మీన రాశి / లగ్నం – అధిపతి గురు గ్రహం
- శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు.కుంభ రాశి నుండి మీన రాశి 2వ స్థానము అవుతుంది
- గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. కుంభ రాశి నుండి మేషరాశి 12వ స్థానం అవుతుంది.
ధన సంపాదన :
మీన రాశికి శని గ్రహ గోచార స్థితి 12వ స్థానం అవుతుంది. గురు గ్రహ గోచర స్థితి మేష రాశిలో ఉంది. అలాగే మీనా రాశికి రాహు గ్రహ గోచార స్థితి 1వ స్థానం అవుతుంది. కావున మీనా రాశి రాహు గ్రహ గోచార ప్రభావములో ఉంది.
గురు, శని, రాహు గ్రహాల కాంబినేషన్ చాలా మంచింది. కావున 2024 సంవత్సరంలో మీనా రాశి వారి వృత్తి లేదా వ్యాపారం ఏదైనా సరే ధన సంపాదన చాల బాగుంటుంది. అలాగే మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే అదృష్టాలు కూడా వరిస్తాయి.
ఏ పని మొదలు పెట్టిన విజయవంతం అవుతుంది. స్థిరాస్తులు కొంటారు లేదా బిల్డింగ్స్ కట్టుకుంటారు. అలాగే వాహనాలను కూడా కొంటారు. అలాగే మరికొందరు బంగారం మీద పెట్టుబడులు పెడుతారు.
- మీనలగ్నానికి అధిపతి గురు గ్రహం – లగ్నంలో లేదా 2వ స్థానం మేష రాశిలోలేదా 5వ స్థానం కర్కాటక రాశిలో లేదా 9వ స్థానం వృచ్చికరాశిలో స్థితి అయి 11వ స్థానం మకర రాశితో మరియు 10వ స్థానం ధనుస్సు రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు చాలా బాగుంటాయి.
- గురు గ్రహం గురు నక్షత్రంలో స్థితి అయి 11వ స్థానం మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు గ్రహం చంద్ర నక్షత్రంలో లేదా కుజ నక్షత్రంలో స్థితి అయి 11వ స్థానం మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు చాలా బాగుంటాయి
- ప్రస్తుతము వీరికి గురు భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి గురు గ్రహం మీద ఫలితాలు చాలా బాగుంటాయి. ఒకేవేళ రాహు, కేతు గ్రహాల గోచార దృష్టి గురు గ్రహం మీద ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి
సంఖ్యా శాస్త్ర ప్రకారం
- సంఖ్యా శాస్త్ర ప్రకారం ఫిబ్రవరి 20 నుండి మర్చి 20 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.
కుటుంబం :
- ఈ సంవత్సరంలో కుటుంబంతో సంతోషంగా ఉంటారు. బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. సంవత్సరమంతా ఇంట్లో పండగలాంటి వాతావరణం ఉంటుంది.
- ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
- సంతానం ఆలస్యం అవుతున్నవారికి కూడా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి.
- సందర్భం వచ్చినప్పుడల్లా కుటుంబమంతా కలిసి తీర్థ యాత్రలు కుల చేస్తారు.
ఆరోగ్యం :
- మీనా రాశి పాదాలు, రక్త సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు, జల సంబంధ వ్యాధులు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
- అలాగే గురు గ్రహం ఉపిరిత్తితులు, మూత్రపిండ సమస్యలు, చెవి సంబంధ సమస్యలు, పచ్చ కామెర్లు విషయాలకు కారకత్వం వహిస్తుంది
- సహజంగా జల సంబంధ వ్యాధులు అనగా జలుబు, దగ్గు లాంటి సమస్యలు తరుచుగా వస్తుంటాయి.
- గురు గ్రహానికి కుజ గ్రహం మరియు 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
- గురు గ్రహానికి కుజ, శుక్ర గ్రహాలు మరియు 2,8, 12 స్థానాలతోసిగ్నిఫికేషన్స్ ఉంటె మూత్రపిండ సమస్యలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి
- గురు, శని, చంద్ర గ్రహాల కలయికకు 4, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె పచ్చ కామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పరిహారాలు :
- ప్రతి గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు గురు గాయత్రి మంత్రం జపించాలి.
- మీనా రాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి
గురు గాయత్రి –
- ఓం సురాచార్యాయ విద్మహే
వాచస్పత్యాయ ధీమహి,
తన్నోగురుః ప్రచోదయాత్
పూర్వాభాద్ర గాయత్రి మంత్రం –
- ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి తన్నో
పూర్వప్రోష్టపత: ప్రచోదయాత్
ఉత్తరాభాద్ర గాయత్రి మంత్రం –
- ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో
ఉత్తరప్రోష్టపత: ప్రచోదయాత్
రేవతి గాయత్రి మంత్రం –
- ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి: ప్రచోదయాత్
2023 సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? – http://89g.b09.myftpupload.com/astrology-predictions-2023/