తులా రాశి / లగ్నం – 2024

తులా రాశి / లగ్నం – అధిపతి శుక్ర గ్రహం

  • శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు. తులారాశి నుండి కుంభ రాశి 6వ స్థానము అవుతుంది
  • గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. తులారాశి నుండి మేషరాశి 7వ స్థానం అవుతుంది.

ధన సంపాదన :

తులా రాశి శని గ్రహ గోచార ప్రభావంలో ఉంది. అలాగే కేతు గ్రహ గోచార స్థితి కూడా తులా రాశిలో ఉంది. గురు గ్రహ గోచార స్థితి ప్రభావం తులారాశి మీద లేదు. కావున ఈ రాశి వారికీ 2023 సంవత్సరంలో ధన సంపాదన మాములుగా ఉంటుంది. ఫాషన్ డిజైనింగ్ ఉద్యోగస్తులకు,  మరియు వ్యాపారస్తులకు మాత్రమే కాస్త బాగుంటుంది, అలాగే  ఆహార సంబంధ వ్యాపారాలు మరియు వ్యవసాయం చేసేవారికి కూడా కాస్త బాగుంటుంది. మిగతా వారికి అసలు బాగుండదు.

  • తుల లగ్నానికి అధిపతి శుక్ర గ్రహం – లగ్నంలో లేదా 5వ స్థానం కుంభ రాశిలో లేదా 9వ స్థానం మిథున రాశిలో లేదా 10వ స్థానం కర్కాటక రాశిలో బుధ నక్షత్రం అశ్లేషలో స్థితి అయి 4వ స్థానము మకర రాశితో  సిగ్నిఫికేసన్స్ ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి.
  • అలాగే శుక్ర గ్రహానికి చెందిన నక్షత్రాలలో శుక్ర గ్రహం స్థితి అయి 4వ స్థానము మకర రాశితో మరియు 3వ స్థానము ధనుస్సు రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు ఇంకా బాగుంటాయి.
  • అలాగే ప్రస్తుతము వీరికి శుక్ర భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
  • వ్యక్తిగత రాశి చక్రంలో గురు, శని గ్రహాల గోచార దృష్టి శుక్ర గ్రహం మీద ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి. అలాగే రాహు, కేతు గ్రహాల ప్రభావములో ఉంటె ఫలితాలు అసలు బాగుండవు.

సంఖ్యా శాస్త్ర ప్రకారం

  • సంఖ్యా శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.

కుటుంబం :

  • శని, కేతు గ్రహ గోచార ప్రభావం వలన కుటుంబంలో జరగాల్సిన శుభకార్యాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయ. అలాగే భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. వీటి కారణంగా కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉండదు.
  • వ్యక్తి గత రాశి చక్రంలో గురు గ్రహ గోచార దృష్టి శుక్ర గ్రహం మీద ఉంటె కుటుంబంలో జరగాల్సిన శభకార్యాలు జరుగుతాయి. అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది.

ఆరోగ్యం :

  • తులా రాశి మూత్రపిండాలు, గర్భాశయం విషయాలకు కారకత్వం వహిస్తుంది.
  • అలాగే శుక్ర గ్రహం అండాశయ సమస్యలు, అందం మరియు ముఖం మీద మచ్చలు, లైంగిక సమర్థత, నేత్ర సంబంధ సమస్యలు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
  • తులారాశి శని మరియు రాహు, కేతు గ్రహాల గోచార ప్రభావంలో ఉంది. కావున గర్భంతో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • అలాగే మూత్రపిండ సమస్యలు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ శుక్ర గ్రహానికి 12వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మరింత జాగ్రత్తగా ఉండాలి.
  • శుక్ర గ్రహానికి సూర్య గ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉండి 2, 6,8 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె నేత్ర సంబంధ వ్యాధులు ఉంటాయి.
  • వ్యక్తిగత రాశి చక్రంలో బుధ, శుక్ర గ్రహాలు ఒకరి నక్షత్రంలో ఒకరు స్థితి అయిన లేదా ఈ గ్రహాలకు 2, 6 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండి, కేతు గ్రహ గోచార ప్రభావంలో ఉంటె చర్మ సంబంధ వ్యాధులు లేదా ముఖం మీద మచ్చలు వస్తాయి.

పరిహారాలు :

  • ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శ్రీ లక్ష్మీ గాయత్రి మంత్రం జపించాలి.
  • తులా రాశిలో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి.

శ్రీ లక్ష్మీ గాయత్రి –

  • ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే
    విష్ణుప్రియాయై ధీమహి,
    తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.

చిత్త గాయత్రి మంత్రం –

  • ఓం మహాదృష్టాయై విద్మహే
    ప్రజారపాయై ధీమహి
    తన్నో చిత్త: ప్రచోదయాత్

స్వాతి,గాయత్రి మంత్రం –

  • ఓం కామసారాయై విద్మహే
    మహాని ష్ఠాయై ధీమహి
    తన్నో స్వాతి: ప్రచోదయాత్

విశాఖ గాయత్రి మంత్రం –

  • ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
    మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
    తన్నో విశాఖ: ప్రచోదయాత్