారాలు :

  • ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శ్రీ హనుమ గాయత్రి మంత్రం జపించాలి.
  • మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి

శ్రీ హనుమ గాయత్రి –

  • ఓం అంజనీ సుతాయ విద్మహే
    వాయుపుత్రాయ ధీమహి,
    తన్నోమారుతిః ప్రచోదయాత్.

ఉత్తరాషాఢ గాయత్రి మంత్రం

  • ఓం విశ్వేదేవాయ విద్మహే
    మహాషాఢాయ ధిమహి
    తన్నో ఉత్తరాషాఢా: ప్రచోదయాత్

శ్రవణ గాయత్రి మంత్రం –

  • ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
    పుణ్యశ్లోకాయ ధీమహి
    తన్నో శ్రవణ ప్రచోదయాత్

ధనిష్ఠ గాయత్రి మంత్రం –

  •  ఓం అగ్ర నాథాయ విద్మహే
    సుప్రీతాయ ధీమహి
    తన్నో శర్విష్ఠా: ప్రచోదయాత్