ధనుస్సు రాశి / లగ్నం – అధిపతి గురు గ్రహం
- శని గోచరము – జనవరి 1 రోజున కుంభ రాశిలోకి ప్రేవేశిస్తాడు.ధనుస్సు రాశి నుండి కుంభ రాశి 3వ స్థానము అవుతుంది
- గురు గోచరము – జనవరి 1 రోజున మేష రాశిలో 11:28:50 డిగ్రీలలో ఉన్నాడు. ధనుస్సు రాశి నుండి మేషరాశి 5వ స్థానం అవుతుంది.
ధన సంపాదన :
ధనుస్సు రాశికి 3వ స్థానం కుంభ రాశి అవుతుంది. అలాగే 5వ స్థానం మేష రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి ఈ గురు, శని గ్రహాల ప్రభావములో ఉంది.
అలాగే ధనుస్సు రాశికి 5వ స్థానం మీన రాశిలో రాహు గ్రహ గోచార స్థితి. అంటే ధనుస్సు రాశి రాహు గ్రహ ప్రభావంలో ఉంది.
చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ధన సంపాదన బాగుంటుంది. అలాగే లాయర్స్, ఇంజనీరింగ్ వృత్తిలో ఉండేవారికి కూడా ధన సంపాదనతో పాటు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే జ్యోతిష్య వృత్తిలో ఉండేవారికి కూడా ధన సంపాదన పెరుగుతుంది.
అలాగే భూ సంబంధ వ్యాపారాలు చేసేవారికి నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి
- ధనుస్సు లగ్నానికి అధిపతి గురు గ్రహం – లగ్నంలో లేదా 4వ స్థానం మీన రాశిలో లేదా 5వ స్థానం మేష రాశిలో లేదా 9వ స్థానము సింహ రాశిలో స్థితి అయి 2వ స్థానం మకర రాశితో సిగ్నిఫి కేసన్స్ ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి
- అలాగే గురు గ్రహానికి చెందిన నక్షత్రాలలో లేదా సూర్య గ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి అయి 2వ స్థానం మకర రాశితో సిగ్నిఫికేసన్స్ ఉంటె పలితాలు ఇంకా బాగుంటాయి.
- అలాగే ప్రస్తుతము వీరికి గురు భుక్తి నడిస్తే పలితాలు అద్బుతంగా ఉంటాయి.
- గురు, శని గ్రహాల గోచార దృష్టి గురు గ్రహం మీద ఉంటె ఫలితాలు చాలా బాగుంటాయి. ఒకవేళ లేకపోతె ఆర్థికంగా నష్టాలు ఉంటాయి.
- అలాగే రాహు, కేతు గ్రహాల గోచార దృష్టి గురు గ్రాహం మీద ఉంటె నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సంఖ్యా శాస్త్ర ప్రకారం
- సంఖ్యా శాస్త్ర ప్రకారం నవంబర్ 23 నుండి డిసెంబర్ 21 మధ్యలో జన్మించిన వారికి ధన సంపాదన చాలా బాగుంటుంది. అలాగే పైన చెప్పబడిన ఫలితాలు చాలా బాగుంటాయి. మిగతా వారికి మామూలుగా ఉంటుంది.
కుటుంబం :
- కుటుంబంలో పండగలాంటి వాతావరణం ఉంటుంది. బంధువులతో స్నేహ బంధాలు మెరుగవుతాయి. అలాగే సమయానికి సహాయం అందుతుంది. వివాహం కానివారికి వివహం జరిగే అవకాశాలు ఉంటాయి.
- అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభ వార్తలు వింటారు.
- వ్యక్తిగత రాశి చక్రంలో గురు, శుక్ర గ్రహాలు రాహు, కేతు గ్రహాల గోచార ప్రభావములో ఉంటె ఫలితాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. ఒకవేళ లేకపోతె ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి.
ఆరోగ్యం :
- ధనుస్సు రాశి తొడలు, ఋతుక్రమ సమస్యలు, రక్త సంబంధిత సమస్యలు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
- అలాగే గురు గ్రహం ఉపిరిత్తితులు, మూత్రపిండ సమస్యలు, చెవి సంబంధ సమస్యలు, పచ్చ కామెర్లు విషయాలకు కారకత్వం వహిస్తుంది.
- రాశి చక్రంలో గురు గ్రహ ప్రభావం రాహు, కేతు గ్రహాల ప్రభావములో ఉండి, 6, 8 స్థానాలతో సిగిఫికేషన్స్ ఉంటె ఉపిరిత్తితుల సమస్యలు లేదా లివర్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
- గురు, శుక్ర గ్రహాలు రాహు, కేతు గ్రహాల ప్రభావములో ఉండి, 1, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటె మూత్రపిండ సమస్యలు బాధిస్తాయి.
- కుజ, శుక్ర గ్రహాలు రాశి చక్రంలో బలహీనంగా ఉండి, రాహు, కేతు గ్రహాల ప్రభావంలో ఉంటె ఋతుక్రమ సమస్యలు ఉంటాయి.
పరిహారాలు :
- ప్రతి గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే ప్రతి రోజు శ్రీ గురు గాయత్రి మంత్రం జపించాలి.
- ధనుస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర గాయత్రి మంత్రం జపించాలి
శ్రీ గురు గాయత్రి –
- ఓం సురాచార్యాయ విద్మహే
వాచస్పత్యాయ ధీమహి,
తన్నోగురుః ప్రచోదయాత్
మూల గాయత్రి మంత్రం –
- ఓం ప్రజాధిపాయై విద్మహే
మహా ప్రజాధి దాయై ధీమహి
తన్నో మూల: ప్రచోదయాత్
పూర్వాషాఢ గాయత్రి మంత్రం –
- ఓం సముద్ర కామాయై విద్మహే
మహా వీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్
ఉత్తరాషాఢ గాయత్రి మంత్రం –
- ఓం విశ్వే దేవాయ విద్మహే
మహాషాఢాయ ధీమహి
తన్నో ఉత్తరాషాఢ: ప్రచోదయాత్